MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?
గ్రామీణ స్థానిక సంస్థలు :
స్థానిక సంస్థల ప్రతినిధుల ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ చేత నేరుగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతాయి.
జిల్లా పరిషత్ టెరిటోరియల్ నియోజకవర్గం
(zilla parishad territorial constituency)
ZPTC సభ్యులు మండల పరిషత్ టెరిటోరియల్ నియోజకవర్గం
( mandal parishad territorial constituency – MPTC) సభ్యులు
గ్రామ పంచాయతీ సర్పంచ్ ( gram panchayat sarpanch ) గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యుడు.
పట్టణ స్థానిక సంస్థలు : పట్టణ స్థానిక సంస్థలు మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు మరియు నగర్ పంచాయతీలను కలిగి ఉంటాయి.
మునిసిపల్ కార్పొరేషన్ యొక్క కార్పొరేటర్లు / వార్డ్ సభ్యులు మునిసిపాలిటీ / నగర్ పంచాయతీ కౌన్సిలర్లు / వార్డ్ సభ్యులు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ విధులు :
ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తమ విధులు, బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఎంపీటీసీ ల విధులు, బాధ్యతలు ( mptc responsibilities ) : ఎంపీటీసీ గా డైరెక్ట్ ఎలక్షన్స్ లో గెలిచిన వ్యక్తి మొదటి మూడు మండల పరిషత్ సమావేశాల్లోపు ప్రమాణ స్వీకారం చేయకపోతే అతని సభ్యత్వం రద్దవుతుంది. అలాగే వరుసగా మూడు (మీటింగ్) సమావేశాలకు హాజరుకాక పోయినా అతనికి నోటీసులు పంపించి సభ్యతాన్ని క్యాన్సిల్ చేస్తారు.
మండల పరిషత్‌ను ప్రశ్నించే హక్కు ఎంపీటీసీ కి ఉంటుంది.
మండల పరిషత్ సమీక్షా సమావేశాలకు హాజరై తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేయవచ్చు.
ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావచ్చు.
గ్రామ స్థాయిలో కనీస అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేయుటకు అవసరమైన నిధులు రాబట్టేందుకు ప్రతిపాదించవచ్చు.
అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతుంటే ప్రశ్నించడమే కాక ఆవిషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
తమ పరిధిలోని పాఠశాలలను పరిశీలించి విద్యా నాణ్యత ప్రమాణాలు పెంచుటకు సూచనలు చేయవచ్చు.
ప్రజా సంక్షేమ అభివృద్ధి లో భాగంగా మండల పరిషత్ నుండి విడుదల అయిన నిధులు సద్వినియోగం అయ్యేలా సూచించవచ్చు.
ఎంపీటీసీ సభ్యుడు తాను ప్రాతినిధ్యం వహించే ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో అన్ని పంచాయతీ సమావేశాల్లో పాల్గొనవచ్చు.
పంచాయతీ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు కానీ ఓటు హక్కు ఉండదు.
మండల పరిషత్ నుంచి నిధులు తెచ్చి ఆయా గ్రామాల అభివృద్ధికి కృషి చేయవచ్చు.
మండలంలో ఎన్నికైన ఎంపీటీసీ లలో ఒకరిని మండల పరిషత్ అధ్యక్షుడి గానూ, మరొకరిని ఉపాధ్యక్షడిగా ఎన్నుకుంటారు. స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో ఎంపీటీసీ కి ఓటు హక్కు ఉంటుంది.
జెడ్పీటీసీ ల విధులు, బాధ్యతలు ( జెడ్పీటీసీ responsibilities ): జెడ్పీటీసీ గా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి వరుసగా మూడు జిల్లా పరిషత్ (మీటింగ్) సమావేశాలకు హాజరుకాక పోతే అతని సభ్యత్వం రద్దవుతుంది.
స్థానిక మండల పరిషత్ సమావేశంలో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉంటూ సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు.
జిల్లా పరిషత్‌లో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటారు.
అభివృద్ధి పనులకు జిల్లా పరిషత్ ద్వారా నిధులు శాంక్షన్ చేయించవచ్చు.
జిల్లా పరిషత్‌లో నిధుల కొరత ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి నిధులు శాంక్షన్ అయ్యేలా చేయవచ్చు.
జెడ్పీ నిధులు, విధులను ప్రశ్నించే హక్కు జెడ్పీటీసీ సభ్యుడికే ఉంటుంది.
రహదారులు, తాగునీటి సమస్యలు, ప్రభుత్వ భవనాల రిపేరీలకు నిధులు రాబట్టవచ్చు.
ప్రభుత్వం నుంచి తలసరి గ్రాంటు జిల్లా పరిషత్‌కు విడుదలవుతుంది.
ఈ నిధులతో వారు ప్రాతినిధ్యం వహించే మండలం అభివృద్ధికి కృషి చేసి ప్రణాళికలు చేయవచ్చు.
రాజకీయ కారణాలతో నిధుల కేటాయింపులో ఒకవేళ ZP చైర్మన్ పక్షపాతం చూపితే, వారిని ప్రశ్నించే హక్కు ఉంటుంది.
మండల స్థాయిలో ICDS, డ్వాక్రా, ఉపాధి హామీ తదితర పనులు పరిశీలించి, వాటి అభివృద్ధికి తోడ్పడవచ్చు. ఆయా అంశాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై జిల్లా స్థాయి సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో జెడ్పీటీసీ సభ్యునికి ఓటు హక్కు ఉంటుంది.
సర్పంచ్ విధులు(sarpanch responsibilities):
ఒక గ్రామానికి చెందిన సర్పంచ్ గ్రామానికి అధిపతిగా పనిచేస్తాడు మరియు అతను లేదా ఆమె వివిధ రకాల విధులు మరియు కార్యకలాపాలకు బాధ్యత వహిస్తారు. ఒక సర్పంచ్ యొక్క పరిపాలన మరియు గ్రామాల మధ్య సంబంధాలు మెరుగు పరచడానికి ఒక బిందువుగా కూడా పనిచేస్తాడు.
సర్పంచ్ విధులు వివిధ స్థాయిలలో ఉంటాయి మరియు ఈ క్రింది విధంగా ఉంటాయి:
ఒక గ్రామంలో ప్రాథమిక పౌర సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల నిర్వహణ మరియు మౌలిక సౌకర్యాల సృష్టి గ్రామ మౌలిక సదుపాయాలు మరియు పౌర సౌకర్యాలు రెండింటినీ చూసుకోవలసిన బాధ్యత సర్పంచ్‌కు ఉంది మరియు వాటిని నిర్వహించాలి. ఉదాహరణకి: ప్రాథమిక ఆరోగ్య సదుపాయాల కోసం ఒక గ్రామంలో మెడికల్ డిస్పెన్సరీని తెరవడం లేదా నిర్వహించడం.
ఒక గ్రామం లోపల వీధులు నిర్మించడం మరియు వాటిని నిర్వహించడం.
ఒక గ్రామం లోపల హ్యాండ్‌పంప్‌లు లేదా ఇతర నీటి వనరులను ఏర్పాటు చేయించడం.
గ్రామం లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం సర్పంచ్ బాధ్యత.
నీటి పంపిణీ కోసం మరియు గ్రామంలో ఉన్న పశువుల కోసం చెరువుల పునరుద్ధరణ చేసి నీటి వసతి కల్పించడం.
గ్రామం లోని వీధుల గుండా స్ట్రీట్ లైట్ విద్యుదీకరణ చేపట్టడం.
ఒక గ్రామం లోపల ఉండే గ్రామ పాఠశాల (ప్రభుత్వం పాఠశాల మాత్రమే) యొక్క పనితీరును చూడటం.
గ్రామం యొక్క మురుగునీటి నిర్వహణ కు సర్పంచ్ డ్రైనేజీ కాలువలు తవ్వించడం ద్వారా గ్రామ స్థాయిలో రోడ్ల మీద మురుగు నీరు పారకుండా చూడడం.
టీకాలు వేసే కార్యక్రమాలను గ్రామంలో క్రమం తప్పకుండా బాధ్యత తీసుకుంటారు.
ఒక గ్రామంలో సామాజిక కార్యకలాపాలను నిర్వహించాల్సిన బాధ్యత సర్పంచ్‌కు ఉంది.
గర్ల్ చైల్డ్ అవేర్‌నెస్ క్యాంపెయిన్, క్లీన్ ఇండియా క్యాంపెయిన్ వంటి అవగాహన కార్యక్రమాలను సర్పంచ్ చేపట్టవచ్చు.
గ్రామంలోని పాఠశాలలో సర్పంచ్ ప్రత్యేకంగా పిల్లల అభివృద్ధి కార్యక్రమాలు మరియు పిల్లల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించవచ్చు.
ఒక సర్పంచ్ గ్రామ యువత కోసం నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహించవచ్చు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వినియోగాన్ని వివరిస్తూ వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడానికి వివిధ కార్యక్రమాలను సర్పంచ్ చేపట్టాలి.
గ్రామ స్థాయిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను సర్పంచ్‌లు నిర్వహిస్తారు మరియు పాల్గొంటారు.
గ్రామ పరిపాలన లో భాగంగా గ్రామం లోపల జరుగుతున్న ఏదైనా చట్టవిరుద్ధమైన లేదా సంఘ విద్రోహ చర్యలను అరికట్టేందుకు మార్గాల కోసం వెతకవలసిన బాధ్యత కూడా సర్పంచ్‌కు ఉంది.
అతను లేదా ఆమె శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోవడానికి గ్రామం లోపల తలెత్తే వివాదాలను పరిష్కరించవచ్చు.
గ్రామం యొక్క అభివృద్ధికి అనుకూలంగా ఉండే సర్పంచ్ కొంతవరకు స్వంత నిర్ణయం తీసుకోవచ్చు.
గ్రామంలోని సమస్యలను హైలైట్ చేసి, వాటిని ప్రభుత్వ అధికారులకు నివేదించాల్సిన బాధ్యత సర్పంచ్‌కు ఉంది.
ఈ కార్యకలాపాలను చేపట్టడానికి గ్రామ విస్తీర్ణము, పరిమాణం ప్రకారం ప్రభుత్వం సర్పంచ్‌కు నిధులు కేటాయిస్తుంది.
గ్రామ జనాభా ప్రకారం ఇది ఒక్కొక్కరికి 400 రూపాయలు చొప్పున సర్పంచ్ కు కేటాయించుతారు. కాబట్టి ప్రాథమికంగా ఒక సర్పంచ్ గ్రామానికి సంరక్షకుడిగా ఉండవలసిన బాధ్యత ఉంది.
ముఖ్యంగా గ్రామ ప్రధమ పౌరుడు గా సర్పంచ్ తనదైన పరిపాలన చేస్తూ గాంధీ కోరుకున్న స్వరాజ్యం రూపొందించవచ్చు.
ఎంపీ ,ఎమ్మెల్యే పదవులు కాకుండా ఇతర రాజకీయ పదవుల్లో ఉన్న వారికి ఫిక్స్డ్ శాలరీ అంటూ ఏమీ లేదు. కానీ వారికి కేవలం గౌరవ వేతనం మాత్రమే ఉంటుంది. ఈ గౌరవ వేతనం కూడా ఎమ్మెల్యేలకు మాదిరిగా ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి తేడా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
సర్పంచ్ మరియు ఎంపీటీసీ కి నెలకు మూడు వేల రూపాయల గౌరవం వేతనం,
జడ్పీటీసీ కు 5000 రూపాయలు
ఎంపీపీ కి 10 వేల రూపాయలు
జడ్పీ చైర్మన్ కు 40 వేల రూపాయలు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి