కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.
కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.
పేదలకు అప్పులు తీరడం, దున్నుకోడానికి భూమి దొరకడం లాంటి సమస్యలు మౌలికమైనవే. అయితే వారికి మానసిక వికాసం కల్గించవలసిన అవసరం లేదని శుంఠవాదనలు చేసేవారు లెనిన్ కాలంలో కూడా కొందరుండేవారు. ఇలాంటి పండిత పుత్రులను ఆయన అత్యంత తీవ్రంగా మందలించాడు. మార్క్సిస్ట్ ఎడ్యుకేషన్ మాత్రమే శ్రామిక ప్రజల్ని చైతన్యవంతుల్ని గావించలేదనీ, దానికి చేదోడువాదోడుగా వారి అంధవిశ్వాసాల్ని నిర్మూలించే నాస్తిక ప్రచార సాహిత్యం సైతం వారికి అవసరమేనని లెనిన్ వక్కాణించాడు. చూడండి:
'It would be the biggest and most grievous mistake a marxist could make to think that the millions of the people (especially the peasants & artisans) who have been condemned by all modern society to darkness, ignorance and superstition, can extircate themselve from this darkness only along the straight line of a purely Marxist education. These masses should be supplied with the most varied atheist propaganda material, they should be made familiar with facts from the most divert spheres of life, they should be approached in even possible way, so as to interest them, rouse them from theit religious torpor, stir them from the most varied angles and by the most varied methods, and so forth.
The keen, vivacious and talented writings of the eighteenth - century atheists wittily and openly attacked the prevailing claricalism and will very often proven thousand times more suitable for arousing people from their religious torpor than the dull and dry paraphrases of Marxism, almost completely unillustrated by skilfully selected facts, which predominate in our literature and which (it is no use hiding the fact) frequently distort Marxism. We have translations of all the major works of Marx and Engels. There are absolutely no grounds for fearing that the old atheism and old materialism will remain unsupplemented by the corrections introduced by Marx and Engels. The most important thing - and it is this that is most frequently overlooked by those of our Communists who are supposedly Marxists, but who in fact mutilate Marxism is to know how to awaken in the still undeveloped masses an intelligent attitude towards relligious questions and an intelligent criticism of religions". (On the Significance of Militant Materialism Collected Works-Vol-33)
"ఆధునిక సమాజం ద్వారా, అంధకారానికి అజ్ఞానానికి అంధవిశ్వాసానికి అలవాటు చేయబడిన లక్షలాది ప్రజలు, (ప్రత్యేకంగా రైతులు చేతివృత్తులవారు) ఈ చీకటి నుంచి విముక్తి కావడానికి, మార్క్సిస్ట్ ఎడ్యుకేషన్ ద్వారానే నేరుగా బయటపడగలరని ఒక మార్క్సిస్ట్ భావించడం అత్యంత తీవ్రమైన తప్పిదం కాగలడు. ఈ ప్రజాబాహుళ్యానికి, అనేక రకాల నాస్తిక ప్రచార సాహిత్యాన్ని అందచేసి తీరాలి. మానవ జీవిత విభిన్న రంగాలకి చెందిన వాస్తవాల్ని, వారికి ఎరుకపరచాలి. సాధ్యమైనంతగా ప్రతి మార్గం ద్వారా వారి దగ్గరికి వెళ్లి వారిలో ఉత్సాహం కలిగించి, మతమౌఢ్యం నుండి వారిని బయటికి లాగి, విభిన్న కోణాల ద్వారా, విభిన్న మార్గాల ద్వారా వారిని చైతన్యవంతుల్ని చేయాలి.
పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన నాస్తికుల రచనలు ఎంతో నిశితమైనవి. ప్రతిభావంతమైనవి. ఈ రచనలు నాటి మతగురువుల బండారాన్ని బహిరంగంగా బట్టబయల్దేశాయి. సారహీనమైన మార్క్సిస్ట్ వ్యాసాల కన్న ఈ నాస్తికుల రచనలు, ప్రజల మతమౌఢ్యాన్ని నిర్మూలించడానికి వేయిరెట్లు ఉపయోగపడతాయి. మార్క్స్ ఎంగెల్స్ ప్రధాన రచనలన్నిటికీ, మనకు అనువాదాలున్నాయి. మార్క్స్ ఎంగెల్స్ లు చేసిన సవరణల వల్ల, ఈ నాస్తికవాద భౌతికవాదాల్లో పొరపాట్లు ఉండవచ్చునని భయపడేందుకు ఎలాంటి ఆస్కారమూ లేదు. మార్క్సిస్టులుగా చలామణి అవుతోన్న మన కమ్యూనిస్టులు, అత్యంత ప్రధానమైన ఒక అంశాన్ని తరచుగా దృష్టిలో వుంచుకోవడం లేదు. వెనకబడ్డ ప్రజానీకంలో, మత సమస్యల పట్ల వివేకవంతమైన దృక్పథాన్ని ఎలా కలుగజేయాలో, వివేకవంతమైన మత విమర్శను ఎలా చేయాలో అనే అంశాల్ని, వీరు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు" - అని లెనిన్ చెప్పాడు.
'Our propaganda necessarily includes the propaganda of atheism the publication of the appropriate scientific literature, which the autocratic feudal government has hitherto strictly forbidden and persecuted must now form one of the fields of our Pary work. We shall now probably have to follow the advice Engels once gave the German Socialists, to translate and widely disseminate the literature of the eighteenth century French English teners and atheists."
(Lenin- Socialism and Religion - Collected Works - Vol-10)
“మన ప్రచారంలో నాస్తిక ప్రచారం గూడా తప్పకుండా కలిసే వుంటుంది. నిరంకుశ ఫ్యూడల్ ప్రభుత్వం గతంలో నిషేధించిన సైంటిఫిక్ సాహిత్య ప్రచురణ, ప్రస్తుతం మన పార్టీ పనికి చెందిన విభిన్న రంగాల్లో వొకటిగా రూపొందాలి. పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన ఫ్రెంచి విజ్ఞానవేత్తల - నాస్తికుల రచనల్ని అనువదించి, వారి భావాల్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలని, జర్మన్ సోషలిస్టులకి ఎంగెల్స్ ఇచ్చిన సలహాని మనం ఇప్పుడు పాటించాలి.
"Religion is the opium of the people-this dictum by Marx is the corner - stone of the whole Marxist outlook on religion. Marxism has always regarded all modern religions and churches, and each and every religious organisation, as instrument of bourgeois reaction that serve to defend exploitation and to be fuddle the working class." (Lenin - The attitude of the workers party to religion- Collected Works-Vol-15).
"ప్రజల పాలిట మతం మత్తుమందు - అని మార్క్స్ చెప్పాడు. మార్క్స్ ప్రతిపాదించిన ఈ సూత్రం, మతం పట్ల యావత్ మార్నిస్ట్ దృక్పథానికే పునాది వంటిది. అన్ని ఆధునిక మతాల్నీ, చర్చీల్నీ, ప్రతి మత సంస్థనీ బూర్జువా అభివృద్ధి నిరోధకత్వానికి సాధనాలుగా, ఇవి దోపిడీని సమర్ధించి శామికవర్గాన్ని మోసగిస్తాయని మార్క్సిజం ఎల్లప్పుడూ పరిగణిస్తుంది."
The party of the proletariat comands that the state should declare religion a private matter, but does not regard the fight against the opium of the people, the fight against religious superstitions, etc, as a Private matter". The opportunists distort the question to mean that the Social Democratic Party regards religion as private matter". (The Attitude of the Workers' Party to Religion)
"మతాన్ని వ్యక్తిగత విషయంగా ప్రభుత్వం ప్రకటించి తీరాలని, శ్రామికవర్గ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాని మత్తుమందులాంటి ఈ మతానికి వ్యతిరేకంగా జరిపే పోరాటాన్ని మాత్రం, మత మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా జరిపే పోరాటాన్ని మాత్రం, 'వ్యక్తిగత విషయంగా శ్రామికవర్గ పార్టీ ఎన్నడూ పరిగణించదు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ - మతాన్ని వ్యక్తిగత విషయంగా పరిగణిస్తుందని, అవకాశవాదులు ఈ సమస్యను వక్రీకరిస్తున్నారు.
తన పేదతనాన్ని పోగొట్టుకోవాలనీ, తన శ్రమను యజమానులు దోపిడీ చేస్తోన్నారనీ వ్యవసాయకూలీ అనుకోడానికి, అతడు నమ్మే కర్మ సిద్ధాంతామూ దేవుడు రాసే రాత - యిత్యాది విశ్వాసాలు అడ్డుపడ్డం లేదా? మనిషి చేతికున్న అన్ని వేళ్ళూ సమానం కానట్టే,ఉన్నవాళ్ళూ, లేనివాళ్ళూ అనే తేడాలు పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాన్ని బట్టి వస్తాయనీ, దేవుడే కొందర్ని లేనివాళ్ళుగా, మరికొందర్ని ఉన్నవాళ్ళుగా సృష్టించాడని నమ్మే సామాన్య ప్రజలు యజమానుల పీడన - శ్రమ దోపిడీ గూర్చి ఆలోచిస్తారా? అంతా పల్లకీ లెక్కితే - మోసే బోయిలెవ్వరని నమ్మేవాళ్ళు వర్గదోపిడీ గూర్చి ఎందుకు ఆలోచిస్తారు? కర్మ సిద్ధాంతాన్ని విధి రాతనీ, దైవ సృష్టినీ బద్దలగొట్టుకొని వచ్చినప్పుడు కర్మ సిద్ధాంత బానిస మనస్తత్వం నించి బయటపడినప్పుడే, ఆ వ్యవసాయ కూలీకి వర్గదోపిడీ మరింత బాగా అర్థమవుతుంది.
కాలసర్పాన్ని సైతం సులభంగా చంపగలం గాని, తరతరాల భారతీయ రక్తంలో జీర్ణించి జీంచుకుపోయిన కర్మసిద్ధాంత సర్పాన్ని మాత్రం చంపడం అంత తేలికైన పనికాదు. చెవిలోంచి చీము కారుతుంటే, నాగేంద్రుడికి మొక్కుకుని, పాముల పుట్టలో పాలుపోసే యీ ప్రజలకు, వారు చెప్పే వర్గచైతన్యం అంత సులభంగా అర్థమవుతుందా? అప్పుడే పుట్టిన బిడ్డకి పొట్టమీద అమాంతం వాతలు బెట్టే యీ లక్షలాది గ్రామీణ స్త్రీలకి, వర్గ చైతన్యం అంత తేలిగ్గా అంతుబడ్తుందా? రెండుకాళ్ళ మృగాల్లా జీవిస్తోన్న కోట్లాది గ్రామీణ ప్రజల్ని, గాజు కిటికిల్లోంచి చూడకుండా నేరుగా గ్రామాల్లోకి తరలిరండి. అప్పుడు - అప్పుడే పరమ భీకరమైన అంధ విశ్వాసాల మయమైన వారి చీకటి బతుకులు మీకు గోరంత అర్థం కావడానికి వీలుంటుంది.
గాజు కిటికీల వెనక కూర్చుని, స్వయం నిర్మిత విప్లవ స్వప్నలోకంలో విహరించేవారికి, నేటి ఇండియా మధ్యయుగాల నాటి భారతంలా కన్పించకపోవచ్చు. అయితే వారి దృష్టి దోషానికి ఎవ్వరూ బాధ్యులు కారు.
మన దేశంలో వున్న ప్రభుత్వం దోపిడీదారుల ప్రభుత్వమే. అంటే, భూస్వామ్యవర్గ ప్రతినిధులూ, సామ్రాజ్యవాదుల దళారులే ప్రధానంగా ప్రభుత్వంలో వున్నారు. తమ వర్గాలకు మేలు చేసుకోవడమే ఈ ప్రభుత్వం లక్ష్యం. ప్రజల్ని అనేక రకాలుగా అనేక విషయాలలో తప్పుడు అభిప్రాయాల్లో వుంచినట్టే, ప్రజల్ని మతమౌఢ్యాంలో వుంచడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అన్ని మార్గాలలోనూ మత ప్రచారం జరగనిస్తుంది. ఈ ప్రభుత్వం మతానికి రక్షణగా వుంటుంది.
ఇలాంటి పరిస్థితుల్ని ఆరోజుల్లో నే గుర్తించిన లెనిన్,
ప్రభుత్వ వ్యవహారాల నించి మతాల్ని పూర్తిగా వేరుజేయాలనీ, చర్చి ఆస్తిపాస్తుల్ని స్వాధీనం జేసుకోవాలనీ, అక్టోబర్ విప్లవానికి పన్నెండు సంవత్సరాలకి పూర్వమే లెనిన్ డిమాండ్ చేశాడు. ప్రచారం చేశాడు.పుస్తకాలు రాశాడు.
సతీసహగమన (సహ దహన) దురాచారం పేరిట నాటి బెంగాల్లో వేలాది వితంతువులు నిర్దాక్షిణ్యంగా, చచ్చిన మొగుడి పాడెపై తగలబెట్టబడుతోంటే, రామ్మోహన్రాయ్ యీ దురాచారానికి వ్యతిరేకంగా ఎన్నో గ్రంధాలు రాశాడు. ఆందోళన చేశాడు. ఉద్యమం నిర్వహించాడు. స్త్రీని కేవలం అంటకుండగా మట్టిబెడ్డగా - మసిగుడ్డగా భోగవస్తువుగా తలచిన హిందూ సనాతనుల ధోరణిని చీల్చి చెండాడడానికి చలం ఎన్నో పుస్తకాలు రాశాడు. ఇవన్నీ సామాజిక సాంస్కృతిక సంస్కరణోద్యమాలు. హేతువాద నాస్తికోద్యమాలన్నీ కూడా ఇలాంటి కోవలోకే వస్తాయి.
___చిత్తజల్లు వరహాలరావు (సి.వి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి