పోస్ట్‌లు

మార్చి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

కారల్‌ మార్క్స్

చిత్రం
మార్చి14కారల్‌ మార్క్స్‌ వర్థంతి ----------------------------  మానవ చరిత్ర మలుపుల గుట్టు విప్పిన మహోన్నతుడు’ కారల్‌ మార్క్స్‌ వర్థంతి మార్చి14 మానవ జాతి చరిత్ర అంతా అతీత శక్తుల, పుణ్యపురుషుల సృష్టింగా గోషిస్తుంటే మానవుడే చరిత్ర నిర్మత అన్న మహోన్నత వ్యక్తి కారల్‌ మార్క్స్‌ . ప్రకృతిలోని సకల జీవకోటికి భిన్నంగా మానవుడు పరికరాలు ఉత్పత్తి చేసి ప్రకృతిని తనకు బానిసగా చేసుకొని మానవ చరిత్రను తానే నిర్మించాడని మార్క్స్ ఉద్బోధించాడు .చారిత్రక భౌతిక వాదంతో గత చరిత్రనే కాదు భవిష్యత్ ఎలా నడుస్తుందో వివరించి చెప్పిన మహోన్నతుడు. అద్భుతమైన అధ్యయనంతో అనితర సాధ్యమైన కృషితో మానవజాతిని ప్రభావితం చేశాడు.    మరణించి 131 ఏళ్ళు లైనా ప్రపంచాని ప్రభావితం చేస్తూనే వున్నాడు. ఆయన చూపిన మార్గంలో కోటాను కోట్ల మంది పయనిస్తూనే వున్నారు.  మార్క్స్ జీవించి నాటిక ప్రపంచ పరిస్థితి  అప్పటికి వెనుకబడివున్న ఐరోపాఖండంలో ‘‘ఫూడలిజం’’కు వ్యతిరేకంగా సాగిన పోరాటాలు కొత్తసమాజ నిర్మాణానికి బాటలువేశాయి. ఈ పోరాటాలు14వ శతాబ్దం నుండి సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలే వేశాయి. 1455లో గూటెన్‌బర్గ్...

ఐక్యపోరాటాలు

*🚩ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో ఐక్యపోరాటాలకు పునరంకితమవుద్దాం!🚩*♦️♦️♦️♦️♦️ *భారతదేశంలో జాతీయోద్యమం, కార్మికోద్యమం పెనవేసుకొనే సాగాయి.ఏఐటియుసి ఏర్పడ్డ ప్రారంభ దినాల్లో జాతీయోద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులే ఆ తరువాత ఏఐటియుసికి నాయకత్వం వహించారు. బి.టి.రణదివే,పి.రామ్మూర్తి, డాంగే,ఘాటే వంటి ఎందరో కమ్యూనిస్టు నాయకులు కూడా కీలక పాత్ర పోషించారు. అందుకనే ఇటు జాతీయోద్యమంలోనూ,అటు కార్మికోద్యమంలోనూ మిలిటెంట్‌ పోరాటాల ఉధృతి సాగింది.* 1920 లో ఏర్పడ్డ                    ఏఐటియుసి కార్మిక సంస్థను భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి మూడునెలల ముందు ఏఐటియుసిలో చీలికలకు కాంగ్రెస్‌ పార్టీ పావులు కదిపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికి పాత్రధారి, సూత్రధారుడు.1947 జూన్‌లో  ఐ ఎన్ టి యు సి ఏర్పడింది. దీంతో ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చీలికలు ప్రారంభం అయ్యాయి. ఆ తరువాత 1948లో హిందూ మజ్దూర్‌ సభ ఏర్పడింది. 1948లో యుటియుసి, 1955లో భారతీయ మజ్దూర్‌ సంఘ్ (బిఎంఎస్‌),1958లో యుటియుసి లెనిన్‌ సారాని తదితర కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి.కాల క్రమేణా ఏఐటియుసి .పాలకవర్గ స్వ...