కార్మికోద్యమాలను బలహీన పరిచిన జనతాపార్టీ పాలన
1975లో విధించిన అత్యవసర స్థితి తరువాత విపక్ష పార్టీలన్నీ ఒకే పార్టీగా అవతరించాలని నిర్ణయించాయి. అలా ఏర్పడినదే జనతా పార్టీ. ఇందులో భారతీయ జనసంఘ్, సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్ (ఓ) ముఖ్య పార్టీలు. ఈ పార్టీకి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జయప్రకాష్ నారాయణ నేతృత్వం వహించారు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఓడించి దేశ చరిత్రలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది జనతాపార్టీ. అప్పుడు మొరార్జీ దేశాయ్ దేశంలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు.
జనతా పార్టీ తమ పాలనలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని, పారిశ్రామిక రంగంలో మార్పులు తెచ్చి చిన్నతరహా పరిశ్రమలకు ప్రాధాన్యత, ప్రోత్సాహం కల్పిస్తామని గుత్త పెట్టుబడిదారీ శక్తులను ఎదుర్కుంటామని చెప్పింది. అందుకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేసింది.
42వ రాజ్యాంగ సవరణతో ఏర్పడిన నిరంకుశ ధోరణులను తొలగించడానికి 44వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. రాజ్యాంగం నుండి 'ఆస్తి హక్కు' ను తొలగించారు. పారిశ్రామిక విధానాల్లో మార్పులు తెచ్చారు పారిశ్రామిక వివాదాల చట్టం 1947 కు సవరణలు చేశారు. లాకౌటు, లే ఆఫ్, రింట్రెంచ్మెంటు ప్రకటించడానికి, పరిశ్రమలను మూసివేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సవరించారు. అయితే ఈ సవరణ 300 కార్మికులు వున్న పరిశ్రమలకు మాత్రమే వర్తిస్తుంది. దేశంలో చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల సంఖ్యే చాలా ఎక్కువ. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 78.5 శాతం ఫ్యాక్టరీలలో 50మంది కంటే తక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నారు. వందమందికంటే తక్కువ మంది. పనిచేసే ఫ్యాక్టరీలు కేవలం 10.8 శాతం మాత్రమే అంటే 1976లో పారిశ్రామిక వివరాల చట్టంలో తెచ్చిన సవరణవల్ల సంఘటిత రంగంలో ఉన్న తక్కువ శాతం కార్మికులకే ప్రయోజనం. 1982లో మరలా ఈ చట్టాన్ని సవరించి 100 మంది కార్మికులు పనిచేసే పరిశ్రమలకు వర్తించేటట్టు చేశారు. జనతా ప్రభుత్వంలో పారిశ్రామిక సంబంధాల బిల్లును ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు. వీరి పాలనలోనే అత్యవసర సర్వీసుల చట్టం తీసుకొచ్చి సమ్మె హక్కుపై కఠినమైన షరతులను విధించారు.
జాతీయ భద్రత చట్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించి అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం కార్మికుల హక్కులకు ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే విదానాలను తీసుకవచ్చింది. మరో ప్రక్క పారిశ్రామిక విధానాలను మార్చి చిన్న పరిశ్రమల ప్రోత్సాహం పేరుతలో రాయితీలను, ఋణాలను, సౌకర్యాలను, పెట్టుబడి దారులకు కల్పించి ప్రయోజనం చేకూర్చారు. వరిశ్రమాదివ తులు. ఈ ఆవకాశాన్ని ఉపయోగించుకుని పరిశ్రమను విడగొట్టి విభాగాలు చేసే అనుబంధ పరిశ్రమలను నెలకొల్పి ఉత్పత్తిని కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చారు. కార్మిక ఉద్యమాన్ని పరోక్షంగా
బలహీన పరిచారు.
1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆగస్టు 2013 లో ఈ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి