సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేయాలి
సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేయాలి
మార్కిస్ట్ భావాలున్న వారిలో కొందరు, మతాన్ని విమర్శించరాదని అంటుంటారు. వాస్తవానికి మార్క్స్, ఏంగెల్స్, లెనిన్ లు, మతాన్ని అత్యంత తీవ్రంగా ఖండించారు. పాత భావాలకి వ్యతిరేకంగా చేయాల్సిన కృషి గూర్చి వారు అనేక సందర్భాల్లో నొక్కి వక్కాణించారు.
18వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచి భౌతికవాదులు - డైడిరాట్, హెూల్బార్, హెర్విటన్ ఇత్యాదులు మతాన్నీ దైవభావాన్ని అత్యంత తీవ్రంగా ఖండిస్తూ రాసిన గ్రంధాల్ని, పీడిత ప్రజల్లో విరివిగా ప్రచారం చేయాలని ఏంగెల్స్ సూచించాడు. "Care should be taken to distribute among the mass of workers the excellent French materialist literature of the previous century which is still the greatest achievement of the French spirit both in form and content." ఎంగెల్స్ చేసిన అత్యంత ప్రధానమైన ఈ సూచన గూర్చి వ్యాఖ్యానిస్తూ, లెనిన్ ఇలా అన్నాడు:
So far as the party of the socialist proletariat concerned,religion is not a private affair. Our party an association of class conscious, advanced fighters for the emancipation of the working class. Such an association cannot and must not be indifferent to lack of class consciousness, ignorance or obscurantism in the shape of religious beliefs. We demand complete disestablishment of the church so as to be able to combat the religious fog with purely ideological and solely ideological weapons, by means of our press and by word of mouth. But we founded our association, the Russian social Democratic Labour Party, precisely for such struggle against every religious bamboozling of the workers. And to us the ideological struggle is not private affair, but the affair of the whole Party, Of the whole proletariat." (Lenin - Collected works-Vol-10)
"శ్రామికవర్గ పార్టీకి సంబంధించినంత వరకూ, మతమనేది వ్యక్తిగత విషయం (private affair) కానే కాదు, మన పార్టీ - శ్రామిక వర్గ విముక్తి కోసం కృషిజేసే వద్ద చైతన్యం గల అగ్రగామి యోధులతో కూడిన సంస్థ, మత విశ్వాసాల రూపంలో వుండే వర్గచైతన్య రాహిత్యం పట్ల అజ్ఞానమూ అంధవిశ్వాసాల - పట్ల, మన పార్టీ అలసత్వ భావంతో వుండరాదు. మనం చర్చిని సంపూర్ణంగా డిస్ఎస్టాబ్లిష్ (disestablish) చేయాలని. డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చేసినప్పుడే, మనం సిద్ధాంతపరమైన ఆయుధాల్తో పత్రికలూ - ఉపన్యాసాల ద్వారా, మతపరమైన అంధ విశ్వాసాలకి వ్యతిరేకంగా పోరాడగల్గుతాం. మతం పేరిట కష్టజీవుల్ని మోసగించే ప్రతి ప్రయత్నానికి వ్యతిరేకంగా పోరాడ్డానికే మనం పార్టీని స్థాపించుకొన్నాం. మతానికి వ్యతిరేకంగా సాగించే పోరాటం, మనకి సంబంధించి. నంత వరకూ ఏమాత్రం వ్యక్తిగత విషయం కానేకాదు. ఈ విషయం మన యావత్ పార్టీకి సంబంధించినది. సమస్త శ్రామిక వర్గానికీ సంబంధించినది." (లెనిన్ - సోషలిజం : మతం- కలెక్టేడ్ వర్క్స్ వాల్యూం 10) -
సోషలిస్ట్ సమాజ స్థాపనకి నూతన సంస్కృతీ వ్యాప్తికీ - కులమతాలు బ్రహ్మాండమైన అడ్డుగోడలు. మత ప్రపంచ దృక్పథానికీ - సోషలిస్ట్ ప్రపంచ దృక్పథానికీ ఎన్నటికీ పొత్తు కుదరదు. అంచేత సోషలిస్ట్ భావాల త్వరిత వ్యాప్తికి, హేతువాద - నాస్తిక భావాల వ్యాప్తి అత్యవసరం. దేవునిలో విశ్వాసం - మానసిక బానిసత్వానికి దారి తీస్తుందనీ, సామాన్య జనాన్ని మోసగించి, వారిని అజ్ఞానాంధకారంలో ఉంచడానికి మతం తోడ్పడుతుంది.
వాస్తవానికి ఆస్తిక జీవిత విధానం, మన ఆచార వ్యవహారాల్లో సాంఘిక విలువల్లో - విద్యలో - కుటుంబ సంబంధాల్లో - అడుగడుగునా కన్పిస్తుంది. అంచేత వీటికి వ్యతిరేకంగా జరిపే ప్రచారం, నూతన సంస్కృతీ వికాసానికి ఎంతగానో దోహదం చేస్తుందేగాని, సోషలిస్ట్ భావాలకి ఏమాత్రం ద్రోహం చేయదు.
మానవుడు చంద్ర మండలంపై అడుగుపెట్టిన ఈనాడు గూడా, ఇండియాలోని కోట్లాది గ్రామీణ ప్రజలు పాతరాతియుగం నాటి భావాలకి జీవిత విధానానికి బానిసలుగా వున్న నేటి పరిస్థితుల్లో, గతితార్కిక చారిత్రక భౌతికవాదంతో పాటు, ఈ దేశంలోనే పుట్టి పెరిగిన నాస్తికోద్యమ ప్రచారమూ అవసరమే. సమసమాజ స్థాపన కోసం జరిగే బృహత్తర కృషిలో, హేతువాద నాస్తికోద్యమం నిర్వర్తించాల్సిన పాత్ర నేడు ఎంతో వుంది.
సతీసహగమన దురాచార నిర్మూలనకై, రామ్మెహన్ రాయ్ సోషలిస్ట్ వ్యవస్థ స్థాపన దాకా వేచివుండలేదు. విధవా వివాహాల కోసం రాత్రింబవళ్ళూ కృషి చేసిన కందుకూరి వీరేశలింగం, సోషలిస్ట్ వ్యవస్థ కోసం యత్నించిన రఘుపతి వెంకటరత్నం, సోషలిస్ట్ వ్యవస్థ ఆవిర్భవించేంతదాకా వేచిచూడలేదు. పురోహితవర్గ అహంకారానికీ, ఫ్యూడల్ మూఢ నమ్మకాలకీ వ్యతిరేకంగా పోరాడిన త్రిపురనేని రామస్వామి సోషలిస్ట్ వ్యవస్థ స్థాపింపబడేంత వరకూ, తన పోరాటాన్ని వాయిదా వేయలేదు. అంచేత, సోషలిస్ట్ వ్యవస్థ స్థాపింపబడేంత వరకూ, సమాజంలోని సమస్త బ్రహ్మజెముళ్ళకి వ్యతిరేకంగా కృషి సాగించాల్సిన అవసరం లేదనీ, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని భవిష్యత్తుకు వాయిదా వేయాలనే వాదన, అర్ధరహితమైంది. రాజకీయ - ఆర్ధిక - రంగాల్లో జరుపుతోన్న కృషి, సాంస్కృతికరంగం వొద్దకొచ్చేసరికి తటపటాయించడం ఎంచేత జరుగుతోందో, ఎంతకీ అర్థంగాని విషయం.రాజకీయ - ఆర్థిక - సాంఘిక - సాహితీ - సాంస్కృతిక - రంగాలు, వాస్తవానికి వేరువేరు గదులు కానేకావు. అవి - ఒకే సాంఘిక శరీరంలోని వివిధ అంగాలు మాత్రమే.
___చిత్తజల్లు వరహాలరావు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి