GDP ఎలా పంపిణీ అవుతోంది?
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఏ కొలబద్దతో చూసినా సగటు లేదా తలసరి ఆదాయంతో ఒక దేశంలోని పౌరుల సంక్షేమాన్ని కొలవడం సముచితం కాదు. అది తెలుసుకోవాలంటే మొత్తం ఆదాయం లేదా స్థూల దేశీయ ఉత్పత్తి (జి.డి.పి.) ఎలా పంపిణీ అవుతుందో చూడాలి
అంశాన్ని కొంత విపులీకరించాలంటే పొంతనలేని రెండు పంపిణీ ఈ విధానాలున్న సమాజాలను చూడండి. మొదటి సమాజంలో పంపిణీ పూర్తి సమానంగా అంటే ఒక్కో వ్యక్తికి 23,000 రూపాయల ఆదాయం ఉంది జనాభా 100 ఉంది. ఈ పద్ధతిలో అయితే సగటు మనిషి ఆదాయాన్ని లెక్కించడానికి తలసరి ఆదాయం కచ్చితమైన కొలబద్ద.
ఇక రెండో సమాజం గురించి చూడండి.
99 మంది బానిసలకు తలా వంద రూపాయల ఆదాయం మాత్రమే ఉన్న బానిస సమాజాన్ని ఊహించండి. మిగతా ఆదాయం అంతా ఒకే ఒక్క బానిస యజమానికి వెళుతుంది. యజమాని ఆదాయాన్ని ఇలా లెక్క కట్టవచ్చు : మొత్తం సమాజం ఆదాయం అంటే దాని జి.డి.పి. (100 మంది వ్యక్తులు X వ్యక్తికి 23,000 రూపాయలు). ఇందులో నుంచి 99 మంది బానిసల (99 X 100) మొత్తం ఆదాయాన్ని తీసివేయాలి. అంటే బానిస యజమాని ఆదాయం 22,90,100 అవుతుంది. అది ఒక బానిస ఆదాయం కన్నా 22.9 వేలరెట్లు ఎక్కువ
బానిస సమాజం ఉదాహరణతో మనం ఒక ముఖ్యమైన గుణపాఠం నేర్చుకోవాలి. దీనిలో సగటు ఆదాయం వల్ల వ్యక్తం చేసే దానికన్నా దాచి పెట్టేదే ఎక్కువ. అది బానిసల కటిక దారిద్ర్యాన్ని, బానిస యజమాని విపరీతమైన సంపత్తిని నిగూఢంగా ఉంచుతుంది. ఆర్థిక సమాచారాన్ని విడమర్చడంలో దీనివల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు: ఈ బానిస ఆర్ధిక వ్యవస్థ బాగా పని చేస్తోందా లేదా అన్నది చూసేవారి దృక్పథాన్ని బట్టి ఉంటుంది. బానిసల దృష్టితో చూస్తే అది అన్యాయమైన సమాజం. కానీ బానిస యజమాని దృష్టి నుంచి చూస్తే అది అద్భుతమైన సమాజం. ఏదో ఒక కారణం వల్ల, ఉదాహరణకు - తనకు ప్రత్యేకమైన సామర్థ్యం ఉండం వల్ల బాగా చదువుకున్నందువల్లో, లేదా గత జీవితంలో తను చేసిన మంచి పనుల
వల్ల తనకు ఎక్కువ ఆదాయం రావడం న్యాయమే అని అనుకుంటాడు. సంపన్నుల ఈ స్వయం హేతుబద్దీకరణ నుంచే జాగ్రత్తగా ఉండాలని గాంధీజీ హెచ్చరించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల వారి అభివృద్ధి దృష్టితో అభివృద్ధి ఎంత వరకు విజయవంతం అయిందో చూడాలి
కొంతవరకు సంక్లిష్టమైనదే అయినా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ అంశాలే ఉంటాయి. ఉదాహరణకు పేదల పరిస్థితిలో మార్పు లేని మరింత ఎక్కువ జి.డి.పి. అభివృద్ధి రేటు గురించి ఆలోచించవచ్చు. ఈ ఉదాహరణను పరిశీలించడానికి జిడిపిలో 10 శాతం అభివృద్ధి ఉందనుకోండి (1.100 X2300 అంటే 99 మంది బానిసలకు తలా వంద రూపాయలే వస్తాయి.
బానిస యజమాని ఆదాయం మాత్రం 26,20, 100 అవుతుంది. అంటే అతని ఆదాయం బానిస ఆదాయం కన్నా 26.2 వేల రెట్లు ఎక్కువ ఈ ఉదాహరణలో అభివృద్ధి ఫలితాలు అన్నీ బానిస యజమానికే దక్కుతాయి.బానిసలకు మాత్రం ఏ ఫలితాలూ అందవు. ఈ రకమైన అభివృద్ధి ఆదాయం, లేదా సాపేక్షికమైన పంపిణీ విధానంలో అంతరం, మరింత పెరుగుతుంది, అంటే ఇప్పుడు యజమానితో పోలిస్తే బానిసలు మరింతగా పేదలై పోతారు. అయితే వాస్తవంలో వారు మునుపు ఎంత పేదలుగా ఉన్నారో అంతే పేదలుగా ఉంటారు. వారి ఆదాయం తలకు 100 మాత్రమే ఉంటుంది
అత్యధికులు పేదలుగా ఉన్నచోట కేవలం అభివృద్ధి మాత్రమే పరిష్కారం కాదని ఈ ఉదాహరణను పరిశీలిస్తే తెలుస్తుంది. అభివృద్ధి ఫలాలు ఎలా పంపిణీ అవుతున్నాయో కూడా తెలుసుకోవాలి. అభివృద్ధి క్రమం స్వభావాన్ని బట్టి ఆ ఫలాలను అనేక పద్ధతుల్లో పంపిణీ చేయవచ్చు. స్థూలంగా చెప్పాలంటే పదిశాతం అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధి సంపన్నులకు అనుకూలంగా ఉంటుంది. వారి ఆదాయం 10 శాతం పెరుగుతుంది. పేదల ఆదాయం పదిశాతం కన్నా తక్కువగా ఉంటుంది. ఈ ఉదాహరణ ప్రకారం సంపన్నులు కచ్చితంగా మరింత సంపన్నులు అవుతున్నారు. కానీ పేదలు సాపేక్షికంగానే పేదలు అవుతున్నారు తప్ప వాస్తవంలో కావడం లేదు. ఇండియా లాంటి పేద దేశంలో దీనివల్ల సాపేక్షిక పేదరికం పెరుగుతుంది తప్ప కచ్చితమైన పేదరికం పెరగదు. అలా జరగాలంటే పేదల ఆదాయంలో అభివృద్ధి రేటు ప్రతికూలంగా తయారు కావాలి. అంటే అది తగ్గాలి. దీనికి విరుద్ధంగా పేదల ఆదాయం సంపన్నుల ఆదాయం కన్నా త్వరితంగా పెరిగితే అభివృద్ధి పేదలకు అనుకూలమైందిగా కూడా ఉండొచ్చు. అంటే నిరపేక్ష పేదరికం, సాపేక్షిక పేదరికం రెండూ తగ్గవచ్చు. ఒకవేళ అభివృద్ధి క్రమం వల్ల పంపిణీ విధానం మారకపోతే సాపేక్షిక పేదరికంలో కూడా మార్పు ఉండదు. కాని నిరపేక్ష అంశాలలో అందరూ ప్రయోజనం పొందుతారు.
భారత్ లో చాలా మంది పేదలు బతుకు ఈడ్వడమే కష్టంగా ఉన్న స్థితిలో అభివృద్ధి ప్రక్రియ పంపిణీ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించాలి. దీనికి మూల కారణం మామూలుదే. పేదలకు నష్టం కలిగించే పంపిణీ వ్యవస్థ ఉన్న 14న మగలను మరింత నిరుపేదలుగా మారుస్తుంది. పేదలుగా ఉన్న అత్యంత ఆనంద్యాల ప్రజలపై ఎలాంటి ప్రభావం కలగజేస్తుందో తెలియకపోతే అభివృద్ధి రేటు ఎంత ఎక్కువగా ఉన్నా ఫలితం లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే తను అభిప్రాయాలను వ్యక్తం చేసే అధికారం పేదలకు ఉన్న ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ ఉన్నప్పటికీ దీనికి సమాధానం పాక్షికంగా మాత్రమే లభిస్తుంది. ఇటీవలి సాధారణ ఎన్నికల (2004) ఫలితాలను చూస్తే ఇది సృష్టంగా తెలుస్తుంది, దూసుకు వెళుతున్న స్టాక్ మార్కెట్, సంపన్నులవుతూ, విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి వర్గం బి.జె.పి. నేతృత్వంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి దేశం యావత్తూ సుభిక్షంగా ఉందన్న అభిప్రాయం కలగజేశాయి. నాడు 'భారత్ వెలిగిపోతోంది' అన్న నినాదం తయారుచేశారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైనందువల్ల ఆ నినాదం ఘోరంగా విఫలం అయింది. అనేక మంది ఆర్థిక నిపుణులు, మీడియా వ్యాఖ్యాతలు ఆశ్చర్య చకితులయ్యారు. అంతకు ముందు ఆర్థిక వ్యవస్థను సరళీకరించినందుకు, అభివృద్ధి సాధించే విధానాలను ప్రవేశ పెట్టినందుకు గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి కూడా 1996 ఎన్నికల్లో ఇలాంటి గతే పట్టిందని మరిచిపోకూడదు. వాదోపవాదాలు గణాంకాలు, వివాదాలు పక్కన పెట్టినా మన ఆర్థిక విధానాలకు, రాజకీయ వ్యవస్థలకు మధ్య ఎక్కడో లంకె ఘోరంగా తెగిందని స్పష్టం అవుతోంది. మెరుగైన అభివృద్ధి వల్ల భారత్ లోని చాలా మంది పేదల ఆశలు నెరవేరవు. కానీ వారు ఎన్నికలు వచ్చినప్పుడే వ్యతిరేక ఓటు వేయడం ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేయగలరు. అయితే వారు అభివృద్ధి ప్రక్రియను మార్చలేరు. ప్రభావితం చేయలేరు. మధ్య తరగతి వర్గం వారు సంపన్నులు అవుతున్న కొద్దీ, స్టాక్ మార్కెట్ దూసుకెళుతున్న కొద్దీ, జి.డి.పి. అభివృద్ధి రేటు ఎక్కువగా ఉంటున్న కొద్దీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ తదుపరి ఎన్నికల్లో తమ భవిష్యత్తు తేలే సమయం వచ్చేదాకా భారత్ వెలిగిపోతోందన్న రాగాన్నే ఆలపిస్తుంటాయి. అప్పుడే పేదలు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి తమ నిరసన వ్యక్తం చేయగలరు. త్వరితంగా పేదల పరిస్థితిని
మెరుగు చేయడం ఎలా అన్న విషయాన్ని మన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ చెప్పలేదు. మన ఆర్థిక విధానానికి, రాజకీయ వ్యవస్థకు మధ్య సంబంధం .లేకపోవడం అనే లోపాన్ని సరిదిద్దడం ఒక సవాలు. ఈ సవాలును ఎదుర్కోకుండా ఉండడం భారత్ కు ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు.
___అమిత్ భాదురి (గౌరవప్రదమైన అభివృద్ధి)
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి