గ్రామీణ స్థానిక సంస్థలు : స్థానిక సంస్థల ప్రతినిధుల ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ చేత నేరుగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతాయి. pc: eastgodavari.ap.gov.in జిల్లా పరిషత్ టెరిటోరియల్ నియోజకవర్గం (zilla parishad territorial constituency) pc: hansindia.com ZPTC సభ్యులు మండల పరిషత్ టెరిటోరియల్ నియోజకవర్గం ( mandal parishad territorial constituency – MPTC) సభ్యులు pc prajasakti.com గ్రామ పంచాయతీ సర్పంచ్ ( gram panchayat sarpanch ) గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యుడు. పట్టణ స్థానిక సంస్థలు : పట్టణ స్థానిక సంస్థలు మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు మరియు నగర్ పంచాయతీలను కలిగి ఉంటాయి. మునిసిపల్ కార్పొరేషన్ యొక్క కార్పొరేటర్లు / వార్డ్ సభ్యులు మునిసిపాలిటీ / నగర్ పంచాయతీ కౌన్సిలర్లు / వార్డ్ సభ్యులు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ విధులు : ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తమ విధులు, బాధ్యతలను నిర్వర్తించాల్స...
*పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి*.. మనిషి సామాజిక సంబంధాల్లోనూ అతని సామాజిక జీవితంలోనూ మార్పులు వచ్చినప్పుడల్లా అతని భావాలూ , అభిప్రాయాలు కూడా మారిపోతుండటం మనం చూస్తూంటాం. అంటే అతని చుట్టూ ఉన్న జీవితం మారినప్పుడు అతని చైతన్యమూ మారుతుంది. సమాజాన్ని విప్లవీకరించే కొన్ని భావాలను జనం వ్యక్తం చేస్తున్నారంటే,పాత సమాజం లోనే కొత్త సమాజపు అంశాలు కొన్ని పుట్టాయని అర్ధం. పాత జీవన పరిస్థితులు అంతమౌతున్న కొద్దీ పాత భావాలు కూడా అంతరిస్తాయి. ప్రాచీన ప్రపంచం మరణ శయ్యపై ఉన్నపుడు అంతకుముందు ఉన్న మతాలను క్రైస్తవ మతం తనలో కలిపేసుకుని వాటిని పూర్తిగా కనుమరుగు చేసింది. భూస్వామిక సమాజం అంతమవుతున్న దశలో ఆనాటి విప్లవ పెట్టుబడిదారీ వర్గంతో అది చివరి పోరులో ఉంది.అది పద్దెనిమిదో శతాబ్దపు కాలం. ఆ సందర్భంలో హేతువాదానికి క్రైస్తవం తలొగ్గింది. పాలక వర్గం ఆలోచనలే ప్రతి యుగంలో సమాజాన్ని పాలించే భౌతిక శక్తి . ఉత్పత్తి సాధనాలపై ఎవరికి ఆధిపత్యం ఉంటుందో వారికే మానసిక ఉత్పత్తి సాధ...
2500 సంవత్సరాల క్రితం(క్రీ.పూ.500నాడు) మనుషులకు ప్రకృతి గురించి తెలిసినది చాలా తక్కువ. ఆ రోజుల్లో భారతదేశంలోనూ, గ్రీస్ లోనూ కొందరు నాస్తికులు ఉండేవారు. ప్రాచీన భారతీయ నాస్తికులను చార్వాకులని, లోకాయతులని అనే వారు. లోకాయతులు అంటే ఉన్న కనిపించే ఈ లోకాన్నే నమ్మేవారని. వీరు పరలోకాన్ని నమ్మరు. వీరు దేవుడు, ఆత్మ లాంటి ఊహాజనిత నమ్మకాల్ని, కర్మ సిధ్ధాంతాల్ని తిరస్కరించారు. చార్వాకం లేదా లోకాయతం లేదా బృహస్పత్యం భారతదేశపు ప్రాచీన భౌతికవాదం. ఈ వాదాన్ని బోధించిన వాడు చార్వాకుడు . ఇతను ఒక మహర్షి, బృహస్పతి శిష్యుడు. నాస్తిక మత వ్యాప్తి చేసినవాడు. లోకాయత సిద్ధాంత కర్త. చార్వాక, లోకాయత, బార్హస్పతి అని అనేక పేర్లు గలవు ఈ శాఖకు. ‘లోకేషు అయతాః లోకాయత’ ‘లోకాయత’ అంటే ప్రజల తత్వశాస్త్రం అనీ ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు. లోకాయతకు మిగతా తత్వశాస్త్రాల లాగా ఒక మూల పురుషుడు లేడు. ఇది సామాన్య ప్రజల్లో పుట్టిన ‘అనుమాన’, ‘తర్కా’ ల ప్రభావమే. మనం భగవంతుడికి ప్రసాదం రోజూ పెడుతూనే ఉన్నాం కాని ఆయన ఎప్పుడన్నా దాన్...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి