కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgKrhFKhvAWgHEXydP91QHAFFAT29X41Kpqn2VKf81LesyBOIE_tqqpuTXaHzanFWWJjlaTD1FTQmYLtIL0THj7UP1h7NyHXdDpacIeloGDi_rq16V5juz-qrTX0BLo35hBnbLdkGwYEJk/s1600/1627100259139317-0.png)
ఐరాస పతాకం pc Wikipedia విశ్వ మానవాళి శ్రేయస్సుకోసమే ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. కాని బహుళజా సంస్థలు దాని పాత్రను భ్రష్టు పట్టించే ప్రమాదముంది. 1970 మధ్య దశకం నుండి కార్పొరేట్ సంస్థలు ఐక్యరాజ్యసమితి పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. 1975 నుండి 1992 వరకు బహుళజాతి సంస్థలకు నిబంధనావళిని రూపొందించే విషయమై ఐక్యరాజ్యసమితిలో అనేకమార్లు చర్చ జరిగింది. 1992 నాటికి కార్పొరేట్ సంస్థలు మరింత బలపడడంతో నిబంధనావళి చర్చలకు తెరపడింది. ఎనలేని అధికారాలను, పలుకుబడిని సంతరించుకున్న బహుళజాతి సంస్థలు తమ కార్యకలాపాలను నియంత్రించేందుకు నియమావళి అంటూ ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదని ఐక్యరాజ్యసమితిని బుజ్జగించాయి. బహుళజాతి సంస్థలపై ఐరాస కేంద్రం 1974లో ఏర్పాటైంది. వాణిజ్య వ్యవహారాలపై కేంద్రం ఐరాస ప్రధాన కార్యాలయం నుండి నిఘా వేసి ఉండేది. అన్ని దేశాలకు చెందిన కార్పొరేట్ సంస్థలకు ఒక నియమావళి ఏర్పాటు చేసి, అతిధేయ దేశాల ప్రయోజనాలు కాపాడాలని, పేద దేశాల బేరమాడే సామర్థ్యాన్ని పెంచాలని, జాతీయ అభివృద్ధి లక్ష్యాల్లో అంతర్భాగంగా బహుళజాతి సంస్థలు నడుచుకునేలా చూడాలని బరాసు కే...