మీడియా మీద ఓ కన్నేసి ఉంచండి
ప్రభుత్వం గురించి మార్క్స్ హెచ్చరించారు.. మీడియా మీద ఓ కన్నేసి ఉంచాలన్నారు.
ప్రభుత్వం - కార్పొరేట్ కంపెనీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది?
ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేసే వ్యవస్థలను సృష్టించే కంపెనీలకు ఫేస్‌బుక్ తన యూజర్ల వ్యక్తిగత వివరాలను అందిస్తే ఎలా ఉంటుంది?
19వ శతాబ్దంలో మార్క్స్, ఏంగెల్స్ సరిగ్గా ఇలాంటి అభ్యంతరాలనే లేవనెత్తారు.
కానీ ఆనాడు వాళ్లేమీ సోషల్ మీడియాలో చురుగ్గా లేరు!
కానీ ఈ ప్రమాదాన్ని చాలా ముందుగా పసిగట్టి, దాన్ని విశ్లేషించిన మొదటి వాళ్లు మార్క్స్, ఏంగెల్స్‌లేనని బ్యూనస్‌ఎయిర్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్ వాలేరియా వెగ్ వీస్ చెప్పారు.
వాళ్లు (మార్క్స్, ఏంగెల్స్) ఆ కాలంలో ప్రభుత్వం, బ్యాంకులు, వ్యాపార కంపెనీలు, ఏజెంట్ల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను అధ్యయనం చేశారు. దీనిపై పరిశోధన చేస్తూ 15వ శతాబ్దం నాటి పరిస్థితులనూ విశ్లేషించారని వాలేరియా తెలిపారు.
సుదీర్ఘ అధ్యయనం తర్వాత వారొక నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రక్రియ మంచిదైనా, చెడ్డదైనా అది ప్రభుత్వానికో లేదంటే వ్యాపార సంస్థకో ప్రయోజనం చేకూర్చేలా ఉందని తేల్చారు.
మీడియానూ కార్ల్ మార్క్స్ సునిశితంగా పరిశీలించారు.
ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసే విషయంలో మీడియా ప్రాముఖ్యాన్ని మార్క్స్ అర్థం చేసుకున్నారు.
ఇప్పుడు మనం ఫేక్ న్యూస్, మీడియా పక్షపాతం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆనాడే కార్ల్ మార్క్స్ దీన్ని ప్రశ్నించారు అని వాలేరియా చెప్పారు.
"ఆనాడు ప్రచురితమైన కథనాలను చదివి మార్క్స్ ఒక అవగాహనకు వచ్చేవారు. చిన్న చిన్న నేరాలు, పేద ప్రజల్లో నేరప్రవృత్తి వంటి అంశాలు పత్రికల్లో ఎక్కువగా కనిపించేవి. కానీ వైట్ కాలర్ నేరాలు, రాజకీయ కుంభకోణాలను మీడియా తొక్కిపట్టి ఉంచేదని ఆయన ఆనాడే అర్థం చేసుకున్నారు" అని వాలేరియా అన్నారు.
సమాజాన్ని విభజించేందుకు మీడియా కూడా ఒక చక్కని సాధనం.
"ఆంగ్లేయుల నుంచి ఐర్లాండ్ పౌరులు ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, తెల్ల జాతీయులు నల్ల జాతీయులను అవమానిస్తున్నారని, వలసవాదులు స్థానికుల మధ్య గొడవలు.. ఇలా జగడాలు పెట్టేందుకు మీడియాను ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. పేద ప్రజలు తమలో తాము కొట్లాడుకుంటుంటే శక్తిమంతమైన సంపన్నుల జోలికి ఎవరూ రారు" అని వాలేరియా వివరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి