కమ్యూనిస్టు మేనిఫెస్టో
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhdsZ_9UOERmZ7V5pM0VIe3dc32ESO2H5_ENjVho7k58AxDhYtWtc9Zp2IZjZXyeilf5BWAAK0GQ5uqXhrYL52pz4ln1c8OsmSwXHwh0bKf3HPxGvgQb5a6k0ytZbhzOWEs54j-6nYhubk/s1600/1634171771812000-0.png)
కమ్యూనిస్టు మేనిఫెస్టో (కార్ల్ మార్క్స్) మానవజాతి జీవితాన్ని కమ్యూనిస్టు మేనిఫెస్టో గ్రంథం (1848) మార్చివేసినంత సమగ్రంగా మరే గ్రంథమూ మార్చివేయలేదు. అందుకనే 1967లో ఈ గ్రంథం పెలికాన్ ఎడిషన్కు ముందుమాట రాసిన ఎ.జి.పి. టేలర్ ఇలా పేర్కొన్నారు. "బైబిల్, ఖురాన్ల మాదిరిగా అదే ఒరవడిలో వచ్చిన పవిత్ర గ్రంథం ఇది" కేవలం 33 పేజీలలో 12,000 పదాలతో కూడిన కమ్యూనిస్టు మేనిఫెస్టో తదుపరి ప్రచురణలలో అంతకంటే సుదీర్ఘమైన ముందు మాటలు ఉండటం విశేషం. అనేక... ప్రపంచ భాషల్లో కూడా ఈ గ్రంథం ప్రచురితమైంది. 1848-1918 మధ్య 515 ఎడిషన్లు వచ్చాయి.. 1919-1959 మధ్య కాలంలో మరో 218 ఎడిషన్లు వచ్చాయి. బోల్షివిక్ విప్లవానికి ముందు లెనిన్ రాసిన 'రాజ్యం - విప్లవం' అనే గ్రంథం కమ్యూనిస్టు మేనిఫెస్టోను సుసంపన్నం చేయటం మాత్రమే! 'కమ్యూనిస్టు మేనిఫెస్టో' గ్రంథం చదివిన వారెవరూ కూడా ప్రారంభ వాక్యాన్ని మరిచిపోలేరు. చదవని వారికి కూడా ఈ వాక్యం సుపరిచితమే. "ఒక భూతం యూరప్ ను వెంటాడుతోంది. అదే కమ్యూనిస్టు భూతం - అదే విధంగా గ్రంధం చివరి వాక్యాలను కూడా ఎవరూ మర్చిపోలేరు. "కమ్యూనిస్టు విప్లవాన్ని తలచుకు...