పిల్లలు పనిబాట కాదు బడిబాట పట్టాలి!
ఆధునిక ప్రపంచంలో దాదాపు అందరి ఆశ, ఆకాంక్ష ఇదే. పిల్లలు ప్రయోజకులు కావాలంటే విద్య ముఖ్యమని ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తోంది.
కానీ 1848లోనే కార్ల్ మార్క్స్ ఈ విషయం గుర్తించారు. పిల్లలు పలుగు, పార పట్టకూడదు. పలకా బలపం పట్టాలని ఆనాడే చెప్పారు. 'కమ్యూనిస్టు మేనిఫెస్టో' రాసేటపుడే బాల కార్మికులు ఉండరాదని ఆయన ఆకాంక్షించారు.
కానీ ఇప్పటికీ ప్రతి పది మంది బాలలలో ఒకరు కార్మికులుగానే ఉన్నారు. 2016లో అంతర్జాతీయ కార్మిక సంఘం చెప్పిన లెక్కలివి.
అయితే, కార్ల్ మార్క్స్ పోరాటం వల్ల చాలా మంది చిన్నారులు ఫ్యాక్టరీల నుంచి పాఠశాల బాట పట్టారు. అది కార్ల్ మార్క్స్ చేసిన కృషే.
"ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలందరికీ విద్య, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలోని పది పాయింట్లలో ఒకటి" అని 'గ్రేట్ ఎకనమిస్ట్స్: హౌ దెయిర్ ఐడియాస్ కెన్ హెల్ప్ అజ్ టుడే' పుస్తక రచయిత లిండా యూహ్ అన్నారు.
పిల్లలకు చదువుకునే హక్కు గురించి చెప్పిన వారిలో మార్క్స్, ఏంగెల్స్‌లే మొదటివారు కాదు. కానీ "ప్రాథమిక విద్య తప్పనిసరి అని 19వ శతాబ్దంలో వచ్చిన చైతన్యానికి మార్క్సిజం కూడా గొంతు కలిపింది. ప్రజల్లో వచ్చిన ఈ చైతన్యంతో చిన్నారులను ఫ్యాక్టరీల్లో పనికి పంపడం మానేశారు" అని లిండా చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి