GDP ఎలా పంపిణీ అవుతోంది?
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjmMf74K_kqvv56-kzgHOZCRQSy54X4J_RLgeElCuZ9hbLFpxfFeA2oPKTpDC1ZiFNb4YIpp_TZIXwhVzX9d7ejwTM2VvibsCMUIlro6Ytb_JTPTDeONTgSCIjcRMZI70FjAlvW1S_5U18/s1600/1624463832086606-0.png)
photo: businesstoday.in ఏ కొలబద్దతో చూసినా సగటు లేదా తలసరి ఆదాయంతో ఒక దేశంలోని పౌరుల సంక్షేమాన్ని కొలవడం సముచితం కాదు. అది తెలుసుకోవాలంటే మొత్తం ఆదాయం లేదా స్థూల దేశీయ ఉత్పత్తి (జి.డి.పి.) ఎలా పంపిణీ అవుతుందో చూడాలి అంశాన్ని కొంత విపులీకరించాలంటే పొంతనలేని రెండు పంపిణీ ఈ విధానాలున్న సమాజాలను చూడండి. మొదటి సమాజంలో పంపిణీ పూర్తి సమానంగా అంటే ఒక్కో వ్యక్తికి 23,000 రూపాయల ఆదాయం ఉంది జనాభా 100 ఉంది. ఈ పద్ధతిలో అయితే సగటు మనిషి ఆదాయాన్ని లెక్కించడానికి తలసరి ఆదాయం కచ్చితమైన కొలబద్ద. ఇక రెండో సమాజం గురించి చూడండి. 99 మంది బానిసలకు తలా వంద రూపాయల ఆదాయం మాత్రమే ఉన్న బానిస సమాజాన్ని ఊహించండి. మిగతా ఆదాయం అంతా ఒకే ఒక్క బానిస యజమానికి వెళుతుంది. యజమాని ఆదాయాన్ని ఇలా లెక్క కట్టవచ్చు : మొత్తం సమాజం ఆదాయం అంటే దాని జి.డి.పి. (100 మంది వ్యక్తులు X వ్యక్తికి 23,000 రూపాయలు). ఇందులో నుంచి 99 మంది బానిసల (99 X 100) మొత్తం ఆదాయాన్ని తీసివేయాలి. అంటే బానిస యజమాని ఆదాయం 22,90,100 అవుతుంది. అది ఒక బానిస ఆదాయం కన్నా 22.9 వేలరెట్లు ఎక్కువ బానిస సమ...