కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి



        ఐరాస పతాకం pc Wikipedia

విశ్వ మానవాళి శ్రేయస్సుకోసమే ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. కాని బహుళజా సంస్థలు దాని పాత్రను భ్రష్టు పట్టించే ప్రమాదముంది. 1970 మధ్య దశకం నుండి కార్పొరేట్ సంస్థలు ఐక్యరాజ్యసమితి పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. 1975 నుండి 1992 వరకు బహుళజాతి సంస్థలకు నిబంధనావళిని రూపొందించే విషయమై ఐక్యరాజ్యసమితిలో అనేకమార్లు చర్చ జరిగింది. 1992 నాటికి కార్పొరేట్ సంస్థలు మరింత బలపడడంతో నిబంధనావళి చర్చలకు తెరపడింది. ఎనలేని అధికారాలను, పలుకుబడిని సంతరించుకున్న బహుళజాతి సంస్థలు తమ కార్యకలాపాలను నియంత్రించేందుకు నియమావళి అంటూ ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదని ఐక్యరాజ్యసమితిని బుజ్జగించాయి.

బహుళజాతి సంస్థలపై ఐరాస కేంద్రం 1974లో ఏర్పాటైంది. వాణిజ్య వ్యవహారాలపై కేంద్రం ఐరాస ప్రధాన కార్యాలయం నుండి నిఘా వేసి ఉండేది. అన్ని దేశాలకు చెందిన కార్పొరేట్ సంస్థలకు ఒక నియమావళి ఏర్పాటు చేసి, అతిధేయ దేశాల ప్రయోజనాలు కాపాడాలని, పేద దేశాల బేరమాడే సామర్థ్యాన్ని పెంచాలని, జాతీయ అభివృద్ధి లక్ష్యాల్లో అంతర్భాగంగా బహుళజాతి సంస్థలు నడుచుకునేలా చూడాలని బరాసు కేంద్రం ప్రయత్నించింది. అలాగే సభ్య దేశాలు తమ పౌరుల పెట్టుబడులకు, వాటాలకు భంగం వాటిల్లకుండా బహుళజాతి సంస్థలపై నియంత్రణ కలిగి ఉండాలని, విదేశీ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి భాగస్వామ్యంలో అందరూ లాభపడేలా.. వ్యవస్థను తీర్చిదిద్దాలని కూడా సంకల్పించింది.

రాజ్యసమితి సంకల్పం కార్పొరేట్ రంగ శక్తియుక్తుల ముందు నిలువలేకపోయింది. 1978లో స్విట్జర్లాండ్కు చెందిన అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ సాలిడారిటీ అనే సంస్థ ఐరాస అంతర్గత నివేదికల నుండి సంకలించబడిన కొన్ని విషయాలను ప్రచురించింది. కార్పొరేట్ రంగ అధికారం, పలుకుబడికి ఎల్లలు లేవని ఈ ప్రచురణ నిరూపించింది. ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల్లో బహుళజాతి కంపెనీలు ఎంతవరకు చొచ్చుకుపోయాయో, వాటిని ఎలా నియంత్రిస్తున్నాయో, ఇంకా చెప్పాలంటే వాటిని ఎలా దుర్వినియోగ పరుస్తున్నాయో ఆ రహస్య నివేదికల్లో ప్రస్తావించబడింది.

ఐక్యరాజ్యసమితి కార్పొరేట్ సంస్థలపై నిర్వహించిన చర్చల సందర్భంగా అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలు కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించి వాటి పెట్టుబడులను పరిరక్షించాలని అభివృద్ధి చెందుతున్న దేశాలకు సూచించాయి. ఇందుకు ప్రతిస్పందించిన తృతీయ ప్రపంచపు దేశాలు తమ జాతీయ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా బహుళజాతి
సంస్థలు వ్యవహరించాలని అందుకు తగిన వ్యవస్థ ను, నియమావళిని రూపొందించాలని డిమాండ్ చేశాయి..
చేశాయి. తమ జాతీయ ఆర్థిక వ్యవస్థకు కార్పొరేట్ సంస్థలు బాధ్యత వహించాలని, ప్రజల, పర్యావరణ ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలని వాదించాయి. అయితే నియమావళిలో ఈ అంశానికంటే ఆతిథ్య దేశాలు కార్పొరేట్ సంస్థల పట్ల వ్యవహరించాల్సిన తీరుపైనే ఎక్కువగా చర్చ జరిగింది. 1980 నాటికి ఈ చర్చ స్వరూపం పూర్తిగా మారిపోయింది. మారుతున్న ప్రపంచ మార్కెట్ అవసరాల దృష్ట్యా అనేక దేశాలు విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచాయి. పెట్టుబడులకు సరైన రాబడి కల్పిస్తామని, వాటిని సంరక్షిస్తామని, వాణిజ్యానికి ఎలాంటి
అడ్డంకులు కల్పించబోమని బహుళజాతి సంస్థలకు స్పష్టమైన హామీలు ఇవ్వసాగాయి.

1990 దశకంలో తమ పాత్రపై అనవసర చర్చలకు తెరదించేలా ఐక్యరాజ్యసమితిని బహుళజాతి సంస్థలు విజయవంతంగా ఒప్పించగలిగాయి. 1992లో ఐరాస నిర్వహించిన ధరిత్రీ సదస్సులోను, 1995లో నిర్వహించిన సామాజికాభివృద్ధి ప్రపంచ సదస్సులోను కార్పొరేట్ సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ, ఇతర అంతర్జాతీయ నిబంధనలు చర్చకు రాకుండా అవి అడ్డుకోగలిగాయి.

అయితే 2002లో జోహాన్నెస్బర్లో జరిగిన "నిలకడైన అభివృద్ధి" సదస్సులో కార్పొరేట్ రంగ సామాజిక బాధ్యతలు అనే అంశం ప్రస్తావనకు రాకుండా చూడాలని అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా నామమాత్రపు విజయాన్ని కూడా సాధించలేకపోయాయి. ప్రపం. ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన, అసహనం కారణంగా ఆ సదస్సుకు హాజరైన స్వచ్ఛం సంస్థలు కార్పొరేట్ రంగం అంశాన్ని అజెండాలో చేర్చగలిగాయి. ఈ సదస్సు సాధించిం పరిమిత విజయాల్లో కార్పొరేట్ రంగ సామాజిక బాధ్యత పెంపొందించడం, దానిని ప్రజల జవాబుదారీగా చేయడం ముఖ్యమైనదని మార్టిన్ ఖోర్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఒప్పందాలు, చట్టాల ఆధారంగా బహుళజాతి సంస్థలు తమ ఆతిథ్య దేశ సమగ్ర  వికాసానికి, అభివృద్ధి లక్ష్యాల సాధనకు తమ వంతు కృషి చేయాలని నిలకడైన అభివృద్ధి పై జరిగిన అంతర్జాతీయ సదస్సు పిలుపు నిచ్చిందని ఖోర్ చెప్పారు.

జాన్ మెడలె(ప్రపంచీకరణ ప్రజలు ప్రత్యామ్నాయాలు) నుండి
( ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురణ)




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?