మార్పుకు ప్రజలే ప్రతినిధులు!
సమాజంలో ఏదైనా తప్పుంటే మీకు అన్యాయం, అసమానత్వం జరుగుతోందని భావిస్తారు. దాన్ని నిలదీస్తారు. నిరసన తెలుపుతారు. తప్పుడు దారిలో వెళ్తున్న సమాజాన్ని సరైన మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తారు.
19వ శతాబ్దంలో బ్రిటన్ కొత్త పెట్టుబడిదారీ వ్యవస్థ ఎటూ కదలకుండా మెదలకుండా ఉండే కార్మిక శక్తిని చూసి ఉంటుంది.కానీ మార్పు వస్తుందని కార్ల్ మార్క్స్ నమ్మారు. మార్పు కోసం కార్మికులను ప్రోత్సహించారు. ఆ తర్వాత ఈ ఆలోచన సత్ఫలితాలిచ్చింది.
వ్యవస్థీకృత నిరసనలు, పోరాటాలు సమాజాన్ని సమగ్రంగా మార్చేందుకు ఎంతో దోహదం చేశాయి. ముఖ్యంగా జాతి వివక్ష వ్యతిరేక చట్టాలు, పేద, ధనిక వివక్ష వ్యతిరేక చట్టాలు రావడానికి కృషి చేశాయి.
"సమాజాన్ని మార్చాలంటే విప్లవం రావాలి. మెరుగైన సమాజం కోసం మేం ఉద్యమిస్తాం. మా పోరాటం ఫలితంగానే ఉద్యోగులకు జాతీయ ఆరోగ్య పథకం వచ్చింది. రోజుకు 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది" అని లండన్‌లో మార్క్సిజం ఉత్సవాన్ని నిర్వహించిన వారిలో ఒకరైన లూయిస్ నిల్సన్ అన్నారు.
మార్క్స్‌ను అందరూ ఒక తత్వవేత్తగా అభివర్ణిస్తారు. కానీ లూయిస్ నిల్సన్ దాన్ని అంగీకరించరు.
"మార్క్స్‌ను తత్వవేత్త అంటే కేవలం సిద్ధాంతాలు రాసిన వ్యక్తిగానే ఆయన కనిపిస్తారు. కానీ కార్ల్ మార్క్స్‌లో ఒక ఉద్యమకారుడు ఉన్నారు. కార్మికుల కోసం పోరాటం చేసిన నాయకుడున్నారు. అంతర్జాతీయ కార్మికుల సంస్థను ఏర్పాటు చేశారు" అని నిల్సన్ అంటారు.
కార్ల్ మార్క్స్ ఇచ్చిన "ప్రపంచ కార్మికులారా ఏకం కండి" నినాదం నిజంగా ఒక ఆయుధం లాంటిది.
మెరుగైన జీవితం కోసం నిరంతరం పోరాటం చేయడమనే సంప్రదాయం మార్క్స్ నుంచి మనకొచ్చిన నిజమైన వారసత్వం.
మార్పు కోసం ఉద్యమిస్తున్న వాళ్లు తాము మార్క్సిస్టులమని చెప్పుకున్నా, చెప్పుకోలేకపోయినా అది మార్క్సిజం సిద్ధాంతంపైనే ఆధారపడి ఉంటుందని నిల్సన్ చెప్పారు. మహిళలకు ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు నిల్సన్.
పార్లమెంట్‌లో ఉన్న పురుషులు జాలిపడి మహిళలకు ఓటు హక్కు కల్పించలేదు. పోరాటం, ఉద్యమం ఫలితంగానే మహిళలకు ఆ హక్కు వచ్చింది. వారాంతపు సెలవు మనకెలా వచ్చింది? కార్మిక సంఘాలు సమ్మె చేసినప్పుడు యాజమాన్యాలు దిగిరాక తప్పలేదు. మరి, సాధారణ ప్రజల జీవితాలు మెరుగుపడాలంటే మనమేం చేయాలి?
సామాజిక మార్పు కోసం మార్క్సిజం ఒక ఇంజన్‌లా పనిచేస్తోంది. దీనికి ఎంతో పట్టుంది.
"వాళ్లు కోరుకుంటున్న సంస్కరణలు తప్పకుండా వారికి ఇచ్చేయాలి. లేదంటే వారు మనకు విప్లవాన్ని పరిచయం చేస్తారు" అని 1943లో బ్రిటన్ రాజకీయ నాయకుడు క్విన్టిన్‌హాగ్ అంగీకరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి