గోదావరి పరులేకర్
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjCsi1seb4U21wwbIufRBN0X1yPp-daR16BKotXAV7OocjBT3d-O758oFM9VQZIi4OSbhrFbSs46Qm1LrB8FmPkVRPVZOVS81k879oh6aioFeNpeeiH9AlQSK9u63AnNlyPZSlp00KWRDI/s1600/1628955532597809-0.png)
ప్రముఖ జాతీయ ఉద్యమ నాయకురాలు, వర్లీ ఆదివాసి పోరాట నాయకురాలు, కమ్యూనిస్టు నాయకురాలు, అమరజీవి కామ్రేడ్ గోదావరి పరులేకర్ జన్మదినము నేడు. ఆ వీరనారికి విప్లవ జోహార్లు. ఆమే పెర్గ్సన్ కళాశాలలో రాజకీయశాస్త్రం లోను,న్యాయశాస్త్రం లోను డిగ్రీలు పొందారు, మహారాష్ట్రలో లా డిగ్రీపొందిన మొదటి మహిళ, ఆమేతండ్రి LRగోఖలే తనతోపాటు లాయరు వృత్తి చేపట్టానికి తిరస్కరించినారు . 1932 వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అరెస్టు ఐనారు, జైలునుండి విడుదలైన గోదావరిని తండ్రి ఇంటి కి రానివ్వలేదు. ఆయన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే సమీబంధువు కూడా. తనుపుట్టి పెరిగిన పూనేను వదిలారు గోదావరి తనకార్యస్థానాన్ని బొంబాయి కిమార్చుకున్నారు, తన సహవిద్యార్థి అయిన NMజోషి నిర్వహిస్తున్న ఆర్య సమాజంలో చేరినారు . ఆర్యసమాజంలో జీవితకాల సభ్యత్వం తీసుకున్నమొదటి మహిళా . సామాజిక సేవమొదలుపెట్టారు. ఆమె కార్మికవాడ ల్లో అక్షరాస్యతా కార్యక్రమంచేపట్టిన మొదటి మహిళ . బ్రిటిష్ ప్రభుత్వం జారీచేసిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా10వేల మందితో ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కరు స్థాపించిన ఇండిపెండె...