భవిష్యత్ సోషలిజానిదే
మే 19న పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ప్రతి మండలంలో బహిరంగ అధ్యయన వేదిక ద్వారా భవిష్యత్ సోషలిజానిదే అని మనం శపదం చేద్దాం. పోరాటాల ద్వారా ఒక అడుగు ముందుకు వేద్దాం. ప్రతీ క్షణం ప్రజాతంత్ర ఉద్యమ అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలతో మమేకం అవుతూ విప్లపకర ఉద్యమాన్ని నిర్మిద్దాం. తద్వారా.. సోషలిజాన్ని సాధిద్దాం. అప్పుడే కామ్రేడ్ సుందరయ్య ఆశయాన్ని నెరవేర్చిన వాళ్ళమవుతాం. సోవియట్ రష్యా సాధించిన ప్రగతి - విజయాలు : ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, ఇతర శ్రమ చేసే ఇతర తరగతుల ప్రజలు నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా, పొదుపు చర్యలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. వీరందరికీ 1917 సోషలిస్ట్ విప్లవం దిశానిర్ధేశం చేసే వెలుగుకిరణం. ప్రగతిశీల విప్లవశక్తులకు అక్టోబర్ విప్లవం ప్రేరణ నిచ్చే ఆశాకిరణం, వర్గరహిత, దోపిడీరహిత సమాజం కోసం కృషి చేసే వారందరికీ అక్టోబర్ విప్లవం భవిష్యత్ సోషలిజానిదే అన్న సందేశాన్ని ఇస్తున్నది. 1917లో రష్యాలో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది. కార్మికవర్గ నాయకత్వాన విప్లవోద్యమాన్ని ప్రపంచపటం మీదికి తె...