planning, implementation management, review ప్రణాళిక అమలు, అజమాయిషీ, సమీక్ష

 ప్రణాళిక Planning

     Planning is nothing but thinking before the action takes place. It helps us to take a peep into the future and decide in advance the way to deal with the situations, which we are going to encounter in future. It involves logical thinking and rational decision making.
”ప్రణాళిక-ఆచరణ" అనేది ప్రతి విషయంలో ఉంటాయి. నిర్మాణం, అధ్యయనం ప్రచారం, ఆందోళన, పోరాటంలోను వుంటుంది,

పై కమిటీ నిర్ణయాలను చర్చ లేకుండా అమలు జరపడం అంటే దానికి తూట్లు పొడవడం అన్నమాట. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వాటిని అమలు జరపాలి జాగ్రత్తతో కూడిన, లోతైన ప్రణాళిక రూపొందిస్తేనే సరిపోదు. అది వాస్తవాలపైన, పరిశీలన పైన ఆధారపడి ఉండాలి. నాయకత్వం పథకాన్ని అమలు జరపడంలో వ్యక్తిగతంగా పాల్గొనాలి. లక్ష్యాలను రూపొందిస్తేనే సరిపోదు. ఆ లక్ష్యాలను ఛేదించడానికి ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కరించాలి. ఉదా : నదిని దాటడం కర్తవ్యం అయితే పడవో వంతెనో లేకుండా దాన్ని దాటలేం. పడవ, వంతెన సమస్య పరిష్కరించకుండా నదిని దాటడం గురించి మాట్లాడటం వృధా అవుతుంది.


కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుగా కొన్ని విభాగాలలో అమలు జరిపి అనుభవాలు తీసుకోవాలి. అప్పుడు మొత్తం కార్యక్రమం జయప్రదం కావడానికి దోహదం చేస్తుంది. ప్రజలలో కమ్యూనిస్టులు పెనవేసుకుపోవాలి. ప్రజల వద్దకు వెళ్ళి వారి నుండి నేర్చుకోవాలి. వారి అనుభవాలు విశ్లేషణ చేసి సంలీనం చేయాలి. ప్రజలతో స్నేహం చేసి, వారిని పోరాడమని చెప్పు. మనం హృదయపూర్వకంగా ప్రజలకు సేవ చేయాలి. ఒక క్షణం కూడా ప్రజల నుండి దూరం కాకుండా ఉండటం, అన్ని సమయాలలో ప్రజల ప్రయోజనం నుండి బయలుదేరడం, చిన్న గ్రూపు వ్యక్తి ప్రయోజనాలకు లొంగకుండా వుండటం చేయాలి. ప్రజలను ప్రేమించాలి. వారు చెప్పింది శ్రద్ధగా వినాలి. ప్రజలలో ఒకరిగా వుండాలి. వారికి అతీతంగా ఉండటమంటే నీటిలో చేపను బయటవేసినట్టే. ప్రజలతో మమేకమై, వారి ప్రస్తుత స్థాయిని రాజకీయ చైతన్యం కల్పించాలి. స్వచ్ఛందంగా సంఘటితం అయ్యేందుకు పురికొల్పాలి.

అమలు వ్యూహం అంటే ఆచరణే.

 ప్రణాళికను  ఎలా తీసుకురావాలో నిర్వచించే ప్రక్రియే అమలు వ్యూహం .  ప్రణాళికలో పేర్కొన్న లక్ష్యాలను అమలు చేయడానికి, నిధులు , సిబ్బంది, పంపిణీ వరకు ప్రతి అంశాన్ని మీరు ఎలా అమలు చేస్తారో మీరు  రాసుకోవాలి.అప్పుడే మీరుమీ లక్ష్యాలను సాధించడానికి వీలవుతుంది.


ఆచరణ సిద్ధాంతానికి పరీక్ష. సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మార్గం. సిద్ధాంతం భౌతిక ప్రపంచానికి అనుగుణంగా ఉందా! లేదా! దానంతటది తెలియదు. ఆచరణలో పెట్టినపుడే దాని బండారం బయటపడుతుంది. పొరపాట్లు వుంటే ఆచరణ ద్వారా సవరించబడతాయి. రూపొందించిన సిద్ధాంతాలు ఆచరణలో పెట్టాలి. ప్రారంభించబడిన పథకాలు, సిద్ధాంతాలు, కర్తవ్యాలు మధ్యలో మార్చవలసి రావచ్చు. గతంలో పరిగణలోకి తీసుకొని అంశాలు ఆచరణలో ఉన్నప్పుడు బయటపడవచ్చు. సాధారణంగా ఆలోచన వాస్తవికత కన్నా వెనుకబడి ఉండవచ్చు. మనిషి అనుభూతికి అనేక పరిమితులుండటమే దీనికి కారణం. 

 Strong leaders are able to translate strategy and ideas into execution. ... One category of leadership skills is Leading Implementation, and it includes the following leadership skills

Coaching and Mentoring,  Focus, Delegation, Effectiveness, Monitoring Performance, Planning and Organizing, and thoroughness.


విజయమనేది పనిని ఏ రకంగా నిర్వహించాం అనే దాన్ని బట్టి ఉంటుంది

విజయం లేదా ఫలితం దేనిమీద ఆధారపడుతుంది? 

1.ఏ విధంగా పథకం రూపొందించామనే దాన్ని బట్టి

2.పార్టీ విధానాన్ని అన్వయింప చేయడానికి జరిగే పోరాటాన్ని రూపొందించేదాన్ని బట్టి 

3.పని చేసే వారిని సరిగా ఎంపిక చేసేదాన్ని బట్టి

4. నిర్ణయాలను నెరవేర్చడంపై నిఘా ఏ రకంగా పెడతారనే దాన్ని బట్టి, 

5. నిర్ణయాలను అమలు జరపడంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి చేసే పోరాటంపై విజయాలు ఆధారపడి ఉంటాయి.


Managerial action,checkup action

అజమాయిషీ ఎలా చేయాలి?

1. పెత్తందారీతనానికి, జాప్యానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అజమాయిషీ (Check |u|p)చాలా కీలకపాత్ర వహిస్తుంది 

2.నాయకత్వ సంస్థల నిర్ణయాలు అమలు జరిగాయా? తూట్లు పొడిచారా? సక్రమంగా అమలు జరిపారా? వక్రీకరించారా? యంత్రాంగం చైతన్యయుతంగాను,  పట్టుదలతో పని చేస్తుందా? క్లచ్ లేని బండిలాగా వుందా? ఇవన్నీ కనిపెట్టాలంటే అజమాయిషీ వుండాలి.

3.అజమాయిషీ అనేది సెర్చ్ లైట్ వంటిది. ఏ సమయంలోనైనా యంత్రాంగం ఎలా పని చేస్తున్నది అనేది తెలుస్తుంది. అడ్డంకులుగా వున్న వారిని వెంటనే పట్టుకోవచ్చు. 

4.అజమాయిషీ పథకం ప్రకారం వుండాలి (Spasmodic)గా వుండరాదు.  అజమాయిషీ ముఖ్య నాయకత్వానికే అప్పచెప్పాలి.


కార్యకర్తలు - అజమాయిషీ


కార్యకర్తలను అజమాయిషీ చేయడం అంటే వారి వాగ్దానాలు, ప్రకటనలు, మాటలబట్టిగాక వారి పని వలన వచ్చిన ఫలితాలను బట్టి పరీక్ష చేయడం. కర్తవ్యాల నిర్వహణను అజమాయిషీ చేయడం అంటే ఆఫీసులోనే గాక, రిపోర్టుల ద్వారానే గాక ముఖ్యంగా పనిలోనే, పని జరిగే స్థలంలోనే వాస్తవ నిర్వహణ, ఫలితాలను బట్టి పరీక్ష చేయడం


ఈ అజమాయిషీ వలన 1. కార్యకర్త యొక్క వాస్తవ గుణగణాలను నిర్ణయించవచ్చు. పని యంత్రాంగంలోని మంచి లక్షణాలను, బలహీనతన్ని గమనించగలము. 3. దీనివలన మాత్రమే కర్తవ్యాల మంచి చెడులను నిర్ణయించవచ్చు


పై నుండి నాయకత్వం కింది వారని అజమాయిషీ చేయడం, కింది నుండి కార్యకర్తలు ప్రజలు నాయకత్వాన్ని వారి తప్పొప్పులను అజమాయిషీ చేయడం నిరంతరం జరగాలి.

Reviewing is an essential feature of experience-based learning, but some outdoor educators are still not convinced of its value. Even those who are convinced of its value, often find that reviewing is the most vulnerable feature of a programme:

If a group are particularly successful with an activity or challenge, the review may be a pat on the back, and a quick look at why the team were successful. Often though, everyone learns more when things don't quite go according to plan! Here a review helps to see what went wrong, how to form a better plan, and how to put this into practice next time. Reviews develop presentation and communication skills, encourage participation, and add value. 

సమీక్ష చేయడం ఎలా?

మనం అమలు జరిపిన అంచనాలు సత్ఫలితాలు యిచ్చాయో లేదో తెలియాలంటే సమీక్ష అవసరం. సమీక్ష చేసేటప్పుడు ఆచరణతో ప్రారంభించి, అంచనా వరకు వెళ్ళాలి. అప్పుడు మనం ఎక్కడ తప్పు చేశామో తెలుస్తుంది. అప్పుడు అనుభవంలోకి వచ్చిన లోపాన్ని గుర్తించి వాటిని తొలగించి మార్చుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలి. అంటే మన ఆచరణ వలన వచ్చిన ఫలితాన్ని తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలి.


సమీక్ష చేసే పద్ధతులు


ఎ. వాగ్దానాలు హామీలే కాకుండా అమలు జరిపిన పనిలో వచ్చిన ఫలితాలు గుర్తించాలి.

బి. కర్తవ్యాలను చైతన్యవంతంగా నిర్వహిస్తున్నారా? లేక మొక్కుబడిగా నిర్వహిస్తున్నారా? అనే సమీక్ష చేయాలి

సి.అమలులో వున్న వాటి పై దృష్టి కేంద్రీకరించాలి. నిజంగా, సరిగ్గా అమలు జరుగుతున్నాయో లేక వక్రీకరించబడుతున్నాయా అనేది సమీక్షించాలి •

డి. సమీక్షపై నుండి క్రిందికే కాకుండా కింది నుండి పైకి కూడా జరగాలి. 

ఇ.సమీక్షా పద్ధతులు క్రమం తప్పకుండా, జాప్యం లేకుండా జరగాలి.

ఎఫ్. నాయకులు ఈ సమీక్షా సమావేశాలలో ప్రత్యక్షంగా పాల్గొనాలి. తమ అనుభవాన్ని సభ్యుల అనుభవంతో జోడించాలి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?