ప్రభుత్వరంగ పరిశ్రమలు ప్రైవేటు పరిశ్రమల అభివృద్ధికి సోపానాలు




       pc: sakshi.com
       దేశం పారిశ్రామిక ప్రగతి పాధించడానికి ప్రణాళికాబద్ధ వ్యూహాల్లో భాగంగా 1948లో 1956లో పారిశ్రామిక విధానాలను రూపొందించి పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని కీలకమైన పాత్ర వహించాలనుకున్నారు పెద్ద పెట్టుబడిదారులు. ప్రైవేటు పెట్టుబడిదారులకు భారీ పరిశ్రమలలో పెట్టుబడి పెట్టాడావికి స్తోమత లేదని, ఆబాధ్యతను ప్రభుత్వమే నెరవేర్చాలని 1958 పారిశ్రామిక విధానంలో చెప్పారు. దాంతో
ప్రభుత్వరంగంలో కీలకమైన పరిశ్రమలను, భారీ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇతర రంగాల్లో ప్రైవేటు పెట్టుబడి దారులను ప్రోత్సహించాలని కూడా చెప్పారు.  విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించాలని స్వదేశీ పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎగుమతి దిగుమతి విధానాలను నియంత్రించాలని నిర్ణయించారు.ఈ ప్రణాళికను టాటా బిర్లా ప్రణాళిక అని కూడా అంటారు.

పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం
  ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పరిధిని స్పష్టంగా పేర్కొంటూ పరిశ్రమలను నాలుగు వర్గాలుగా విభజించారు. ఈ తీర్మానంతో మన దేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకొంది.

 ప్రభుత్వ వర్గంలోని పరిశ్రమలు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉంటాయి. మూడు రకాల కార్యకలాపాలను నిర్వహించే పరిశ్రమలను ఈ వర్గంలో చేర్చారు. అవి..

1.దేశ రక్షణ, తత్సంబంధ పరిశ్రమలు, ఆయుధ సామగ్రి, ఆయుధాల ఉత్పత్తి, నియంత్రణ.
2.అణుశక్తి ఉత్పత్తి, నియంత్రణ.
3.రైల్వేలు వాటి నిర్వహణ, యాజమాన్యం
రెండో వర్గం (మిశ్రమ రంగం): ఇందులో ఆరు కీలక, మౌలిక పరిశ్రమలను చేర్చారు. అవి.. 1. బొగ్గు, 2. ఇనుము, ఉక్కు, 3. విమానాల ఉత్పత్తి, 4. నౌకా నిర్మాణం,
5.టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్‌లెస్‌ పరికరాల ఉత్పత్తి, 6. ఖనిజ నూనెలు.
ఈ తీర్మానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ వర్గంలోని పరిశ్రమల్లో కొత్త వాటిని ప్రైవేటు రంగంలో స్థాపించడానికి వీల్లేదు. ఇకపై వీటిని ప్రభుత్వ రంగంలోనే స్థాపిస్తారు. అప్పటికే ప్రైవేటు రంగంలో ఉన్న వాటిని కొనసాగించవచ్చు. అవసరమనుకుంటే పదేళ్ల తర్వాత నష్టపరిహారం చెల్లించి వాటిలో దేన్నయినా ప్రభుత్వం జాతీయం చేయొచ్చు.

         పారిశ్రామిక ప్రగతికి, ఆర్థిక ప్రగతికి రాజ్యాంగంలోని ఆరు సూత్రాలు గైడ్ గా వుండాలని చెప్పారు. భారత దేశాన్ని సోషలిస్టు తరహా సమాజంగా మార్చాలని విధానాల్లో ప్రకటించారు. 
       పారిశ్రామిక అభివృద్ధి జరిగి పేదరికం, నిరుద్యోగ సమస్య తొలగిపోతుందని ఆశించారు. కాని ప్రభుత్వరంగలలో నెలకొల్పిన భారీ పరిశ్రమల (బొగ్గు, ఇనుము, ఇంధనం) వలన లాభపడింది.
 ప్రైవేటు పెట్టుబడిదారులు. వారికి కావాల్సిన పారిశ్రామిక మౌలిక సాధనాల కల్పనను (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) తక్కువ ధరలకు ప్రభుత్వం అందించింది. కరెంటు, ఇంధనం, బొగ్గు, రోడ్డు రవాణా, రైల్వే సౌకర్యాలు, సమాచార సౌకర్యాలను ఉపయోగించుకున్నది ప్రైవేటు పెట్టుబడి దారులే. ఈ క్రమంలో సామాన్య ప్రజలకు కూడా కొన్ని సౌకర్యాలు లభించాయి. ఉద్యోగ అవకాశాలు దొరికాయి. కాని ప్రధానంగా లాభపడింది ప్రైవేటు పెట్టుబడి దారులే.ప్రభుత్వరంగ పరిశ్రమలు ప్రైవేటు పరిశ్రమల అభివృద్ధికి సోపానాలుగా ఉపయోగ పడ్డాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?