పరాయీకరణ(alienation) అంటే ఏమిటో వివరించిన 1844 ఆర్థిక రాత ప్రతులు

రాజకీయ అర్థశాస్త్ర అధ్యయనానికి 1843లో మార్క్స్ పారిస్ వెళ్ళారు. రాజకీయ అర్థశాస్త్ర విమర్శలో మార్పు చెప్పిన భావాలకూ, ఊహలకూ పునాదులు ఇక్కడే ప్రారంభమయ్యాయి. ఈ భావాలనే కొంత కాలం తరువాత మార్క్స్ తన సంప్రదాయ గ్రంథమైన "పెట్టుబడి" లో పూర్తిగా వివరించారు. అయితే 1848లో, యీ విప్లవాత్మక తాత్విక సిద్ధాంత నిర్ధిష్ట రూపాన్ని "కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్, ఏంగెల్స్ లు వివరించారు. తరువాత కాలంలో మార్పు రచనలూ, ఇతర మార్కిస్టు మేధావుల రచనలూ కమ్యూనిస్టు ప్రణాళికలోని సిద్ధాంతాలపై రుజువులు సాధించి సుసంపన్నం చేశాయి

రాజకీయ అర్థశాస్త్రంలోని సమస్యలకు ఒక క్రమమైన వివరణల కొరకు ప్రయత్నించిన మార్క్స్ తొలి రచన ఇ.పి.యం. 1844. ఆనాటి ఆర్ధిక, తాత్విక సిద్ధాంతాలపై మార్క్స్  విమర్శనాత్మక విశ్లేషణ యొక్క సంశ్లేషణ యీ గ్రంథంలో వుంది. తన ఆలోచనలో వున్న అనుమానాలను తనకు తానే నివృత్తి చేసుకోవడానికి 1844 రాత ప్రతులను మార్క్స్ రాశారని చాలామంది విశ్వసిస్తారు. ఇ.పి.యం. 1844, ఒక అసంపూర్తి రచన. ఇది మార్చు తొలి రచనల చిత్తు ప్రతిలోని ఒక భాగం. ఈ రాత ప్రతులలోని చాలా భాగం లభ్యం కాలేదని మార్క్స్, ఏంగెల్స్ రచనల ప్రచురణకర్తలు గుర్తించారు. కాగా, కాపాడబడిన మిగిలిన భాగం మాత్రమే మన ముందున్న 1844, ఆర్థిక తాత్విక రాత ప్రతి. ప్రజాస్వామిక విప్లవం నుండి, శ్రామిక విప్లవంవైపుగా హెగెల్ ప్రభావం నుండి చారిత్రిక భౌతికవాదం దిశగా, తత్వశాస్త్రం నుండి ఆర్థిక రాజకీయ తత్వశాస్త్రం వైపుగా మార్క్స్ ఆలోచన సాగి స్థిరపడిందని, యింతకు ముందే మనం చెప్పుకున్న విషయం యీ గ్రంథంలో స్పష్టమౌతుంది.

     మార్క్స్  ప్రాపంచిక దృక్పథం, విప్లవాత్మక తాత్విక భావజాలాల ఆవిర్భావం, పరిణామాల మూలం ఇపి. యం. 1844లో వుంది

      గతి తార్కిక భౌతికవాదం యొక్క ప్రారంభ బిందువు నుండి కమ్యూనిజంపై తుది తీర్పులకు చేరిన మార్చు, బూర్జువా సామాజిక ఆర్థిక నిర్మాణంపై విమర్శనాత్మక పరిశీలన తొలి ప్రయత్నం యీ గ్రంథంలోనే చేశారు. 1844 ఆర్థిక తాత్విక రాత ప్రతులు సామాజిక విజ్ఞానశాస్త్రాల విశాలమైన రంగాన్ని స్పృశించాయి. ఇక్కడే మొదటిసారిగా, సామాజిక ప్రక్రియలో ఉత్పత్తి యొక్క నిర్ణయాత్మక పాత్రను నొక్కి వక్కాణించడం జరిగింది. దీనినే తన తదుపరి రచనలలో మార్క్స్ విస్తృతపరచి వివరించాడు. ఇక్కడే మొదటిసారిగా వర్గ విభజిత సమాజం యొక్క ఆవిర్భావానికి వ్యక్తిగత ఆస్తి, శ్రమ విభజన పాదార్థిక మూలమని మార్పు నిర్ధారించారు. మానవ ఉత్పాదక శ్రమ ప్రభావమూ, తద్వారా సైన్సు నుండి సంస్కృతివరకూ అన్ని రంగాలలోనూ వచ్చిన సామాజిక సంబంధాలపై యీ గ్రంథంలోని చర్చ విస్త రించింది

ఈ రాత ప్రతులలో చర్చించిన కీలకమైన విషయం పరాయీకరణ. పెట్టుబడిదారి విధానంలోని శ్రమ పరాయీకరణ శాస్త్రీయ మూలాన్ని మొదటిసారిగా వివరించడం జరిగింది. ప్రజల జీవితంలోనూ, శ్రమలోనూ, ఒక ప్రత్యేకమైన సామాజిక సంబంధాలను పెట్టుబడిదారి విధానం సృష్టించింది. అయితే యీ సామాజిక సంబంధాలు, యీ శ్రమే ప్రజలకు అన్యమైన శత్రుత్వ శక్తులుగా ఎదురుగా నిలబడతాయి. వ్యక్తిగత ఆస్తి ఆధిపత్యాన్నీ, అది సృష్టించిన సామాజిక విధానాన్ని మొట్టమొదటిసారిగా అన్యధీకరణ లేక అనుసంధానం చేశారు.

అందుచేతనే, పరాయీకరణ పోవాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయడం అనివార్యం, మానవ సమాజాన్ని పరస్పర వైరుధ్యవర్గాలుగా విభజించి వ్యక్తిగత ఆస్తి సంచయాన్ని సంవర్ధనం గావిస్తున్న య వ్యవస్థను నిర్మూలించడంలోనే మానవ జాతి విముక్తికి భౌతిక ఆధారం వుంది. యొక్క ప్రాపంచిక దృక్పథం, విప్లవాత్మక తాత్విక భావజాలాల ఆవిర్భావం, పరిణామాల మూలం ఇపి. యం. 1844లో వుంది.

____సీతారాం ఏచూరి
(1844 ఆర్థిక రాత ప్రతుల ముందు మాట నుంచి)



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?