'వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదు'_నమో
📍వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదు" అని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించారు. వ్యాపారం అంటే ఆయన దృష్టిలో ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు పెట్టడం, ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం. ఆయన ఉద్దేశం ప్రకారం పారిశ్రామిక రంగం విద్య, వైద్యం ఇతర సేవలనుండి ప్రభుత్వం తప్పుకుని వాటిని స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలి. దేశంలోని వనరులను ప్రజల నుండి లాక్కుని ఈ కార్పొరేట్లకు అప్పగించే ఫెలిసిటేటర్ గా మాత్రమే ప్రభుత్వం ఉండాలి. అంటే దేశంలోని వనరులను ఒక క్రమపద్ధతిలో ఉపయోగించుకుని ప్రణాళిక ప్రకారం పరిశ్రమలు స్థాపించి ప్రజలకు ఉపాధి, విద్య, వైద్యం కల్పించే బాధ్యతలనుండి ప్రభుత్వం తప్పుకుని స్వదేశీ, విదేశీ ప్రయివేటు పెట్టుబడిదారులకు దేశంలోని వనరులన్నిటినీ అప్పగిస్తే వారే ప్రజలకు ఉపాధి కల్పిస్తారనే పాత సిద్ధాంతాన్నే ఆయన వల్లె వేశారు.
📍 నిజానికి ఈ సిద్ధాంతం మోడీది కాదు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ మూడు దశాబ్దాల క్రితమే ప్రపంచం మీద రుద్దిన సిద్ధాంతం ఇది. దీన్ని అమలు జరిపే క్రమంలోనే సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ (ఎల్పిజి), "సంస్కరణలు", "ప్రభుత్వ ఉ పసంహరణ", "కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన", "ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్", "గుడ్ గవర్నెన్స్" ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" వంటి అనేక నినాదాలు పుట్టుకొచ్చాయి.* ఆచరణలో మోడీ ప్రభుత్వం చేస్తున్నది వ్యాపారం నుండి తప్పుకోవడం కాదు. ప్రభుత్వమే పూనుకుని ప్రజాధనాన్ని, ప్రజల ఉమ్మడి సంపదను ప్రైవేట్ కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టడం
📍మోడీగారు వల్లె వేస్తున్న ప్రపంచీకరణ కొద్దిమంది కుబేరులకు మాత్రమే లాభం చేకూర్చిందని ఆర్థిక గణాంకాలు సైతం చెబుతున్నాయి. మరోవైపు ఇది మొత్తం ప్రపంచాన్ని భారత దేశాన్ని కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసింది. ఆర్థిక అసమానతలు నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయాయి. దీన్నుండి బయటపడలేక పెట్టుబడిదారీ వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నరేంద్ర మోడీ ప్రయివేటీకరణ మంత్రాన్ని మరింతగా పటిస్తున్నారు. అన్ని రంగాలనూ ప్రయివేటీకరిస్తున్నారు. ప్రజల ఉపాధికి, దేశ స్వావలంబనకు తోడ్పడే వ్యవసాయ మార్కెట్టునూ, ప్రభుత్వ రంగాన్ని గుండుగుత్తగా ప్రయివేటు కార్పొరేట్లకు అమ్మేయడానికి పూనుకున్నారు. విశాఖపట్నం స్టీలు ప్లాంటు ప్రయివేటీకరణ నిర్ణయం కూడా అందులో భాగమే
📍బిజెపి ప్రభుత్వ ప్రయివేటీకరణను అడ్డుకోకపోతే రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుందని సూచీలు తెలుపుతున్నాయి. కరోనాకు ముందునుండే నేల చూపులు చూసిన మన ఆర్థిక వ్యవస్థ కరోనాతో మరింత దిగజారిపోయింది. రికవరీ గురించి ఎన్నిక కబుర్లు చెబుతున్నప్పటికీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు సంక్షోభం ఎంతగా ముదిరినా బడా పెట్టుబడిదారుల లాభాలకు డోకా లేకుండా ప్రభుత్వం చూస్తుంది. కానీ సంక్షోభ భారాలు ప్రజలపై తీవ్రంగా పడి వారి జీవన పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయి. ఇప్పటికే నిరుద్యోగం, అధిక ధరలతో బాధపడుతున్న ప్రజలు రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారు
📍అందువల్ల సంక్షోభాన్ని తీవ్రతరం చేసే ప్రయివేటీకరణను అనివార్యంగా ప్రతిఘటించ వలసిన పరిస్థితులు ప్రజల ముందు నిలబడ్డాయి. ఢిల్లీలో రైతులు, విశాఖలో కార్మికులు దేశ వ్యాపితంగా ట్రాన్స్ పోర్ట్ సంస్థలు చేస్తున్న ఆందోళలు మచ్చుతునకలు మాత్రమే. ఈ నిరసనలు పెరిగి ప్రయివేటీకరణ విధానాలను తిప్పకొట్టినప్పుడు మాత్రమే కార్మికులకూ ప్రజలకు రక్షణ లభిస్తుంది.
ఈ దేశ పౌరులుకి దేశ భక్తి అంటే రాజకీయ పార్టీలకు భజన చేయడం కాదని, సంక్షేమం అంటే ఉచితాలు కాదని, ఓటు అంటే అమ్ముకునేది కాదని తెలియాలి.
రిప్లయితొలగించండి