కమ్యూనిస్టు మేనిఫెస్టో
కమ్యూనిస్టు మేనిఫెస్టో (కార్ల్ మార్క్స్)
మానవజాతి జీవితాన్ని కమ్యూనిస్టు మేనిఫెస్టో గ్రంథం (1848) మార్చివేసినంత సమగ్రంగా మరే గ్రంథమూ మార్చివేయలేదు. అందుకనే 1967లో ఈ గ్రంథం పెలికాన్ ఎడిషన్కు ముందుమాట రాసిన ఎ.జి.పి. టేలర్ ఇలా పేర్కొన్నారు. "బైబిల్, ఖురాన్ల మాదిరిగా అదే ఒరవడిలో వచ్చిన పవిత్ర గ్రంథం ఇది"
కేవలం 33 పేజీలలో 12,000 పదాలతో కూడిన కమ్యూనిస్టు మేనిఫెస్టో తదుపరి ప్రచురణలలో అంతకంటే సుదీర్ఘమైన ముందు మాటలు ఉండటం విశేషం. అనేక... ప్రపంచ భాషల్లో కూడా ఈ గ్రంథం ప్రచురితమైంది. 1848-1918 మధ్య 515 ఎడిషన్లు వచ్చాయి.. 1919-1959 మధ్య కాలంలో మరో 218 ఎడిషన్లు వచ్చాయి. బోల్షివిక్ విప్లవానికి ముందు లెనిన్ రాసిన 'రాజ్యం - విప్లవం' అనే గ్రంథం కమ్యూనిస్టు మేనిఫెస్టోను సుసంపన్నం చేయటం మాత్రమే!
'కమ్యూనిస్టు మేనిఫెస్టో' గ్రంథం చదివిన వారెవరూ కూడా ప్రారంభ వాక్యాన్ని మరిచిపోలేరు. చదవని వారికి కూడా ఈ వాక్యం సుపరిచితమే. "ఒక భూతం యూరప్ ను వెంటాడుతోంది. అదే కమ్యూనిస్టు భూతం - అదే విధంగా గ్రంధం చివరి వాక్యాలను కూడా ఎవరూ మర్చిపోలేరు.
"కమ్యూనిస్టు విప్లవాన్ని తలచుకుని పాలకవర్గాలు. గడగడలాడిపోతాయి. కార్మిక వర్గాలు పోరాడితే కోల్పోయేది ఏమీ లేదు. తమ సంకెళ్లు తప్ప ప్రపంచ కార్మికులారా! ఏకం కండు!!".
కమ్యూనిస్టు మేనిఫెస్టో అంటే జర్మన్ తత్వశాస్త్రం, ఫ్రెంచి రాజకీయాలు, ఆంగ్ల అర్థశాస్త్రాల కలయిక అని టేలర్ పేర్కొన్నారు. 'కమ్యూనిస్టు మేనిఫెస్టో' మార్చ్, ఎంగెల్స్ సమిష్టి రచనగా పేర్కొన్నప్పటికీ, 1888లో ఈ గ్రంథం ఇంగ్లీష్ ఎడిషన్కు ఎంగెల్స్ స్వయంగా ముందు ' మాట రాస్తూ ఇలా పేర్కొన్నారు. మా సమిష్టి రచనగా మేనిఫెస్టో పేర్కొన్నప్పటికీ, ఈ గ్రంథానికి ఆధారితమైన ప్రాథమిక ప్రతిపాదన మార్క్స్ కే చెందుతుంది. "మానవ జాతి చరిత్ర సమస్తం వర్గ పోరాటాల చరిత్రే" అనేదే ఆ కీలకమైన ప్రధానమైన ప్రతిపాదన. సమాజ చరిత్రను పేర్కొంటూ 'మేనిఫెస్టో' గ్రంథం ప్రారంభమవుతుంది.
బూర్జువా వర్గం వల్ల సమాజానికి కలిగిన మేలును మొదట మార్క్స్ వివరిస్తారు. తరువాత అసలు బూర్జువా సమాజాన్నే నిరసిస్తారు. ఆ తరువాత బూర్జువా వర్గ ఆధిపత్యంపై తీవ్రమైన యుద్ధం ప్రకటిస్తారు. "బూర్జువా వర్గం తనకు మరణం తెచ్చి పెట్టే ఆయుధాలను తయారుచేసుకోవటమే కాక, ఆ ఆయుధాలను ధరించే వ్యక్తులను కూడా సృష్టించింది. వీరే ఆధునిక కార్మికవర్గం" అని మార్క్స్ పేర్న్నారు.
తరువాత కమ్యూనిస్టు పార్టీ స్థానం గురించి మేనిఫెస్టో వివరిస్తుంది. తమ కార్యక్రమం కోసం మేనిఫెస్టోను తయారు చేయవలసిందిగా కోరుతూ కమ్యూనిస్టు లీగ్ మార్క్స్, ఎంగెల్స్ ను ఆహ్వానించింది. జర్మనీ కార్మిక వర్గంతో కూడిన ఈ లీగ్ తరువాత కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ గా మారింది. 1847 నవంబర్లో లండన్లో జరిగిన మహాసభలో మార్క్స్ ఎంగెల్స్ కు ఈ బాద్యత అప్పగించారు. 1848, జనవరి 26న కమ్యూనిస్టు -ఇంటర్నేషనల్ లండన్ కమిటీ బ్రస్సెల్సు కు ఒక అల్టిమేటం పంపింది. ఫిబ్రవరి 1 నాటికల్లా మేనిఫెస్టోను తయారు చేయకపోతే, ఆయనపై చర్య తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. గడువు తేదీ లోపల మేనిఫెస్టోను పూర్తి చేశారు. 1848లో జరిగిన జర్మన్ విప్లవాల కల్లోలిత కాలంలో ఈ మేనిఫెస్ట్ పై పెద్దగా ఎవరి దృష్టి పడలేదు.
(ఎనాలిసిస్, జనవరి,2006)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి