ఆనాడే కాంగ్రెస్ మతోన్మాదాన్ని ప్రతిఘటించి వుంటే...



       pc: the statesman.com

"సామాజిక శాంతికి, సామరస్యానికి భంగం కలిగించడానికి ప్రయత్నించే అన్ని రకాల చాందస వాద, మత మౌఢ్య శక్తులను అదుపు చేయడానికి, చట్టాన్ని అమలు చేయడానికి ఎలాంటి సంకోచం లేకుండా కృషి చేస్తుంది." అని యుపిఏ కనీస ఉమ్మడి కార్యక్రమం (సి.ఎంపి) పేర్కొంది. కాని రాజ్యాంగం నిర్దేశించే ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి అవసరమైన రాజకీయ సంకల్పాన్ని కనపరచలేదు. భారత రిపబ్లిక్ లౌకిక పునాదిని పరిరక్షించే బాధ్యతను నిర్లక్ష్యం చేసింది. సంఘపరివార్ నాయకత్వంలోని మతోన్మాద శక్తులు అనేక రాష్ట్రాలలో చురుగ్గా ఉన్నాయి. అవి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ లలో మాదిరి తమ మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలను వినియోగించుకుంటున్నాయి. మైనారిటీలను ఒక పద్ధతి ప్రకారం భయభ్రాంతులను చేయడానికి, వివక్షకు గురిచేయడానికి ప్రభుత్వాన్ని వినియోగించుకోవడంలో నరేంద్ర మోడీ నాయకత్వ స్థానంలో ఉన్నాడు. 2002 మారణకాండకు సంబంధించిన మెజారిటీ కేసులను అసలు ముట్టుకోనే లేదు. ముస్లిం మహిళలపై దారుణమైన లైంగిక నేరాలకు పాల్పడిన వారు ఇప్పటికీ స్వేచ్ఛగానే తిరుగుతున్నారు. గోధ్రా ఘటనకు సంబంధించి అరెస్టు చేసిన వారిలో సాక్ష్యాలు లభించని వారిని విడుదల చేయాలని పోటా కేంద్ర సమీక్షా కమిటీ ఇచ్చిన ఆదేశాలు అమలు జరగనే లేదు. కాని గోధ్రా ఘటనలో నిజంగా దోషులని తేలిన వారిని అరెస్టు చేయడం, శిక్షలు విధించడం కూడ జరిగిపోయింది. సుప్రీం కోర్టు వద్ద మూడేళ్లుగా పెండింగులో ఉన్న మూడు ప్రధాన కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నేరపూరితంగా వ్యవహరిస్తున్నది. హింసాకాండకు సంబంధించిన ప్రధాన కేసులలో సిబిఐ దర్యాప్తు చెయ్యాలన్న డిమాండ్లను పట్టించుకోవడం లేదు. ఇటీవల వదోదరలో శతాబ్దాల తరబడి ఉన్న ఒక దర్గాను ఆ మునిసిపల్ కార్పొరేషన్ కూల్చివేయడంతో తలెత్తిన హింసాకాండలో నలుగురు మరణించారు. నర్మద లోయలో నిర్వాసితులైన గిరిజనులకు

అనుకూలంగా మాట్లాడిన సినీనటుడు అమిర్ భాన్ కు వ్యతిరేకంగా సంఘపరివార్ సంస్థలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిపాయి. ఫనా సినిమాకు వ్యతిరేకంగా కూడ ప్రదర్శనలు ఆగాయి, ఈ ఘటనలు ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న వరిస్థితికి అద్దం పడుతున్నాయి

గుజరాత్ లో రాజ్యాంగం, చట్టం అమలు జరగడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. మైనారిటీలకు వ్యతిరేకంగా జరిగే మతోన్మాద దాడులను ప్రతిఘటించడానికి నివారించడానికి కేంద్ర ప్రభుత్వం గాని, కాంగ్రెస్ పార్టీగాని చర్యలు తీసుకోకుండా దాటవేస్తున్నాయి. ఇటీవల కాలంలో దేశంలో మావు, ఆలీఘర్, కార్గిల్, గోవా లాంటి అనేక చోట్ల కూడ మతోన్మాద ఘటనలు జరిగాయి. అందుచేత ఈ విషయంలో ఉదాసీనత ఏ విధంగాను తగదు. విద్యారంగంలో మతతత్వ విషాన్ని తొలగించడానికి చర్యలను మరింత తీవ్రం చేయాలి. లౌకిక ఆదర్శాలను, విలువలను పెంపొందించడానికి క్షేత్ర స్థాయిలో ప్రచారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మతతత్వ శక్తులను, ముఖ్యంగా సంఘపరివార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో సిపిఐ (ఎం), వామపక్షాలు నికరమైన వైఖరిని తీసుకుంటున్నాయి. అన్ని రకాల చాందస శక్తులకు వ్యతిరేకంగా మైనారిటీల హక్కుల కోసం సిపిఐ (ఎం) నిలబడింది. పశ్చిమ బెంగాలు, త్రిపుర రాష్ట్రాలలోని వామపక్ష సంఘటన ప్రభుత్వాల విషయంలోను, కేరళ, ఇంకా దేశంలోని ఇతర ప్రాంతాలలో నిర్వహించడంలోను ఇది కనిపించింది.


(సిపిఎం ప్రచారోద్యమ కరపత్రం, ఆగస్టు 2006)


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?