కార్మికులంటే పరిశ్రమల్లో పని చేసే వారేనా?
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgi5Jd1Voaj8EqyG5eES5V56c-ZL_UEGOTwiJ81CsJMZGTOXD3zdWI3c3hNsxIMtYN4dHsJa5zUAlt4fcniW16Iu-EZONEgq8XQvaf7oTJ2l8JNuNPbyjGg9wawPgz9iXJaB1p0GVQy8qY/s1600/1624465712578733-0.png)
కార్మికులంటే పరిశ్రమల్లో పని చేసే వారేనా? __ ఎస్ ఆర్ శంకరన్ ఐఎఎస్ ( రిటైర్డు) భారతదేశంలో విధానపరమైన చర్చల్లో ఎప్పుడూ కూడా 'కార్మికుడు' అంటే పరిశ్రమల్లో పని చేసే 'పారిశ్రామిక కార్మికుడు' అనే ఉద్దేశంలోనే మాట్లాడుతున్నారని జాన్ బ్రిమెన్ చాలా ముఖ్యమైన పరిశీలన చేశారు. కార్మికులంటే పరిశ్రమల్లో పని చేసే వారేనన్న అపోహ ప్రబలంగా ఉంది. కానీ ప్రపంచచరిత్రలో ఎప్పుడూ కూడా కార్మిక వర్గంలో గ్రామీణ, వ్యవసాయ కార్మికులే అధిక సంఖ్యలో ఉంటారు. వాళ్ళలో చాలా మంది దుర్భరమైన పరిస్థితుల్లో, రకరకాల అణచివేతలను ఎదుర్కొంటూ దయనీయంగా జీవితాలను నెట్టుకు వస్తున్నవారే. వీళ్ళు శ్రమకోర్చి ఎక్కువ సమయం కష్టపడతారు. చివరికి వారికి దక్కే ప్రతిఫలం చాలా తక్కువ సంపదను సృష్టించేది వారు. ఆర్థికరంగం నిలదొక్కుకుని, అభివృద్ధి పథంలో నడిచేలా చేసేది వారు. అయినా అభివృద్ధి ఫలాల్లో వారికి భాగం ఉండదు. వారు కష్టపడి సాధించిన పురోగతిలో న్యాయంగా వారికి దక్కాల్సిన వాటా వారికి దక్కటం లేదు. ఈ శ్రమ దోపిడీ, దుర్భర పరిస్థితుల వల్ల గ్రామీణ పేదలు పొట్ట చేత బట్టుకొని ఉపాధి కోసం పట్టణాలకు వలసపోతున్నారు. ఈ దృశ్యం ఎంతటి హృదయ...