అత్యధిక సంస్కరణలను ఎవరు అమలుపరిచారు?

1991 నవంబర్ 12న విడుదలైన ప్రపంచ బ్యాంక్  'ఇండియా-స్ట్రక్చరల్ అడ్జస్ట్‌మెంట్ క్రెడిట్ రిపోర్ట్'ఇచ్చింది. దీనిని అనుసరించే ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహారావు ఐఎంఎఫ్-వరల్డ్ బ్యాంక్ విధానాలకు పచ్చజెండా ఊపారు.

                  pv narasimhaarao

పీవీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ మోడరేట్ ఎకానమీ ద్వారా మూడు చర్యలు తీసుకున్నారు. గ్లోబలైజేషన్, మార్కెట్ ఆర్థికవ్యవస్థ, మూలధన పంపిణీ. ఈ మూడింటి సాయంతో అప్పుడు ప్రపంచబ్యాంక్-ఐఎంఎఫ్ నుంచి భారీ స్థాయిలో రుణాలు అందాయి.

అప్పుడు, ప్రపంచ బ్యాంక్ అన్ని షరతులూ ఒప్పుకున్నారు. మూలధనంలో నిర్మాణ మార్పులు మొదలయ్యాయి. భారతదేశంలోకి విదేశీ పెట్టుబడుల రాక మొదలైంది. లైసెన్స్ నిబంధనను తొలగించడానికి పరిశ్రమలకు రాయితీలు ఇచ్చారు.

            పారిశ్రామిక ఉదారవాదం వేగంగా వ్యాపించింది. పబ్లిక్ సెక్టార్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఆలోచన మొదలైంది.

       భారత కంపెనీలను బహుళజాతి కంపెనీల్లో చేర్చారు. బహుళజాతి కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం మొదలైంది. పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ఆదాయంలో వేగంగా వృద్ధి వచ్చింది.

    
         manmohan singh    

       డబ్బు చెట్లకు కాయవని చెప్పిన
 మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. అంటే మొత్తం పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తరువాత ఇంతవరకు అత్యధికకాలం ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన ఒక్కరు మాత్రమే. మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించి తీరాలి. ఆ విషయాన్ని పేర్కొనకపోతే మన్మోహన్ కు న్యాయం చేయనివారమవుతాం. ఎందుకంటే ప్రధానమంత్రి నరసింహారావు హయాంలో ప్రారంభించిన, అమలుపరిచిన కొన్ని ముఖ్య సంస్కరణలకు ప్రధాన కారకుడుగా అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్‌నే చెప్పి తీరాలి. 

ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాం (2004–-2014)లో అమలైన 26 సంస్కరణలు:
    
        వ్యాట్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆధార్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ (డిబిటి), ‘నో ఫ్రిల్స్’ లేక ‘జీరో బ్యాలెన్స్’ బ్యాంక్ అకౌంట్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణ, విద్యాహక్కు, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఆశా), నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్, నేషనల్ హార్టికల్చర్ మిషన్, వాతావరణ పరిస్థితుల ప్రాతిపదికన పంటల బీమా, ; నేషనల్ స్కిల్ డెవలెప్ మెంట్ మిషన్ అండ్ కార్పొరేషన్, 
సకల వస్తు సేవలపై వ్యాట్, సెక్యూరిటీలపై లాంగ్‌టర్మ్ కేపిటల్ గెయిన్స్ రద్దు; ఎస్‌టిటి, 

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీల సంస్కరణలపై నమూనా చట్టం,
కిరాణా వ్యాపారరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి, 
బొగ్గుగనుల తవ్వకాలలో ప్రైవేట్ కంపెనీలకు అనుమతి, 
పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీల రద్దు, 

జెండర్ బడ్జెట్, డిమ్యూటలైజేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్ఛేంజెస్, పిఎఫ్‌ఆర్‌డిఏ చట్టం, కంపెనీల చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం, న్యాయబద్ధమైన నష్టపరిహార హక్కు చట్టం, అటవీహక్కుల చట్టం మొదలైనవి.
       ఇతని హయాం లోనే 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం మొదలైనవి వెలుగులోకి వచ్చాయి.
ఆర్థిక సంస్కరణలకు అవినీతికి పరస్పర సంబంధం ఉంది.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?