జీవితం చైతన్యాన్ని నిర్ణయిస్తుందేగానీ చైతన్యం జీవితాన్ని నిర్ణయించదు.


       జంతుదశ నుండి  మానవులుగా మారడమే మొత్తం మానవ చరిత్రకు సంబంధించిన అతి ప్రాథమిక విషయం. చైతన్యం, మతం ఇంకా అనేక ఇతర అంశాలను బట్టి మనుషులను జంతువుల నుండి వేరుచేసి గుర్తించవచ్చు. కానీ మానవులు తాము బతకడానికి కావల్సిన అవసరాలను ఉత్పత్తి చేసుకోవడం ప్రారంభించిన తర్వాతనే జంతువుల నుంచి తమను తాము వేరు చేసుకుని గుర్తించగలగడం మొదలైంది. 
     మానవుల  శరీర నిర్మాణ పద్ధతి వారు తమ అవసరాలనుత్పత్తి చేసుకోవడాన్ని నిర్ణయిస్తుంది. మానవులు తమ జీవితావసరాలను ఉత్పత్తి చేసుకోవడం ద్వారా పరోక్షంగా తమ వాస్తవ భౌతిక జీవితాన్ని సృష్టించుకుంటారు.

      స్వర్గం నుండి భూమికి దిగివచ్చే జర్మన్ తత్వశాస్త్రానికి పూర్తిభిన్నంగా ఇక్కడ మనం భూమి నుండి స్వర్గానికి పయనిస్తున్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే రక్తమాంసాలతో కూడిన మనుషులను అర్థం చేసుకోవడానికి, మనుషులు ఏమి చెబుతున్నారు. ఊహిస్తున్నారు ఆలోచిస్తున్నారు? అనే దానితో ప్రారంభించం. మనుషుల గురించి ఏం చెబుతున్నారు. ఆలోచిస్తున్నారు. ఊహిస్తున్నారు అనే దానితో కూడా ప్రారంభించం. వాస్తవమైన క్రియాశీలమైన మనుషుల నుండి ప్రారంభిస్తాం. వారి  వాస్తవ జీవన విధానం మీద ఆధారపడి వారు ఏర్పరుచుకున్న సైద్ధాంతిక ప్రేరణతో మారుతున్న జీవన విధానానికి సంబంధించిన అభిప్రాయాల  అభివృద్ధిని వివరిస్తాం. 
      మనిషి మెదడులో ఏర్పడే భావాలు కూడా అతని భౌతిక జీవన విధానం నుంచి పుట్టినవే.  అవి భౌతిక ప్రాతిపదికలకు ముడిపడి ఉంటాయి. నీతి, మతం ఆధ్యాత్మికం ఇంకా మిగిలిన భావజాలాలను వాటికనుగుణంగా ఏర్పడిన వివిధ చైతన్య రూపాలను   స్వతంత్రమైనవి కాదు.ఎందుకంటే వాటికి ప్రత్యేక చరిత్రగాని, అభివృద్ధిగాని లేదు. 
   ఉత్పత్తిని దాని చుట్టూ ఏర్పడిన సంబంధాలను అభివృద్ధి చేసుకునే మనుషులే తమ వాస్తవ జీవితంతోపాటు తమ ఆలోచనలను, ఆ ఆలోచననుండి పుట్టిన
 వివిధ రూపాలను మార్పు చేసుకుంటారు. అందువల్లనే జీవితం చైతన్యాన్ని నిర్ణయిస్తుందేగానీ చైతన్యం జీవితాన్ని నిర్ణయించదు.  

కారల్ మార్క్స్ 
('జర్మన్ భావ జాలం' నుండి)
(రాజకీయ తరగతులు)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?