గోదావరి పరులేకర్
ప్రముఖ జాతీయ ఉద్యమ నాయకురాలు, వర్లీ ఆదివాసి పోరాట నాయకురాలు, కమ్యూనిస్టు నాయకురాలు, అమరజీవి కామ్రేడ్ గోదావరి పరులేకర్ జన్మదినము నేడు. ఆ వీరనారికి విప్లవ జోహార్లు.
ఆమే పెర్గ్సన్ కళాశాలలో రాజకీయశాస్త్రం లోను,న్యాయశాస్త్రం లోను డిగ్రీలు పొందారు, మహారాష్ట్రలో లా డిగ్రీపొందిన మొదటి మహిళ, ఆమేతండ్రి LRగోఖలే తనతోపాటు లాయరు వృత్తి చేపట్టానికి తిరస్కరించినారు . 1932 వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అరెస్టు ఐనారు, జైలునుండి విడుదలైన గోదావరిని తండ్రి ఇంటి కి రానివ్వలేదు. ఆయన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే సమీబంధువు కూడా. తనుపుట్టి పెరిగిన పూనేను వదిలారు
గోదావరి తనకార్యస్థానాన్ని బొంబాయి కిమార్చుకున్నారు, తన సహవిద్యార్థి అయిన NMజోషి నిర్వహిస్తున్న ఆర్య సమాజంలో చేరినారు . ఆర్యసమాజంలో జీవితకాల సభ్యత్వం తీసుకున్నమొదటి మహిళా . సామాజిక సేవమొదలుపెట్టారు.
ఆమె కార్మికవాడ ల్లో అక్షరాస్యతా కార్యక్రమంచేపట్టిన మొదటి మహిళ .
బ్రిటిష్ ప్రభుత్వం జారీచేసిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా10వేల మందితో ప్రదర్శన నిర్వహించారు.
అంబేద్కరు స్థాపించిన ఇండిపెండెంట్ లేబరు పార్టీ
కార్యదర్శి అయిన శ్యామ్ రావు పరులేకరుతో పరిచయము ఏర్పడింది. ILPలో సభ్యులుగా పనిచేసి కార్మికులను సంఘీటితం చేశారు.
వారి ఉద్యమ విస్తరణ కు ILP, ఆర్యసామాజం పరిమితమైనవి ఆయునందున .
1938లోకమ్యూనిష్టు పార్టీ లోచేరారు. 1939లో గోదావరి, సామరావు పరులేకర్ల వివాహం జరిగింది.
1939లో రెండోప్రపంచ యుద్ధం మొదలైంది గోదావరి పరులేకరు యుద్ధ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించారు. 40%DA కోసం 40రోజులు జౌళి కార్మికులతో సమ్మే చేయంచారు
యుద్ద వ్యతి రేకచర్యగా ప్రభుత్వం గుర్తించి ఆమేను అరెష్టుచేసింది.
1942 లోవిడుదలచేశారు.
1942 నుండి పరులేకరు దంపతులు రైతుసమస్యలపై కేంద్రీకరించాలని నిర్ణయుంచుకున్నారు APలో 1944లో జరిగిన అఖిల భారత కిసాన్ సభ సమావేశాలలో పాల్గొనివచ్చిన పరులేకరు దంపతులు1945లో మహారాష్ట్ర తొలి కిసాన్ సభ మహాసభనిర్వహించారు.
1945లొనే వెట్టి చాకిరికి, భూస్వామ్య విధానానికి
వ్యతిరేకంగా చరిత్రప్రసిద్ధిచందిన వర్లి ఆదివాసి తిరుగుబాటు జరిగింది. వెట్టిచాకిరి చట్టాలు రద్దు అయ్యినాయి. ఎర్రజెండా చట్టాలుగా పిలువబడ్డాయి.
1964లో కమ్యూనిష్ట్ ఉద్యమం లోవచ్చినచీెలిక
సంధర్భంగా వారు సిపిఎం వైపు ఉన్నారు
1964లో పార్టీ కేంద్రకమిటికి సామరావు ఎన్నికయునారు 1965 ఆగస్టు3వతేదీనాగుండెపోటు తో అర్దరు రోడ్డు జైలులో కన్నుమూశారు.అదే జైలులోవున్న గోదావరి పరులేకరు పాలిట అశనిపాతమైయింది.
ఆవిధంగా అవిప్లవ జంటవిడిపోయంది,
జైలు నుండి విడుదల ఆయునతర్వాత Cpm కేంద్ర కమిటీకి గోదావరి పరులేకరు ఎన్నికయునారు, నాటి నుండి 25సంత్సరాలు CPMకేంద్ర కమిటీ సభ్యురాలిగా వున్నారు.
1992లో14వ పార్టీ మహాసభలో వయో భారంవల్ల
కేంద్ర కమిటీ నుండి తప్పుకున్నారు
1986లొ అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షురాలుగా ఎన్నికైనారు అధ్యక్షుల గా ఏన్నీకైన తొలిమహిళ.
1995లోపార్టీ మహాసభలకు ప్రత్యేక ఆహ్వానం అందినా ఆరోగ్యంగా లేనందున వెళ్లలేదు.
సందేశం పంపారు "ప్రస్తుతం నేను జీవిత చర్మాంకములోకి చేరుకున్నాను కమ్యూనిష్టు పార్టీ కోసము, కిసాన్సభ కోసము అదేవిధంగా ఈనాటికి
సామ్రాజ్యవాదులచేత, స్వీయపాలకవర్గాల చేత
ఆణిచివేతకు, దోపిడీ, గురవుతున్న పేద ప్రజలకొసం
నా జీవితంలోని 50 ఏళ్ళు వినియోగిచగలిగినందుకు నేను గర్విస్తున్నాను."
ఈ ప్రముఖ కమ్యూనిష్టు విప్లవ వీ రవనిత1996 అక్టోబరు8న అస్తమించారు.
విప్లవ వీరవనిత కు విప్లవ జోహార్లు.
–--------మాటూరు రామాచంద్రరావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి