భవిష్యత్ సోషలిజానిదే



మే 19న పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ప్రతి మండలంలో బహిరంగ అధ్యయన వేదిక ద్వారా భవిష్యత్ సోషలిజానిదే అని మనం శపదం చేద్దాం. పోరాటాల ద్వారా ఒక అడుగు ముందుకు వేద్దాం. ప్రతీ క్షణం ప్రజాతంత్ర ఉద్యమ అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలతో మమేకం అవుతూ విప్లపకర ఉద్యమాన్ని నిర్మిద్దాం. తద్వారా.. సోషలిజాన్ని సాధిద్దాం. అప్పుడే కామ్రేడ్ సుందరయ్య ఆశయాన్ని నెరవేర్చిన వాళ్ళమవుతాం.

సోవియట్ రష్యా సాధించిన ప్రగతి - విజయాలు : ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, ఇతర శ్రమ చేసే ఇతర తరగతుల ప్రజలు నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా, పొదుపు చర్యలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. వీరందరికీ  1917 సోషలిస్ట్ విప్లవం దిశానిర్ధేశం చేసే వెలుగుకిరణం.

ప్రగతిశీల విప్లవశక్తులకు అక్టోబర్ విప్లవం ప్రేరణ నిచ్చే ఆశాకిరణం, వర్గరహిత, దోపిడీరహిత సమాజం కోసం కృషి చేసే వారందరికీ అక్టోబర్ విప్లవం భవిష్యత్ సోషలిజానిదే అన్న సందేశాన్ని ఇస్తున్నది.  1917లో రష్యాలో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది. కార్మికవర్గ నాయకత్వాన విప్లవోద్యమాన్ని ప్రపంచపటం మీదికి తెచ్చింది.

1960 వరకు సోవియట్ యూనియన్లో గొప్ప ఆర్థికాభివృద్ధి జరిగింది. 1918 - 65 మధ్య కాలంలో సోవియట్ తలసరి ఆదాయం ప్రపంచలోని అత్యంత వేగవంతంగా పెరిగింది. సోవియట్ 440శాతం వృద్ధి సాధించింది.

(1) రష్యాలో విప్లవం సాధించిన దశాబ్ది కాలంలో నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించారు. 1940 సంవత్సరానికి అందరికి విద్య - సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యాన్ని సాధించింది. సార్వజనీన ప్రాధమిక విద్యకు కొనసాగింపుగా సార్వజనీల ఏడేళ్ళ విద్య, మాధ్యమిక విద్య (పదేళ్ళు) అమలు చేసింది.

(2) చదువుకున్న వారందరికి వృత్తి విద్యా కోర్సులు ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించారు.

 (3) అందరికీ ఉద్యోగం, నిరుద్యోగ నిర్మూలన. 1936 నాటికల్లా అందరికీ ఉద్యోగాలు కల్పించిన కారణంగా ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలు మూతబడ్డాయి.

(4) శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అభివృద్ధితో ప్రపంచంలోనే మొట్టమొదటగా చంద్రమండలం పైకి మనిషిని పంపింది సోవియట్ రష్యా

(5) జాతుల మధ్య సమానత్వాన్ని సాధించారు. 60శాతం పైగా రష్యా జాతి మెజార్జిగా ఉన్నా జాతుల మద్య ఐక్యతసాధించారు. అన్ని బాషలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు. వివిధ మతాల మద్య సమానత్వాన్ని సాధించారు.

(6) పౌరులందరికి విద్యా, వైద్యాన్ని అందించే బాధ్యత సోవియట్ ప్రభుత్వానిదే అని రాజ్యాంగంలో చేర్చారు.

 (7) భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసింది. పేదరైతులు, వ్యవసాయ కార్మికులతో సమిష్టి సహకారక్షేత్రాలను ఏర్పాటు చేసింది.

(8) సోషలిస్ట్ ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయాలలో మహిళలందరూ సమానహక్కులు, సమాన వేతనాలు, ప్రసూతి సౌకర్యాలు, విడాకుల హక్కులు పొందారు. విప్లవం మహిళలకు ఓటు హక్కునిచ్చింది. ఈహక్కు బ్రిటన్లో మహిళలకు 1928లో కూడా లభించలేదు.

(9) ప్రభుత్వం పుస్తక ప్రచురణలకు, సినిమాల నిర్మాణానికి, సంగీతానికి, కళలకు నిధులు సమకూర్చింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?