ఏ విషయాన్నయినా సమగ్రంగా, పరస్పర సంబంధాలలో చూడాలి.
ఒక మార్క్సిస్టు మేధావిని గొప్ప మార్క్సిస్టు - లెనినిష్టు అవునా కాదా అని మనం
అంచనా వేసేటప్పుడు, అతను తప్పులు చేశాడా లేదా, తప్పుల శాతం ఎంత, ఒప్పుల శాతం ఎంత, ఎన్ని మార్కులు ఇవ్వవచ్చు, అని ప్రశ్న పత్రం దిద్దినట్టుగా కాక, అతను ఒక నిర్దిష్ట చారిత్రక దశలో, చారిత్రక ఆవశ్యకత గుర్తించి సమర్థవంతమైన నాయకత్వం ఇచ్చి మానవ జాతిని ముందుండి నడిపించాడా లేదా అన్నది ఆలోచించాలి. సంఘటనలు విడి విడిగా చూసి, తప్పొప్పులు చూసి, నిర్ణయాలకు రాకుండా, మొత్తం ఈ చారిత్రక దశలో చరిత్ర నడకలో, అతని పాత్ర ఏమిటి అన్నది అంచనా వెయ్యాలి.
సోవియట్ రష్యా చరిత్రలో ప్రతీ దశలోనూ - సమష్టి వ్యవసాయ విప్లవంలో, పారిశ్రామికీకరణలో, ట్రాట్స్కీ బుఖారిన్లతో సైద్ధాంతిక వివాదాలలో, యుద్ధానికి ముందు
ప్రజలను సాయుధుల్ని చెయ్యడంలో, ఒక భయంకర యుద్ధంలో, యుద్ధం తర్వాత సర్వనాశనమైన దేశ పునర్నిర్మాణంలో, ఆధునిక రివిజనిజానికి ఆది గురువు టిటోతో సైద్ధాంతిక సంఘర్షణలలో - స్టాలిన్ గొప్ప మార్క్సిస్టు-లెనినిష్టుగా, అత్యంత సమర్థుడైన కార్మిక వర్గ నాయకుడిగా నిల్చి, చరిత్రను ఒక మలుపు తిప్పాడు. అతని నాయకత్వంలో సోషలిష్టు ఉద్యమం ప్రపంచమంతా వ్యాపించి ఘన విజయాలు సాధించింది. కనుకనే కేవలం అతని తప్పులు మాత్రమే చూడకుండా, స్టాలిన్ను ఒక గొప్ప మార్క్సిస్టు లెనినిస్టుగా మనం గుర్తిస్తున్నది.
___తోలేటి జగన్మోహనరావు( మేం మళ్లీ వస్తాం)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి