దిద్దుబాటుకు సంబంధించి నిర్మాణపరమైన చర్యలు


       pc: pinterest
(1) అన్యవర్గ ప్రభావాలను ఎదుర్కోవడం పార్టీ వర్గ, ప్రజాపోరాటాలలో నిమగ్నమయినపుడు మాత్రమే సాధ్యమవుతుంది. పార్టీ వర్గ, ప్రజా సమస్యలను చేపట్టి వాటిపై నిరంతర పోరాటాలను నిర్వహించాలి.

 (2)  పార్టీలోకి కొత్త సభ్యులను రిక్రూట్ చేసుకోవడం తప్పనిసరిగా పార్టీ. నిబంధనావళిలో పేర్కొన్న పద్ధతిలో జరగాలి. పార్టీ సభ్యత్వ పరిశీలన, పునరుద్ధరణ ప్రతిఏటా కచ్చితంగా జరగాలి.

(3) పార్టీ శాఖలను చురుగ్గా పనిచేయించాలి. ప్రతి పార్టీ సభ్యుడు ఏదో ఒక ప్రజాసంఘంలో పనిచేసేలా చూడాలి.

(4)కార్మిక వర్గం, ఇతర పునాది వర్గాలనుండి పార్టీ సభ్యులను రిక్రూట్ చేసుకోవడం ద్వారా బలపడాలి. వారి నుండి వచ్చిన కేడరును సైద్ధాంతికంగా అభివృద్ధి చేసి, ప్రమోట్ చేయాలి. పునాది వర్గాల నుండి హోల్టైమర్లుగా రావడానికి వీలు కలిగే విధంగా హోల్టైమర్లకు చెల్లించే వేతనాలు వారి కుటుంబ కనీస జీవనానికి తగినంతగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

(5) పార్టీ కమిటీల్లో విమర్శ, ఆత్మ విమర్శ జరగాలి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి, బ్యూరోక్రటిక్ ధోరణులను ప్రతిఘటించాలి. ఎలాంటి ముఠాకార్యకలాపాలకు
పాల్పడకుండా పార్టీ సభ్యులను చైతన్యవంతం చేయాలి. 

(6) సభ్యుల రాజకీయ, సైద్ధాంతిక స్థాయిని పెంచడంపై కేంద్రీకరించి ఒక క్రమపద్ధతిలో పార్టీ విద్యను అందించాలి.

(7) ప్రజాసంఘాలను ప్రజాస్వామ్యయుతంగా పనిచేయించడానికి, వాటి స్వతంత్ర ప్రతిపత్తిని కొనసాగించడానికి ప్రజాసంఘాల పట్ల వైఖరిపై కేంద్ర కమిటీ తీర్మానాన్ని అమలుచేయాలి.

ఉల్లంఘనలను దర్యాప్తుచేసే యంత్రాంగం

 1.    పార్టీ నాయకులపైన, కేడరు పైన అవినీతి, అవకతవకల ఫిర్యాదులు అందినప్పుడు చాల పార్టీ కమిటీలు తగువిధమైన చర్యలను వెనువెంటనే తీసుకోవడం లేదని అనుభవం చెబుతున్నది. ముఠా ధోరణులు, ఉదారవాదం, ముఖ్యమైన కేడరును వ్యతిరేకం చేసుకోవడానికి విముఖత లాంటి అంశాల రీత్యా తరచూ పార్టీ కమిటీలు చర్యలు చేపట్టలేకపోతున్నాయి.

2. నిర్మాణపరమైన క్రమశిక్షణకు సంబంధించిన అంశాలను పార్టీ కమిటీలోని నిర్మాణపరమైన ఏర్పాటు చూడాల్సి ఉన్నప్పటికీ, అవినీతి ఆరోపణలు, కమ్యూనిస్టు ప్రమాణాలకు కట్టుబడకపోవడం లాంటి వాటిపై దర్యాప్తు జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
దీనికోసం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక కేంద్ర క్రమశిక్షణా కమిషన్ ను ఏర్పాటు చేయాలి. కొంత మంది పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో ఉండే ఆ కమిషన్ అవినీతి ఆరోపణలను, విలువల ఉల్లంఘన ఆరోపణలను విచారిస్తుంది. ఈ కేంద్ర క్రమశిక్షణా కమిషన్ తనంత తానుగా విచారణ జరపవచ్చు. లేదా సంబంధిత రాష్ట్ర జిల్లా కమిటీలను దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశించవచ్చు. అప్పటికే దర్యాప్తు జరుగుతున్నట్లయితే ఆ పార్టీ కమిటీకి దాన్ని పూర్తి చేసేందుకు గడువు నిర్ణయించాలి. నివేదికలు, రికార్డులను అది కోరవచ్చు.

3. కేంద్ర క్రమశిక్షణా కమిషన్ నివేదికలన్నీ సంబంధిత పార్టీ కమిటీకి చర్యతీసుకునే నిమిత్తం అందచేయబడతాయి. ఆ నివేదికపై తగు చర్యతీసుకోలేదని కమిషన్ భావించినపుడు ఆ విషయాన్ని నిర్ణయం తీసుకునేందుకు పొలిట్ బ్యూరోకు, లేదా కేంద్రకమిటీకి తెలియచేయవచ్చు.
దిద్దుబాటుకు మార్గదర్శక సూత్రాలు దిద్దుబాటు ఉద్యమంలో చర్యలు తీసుకునేందుకు ఈ క్రింది మార్గదర్శకాలను అనుసరించాలి:


4.ప్రజా ఉద్యమాలను, వర్గపోరాటాలను బలోపేతం చేసేందుకు పార్లమెంటరీ, పార్లమెంటరీ కార్యకలాపాలను కొనసాగించాలన్న దృక్పథంతో పార్టీ కేడరును చైతన్యవంతం చేయాలి.

(5) పార్లమెంటరీతత్వాన్ని, ఎన్నికల అవకాశవాదాలను ఎండగట్టాలి, ప్రజా ఉ ద్యమాలను, పార్టీ నిర్మాణాన్ని విస్మరించి, కేవలం ఎన్నికల కార్యకలాపాలకే ప్రాధాన్యత ఇచ్చే ఏకపక్ష ధోరణిని ప్రతిఘటించాలి.

(6) ఎన్నికల్లో రెండు మూడు దఫాల కంటే ఎక్కువ సార్లు ఒక్కరే పోటీచేయరాదన్న సూత్రాన్ని వివిధ స్థాయిల్లో అమలుచేయాలి. అసాధారణ సందర్భాలలో దీనికి మినహాయింపు ఇవ్వాలంటే శాసనసభకు పోటీ విషయంలో సంబంధిత రాష్ట్రకమిటీ, పార్లమెంటుకయితే కేంద్రకమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అంతకన్నా క్రిందిస్థాయిల్లో అయితే సంబంధిత జిల్లాకమిటీ నిర్ణయం తీసుకుంటుంది.

(7) పార్టీ సభ్యులు పార్టీ ప్రమాణాలకు కట్టుబడేలా చైతన్యవంతం చేయాలి. అన్ని రకాల అభివృద్ధినిరోధక సామాజిక ఆచారాలు, కులం, మత క్రతువులు లాంటి వాటిని విడనాడేలా చేయాలి. అస్పృశ్యత, కులవివక్ష, మహిళల అణచివేత లాంటి అంశాలకువ్యతిరేకంగా పార్టీ సభ్యులు ప్రజలను సమీకరించాలి.

(8) అవినీతి, అవకతవకల ఆరోపణలను విచారించి అవసరమైన చోట్ల చర్యలు తీసుకోవాలి. పార్టీ నిధుల వినియోగం, ఎకౌంట్లను సక్రమంగా నిర్వహించడం, పర్యవేక్షణలకు సంబంధించిన నిబంధనలను అమలుచేయాలి. నిధులను సేకరించడంలో మార్గదర్శక సూత్రాలను రూపొందించాలి.

(9) ముఠాతత్వాన్ని ఎదుర్కొనేందుకు రాజకీయ, నిర్మాణపరమైన చర్యలు తీసుకోవాలి. కేంద్రీకృత ప్రజాస్వామ్యం గురించి పార్టీ సభ్యులను చైతన్యవంతం చేయాలి. ముఠాతత్వ ధోరణులను బలంగా వ్యతిరేకిస్తూనే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొనసాగేలా చూడాలి. 
(10) కేంద్రకమిటీ, రాష్ట్రకమిటీ, జిల్లాకమిటీల సభ్యులందరూ, పెద్ద రాష్ట్రాలలో జోనల్ ఏరియా, లోకల్ కమిటీ సభ్యులందరూ తమ ఆదాయం, ఆస్తుల వివరాలను సంబంధిత కమిటీలకు ప్రతి ఏటా అందించాలి. ఆస్తుల వివరాలను మరింత వివరంగా చేర్చేందుకు, ఆదాయవనరులను అధికంగా పేర్కొనేందుకు నమూనా ఫారం సవరించబడుతుంది. వీటిని పరిశీలించి తదుపరి రెన్యూవల్ నివేదిక తయారయ్యే లోగా పై కమిటీకి నివేదికను పంపాలి.

దిద్దుబాటు ఉద్యమాన్ని అమలు చేసే విధానం

1)దిద్దుబాటు ఉద్యమంపై కేంద్రకమిటీ తీర్మానాన్ని
 పార్టీ అన్ని స్థాయిల్లోను నివేదించాలి.

(2)దిద్దుబాటు ఉద్యమం పత్రం ఆధారంగా పొలిట్జ్బ్యూరో, కేంద్రకమిటీల స్థాయిలో
దిద్దుబాటు ప్రక్రియ ఎలా ఉండాలన్న అంశంపై పొలిట్బా్బ్యూరో, కేంద్రకమిటీలు చర్చించి.
నిర్ణయించాలి. అలాగే రాష్ట్రకమిటీలు కూడ తమ దిద్దుబాటు గురించి ఒక పత్రాన్ని
రూపొందించుకొని దిద్దుబాటు ఉద్యమాన్ని చేపట్టాలి. ఈ క్రమం ఆ తర్వాత జిల్లాకమిటీలకు,
ఇంకా క్రిందిస్థాయి కమిటీలకు వెళ్లాలి.  కేంద్రకమిటీ దిద్దుబాటు ఉద్యమం అమలును సమీక్షించాలి.

(3) ఈ దిద్దుబాటు ఉద్యమం పార్టీని సరైన సూత్రాలపైన బలోపేతం చేసి, సమైక్యం చేయడానికే. దీన్ని ఇతరులపై బురద జల్లడానికి, స్వంత ఎజెండాలను ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగించుకోకూడదు. చర్చలు స్వేచ్ఛ, నిష్కపట వాతావరణంలో జరగాలి.

పార్టీ ముఖ్యనాయకులకు (ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాలతో సహా), ప్రజాప్రతినిధులకు (ఎంపిలు, ఎంపిల్లలు, స్థానిక సంస్థల చైర్మన్లు మొదలైన వారు) ప్రవర్తనా నియమావళి
మన పార్టీ నాయకులు చట్టసభల్లోను, బయట పనిచేస్తున్న వారు, ప్రైవేటు, కంపెనీలు, ప్రైవేటు లాబీలు సమకూర్చే సదుపాయాలను స్వీకరించకూడదు. డిన్నరు/ ఖరీదైన బహుమానాలు, హోటళ్లలో బసచేయడం, ప్రయాణ చార్జీలు ధరించడం, ఖరీదై బహుమానాలు కొనే సమయంలో డిస్కౌంట్లు- ఈ కోవలోకి వస్తాయి.

(4) పార్టీనాయకులు, ప్రజాప్రతినిధులు నిరాడంబరంగా జీవించాలి. తమ కుటుంబ సభ్యులు, బంధువుల వివాహాలను ఆడంబరంగా జరపకూడదు. వరకట్నం తీసుకోకూడదు. వారు మత ఉత్సవాలను నిర్వహించకూడదు, వ్యక్తిగతంగా అలాంటివారిలో పాల్గొనకూడదు. 
(5) పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంటిని సమకూర్చుకునేటప్పుడు, నిర్మించేటపుడు, ఇతర ఆస్తులను సమకూర్చుకునేటపుడు, లేదా వాహనాన్ని కొనుగోలు చేసేటపుడు సంబంధిత పార్టీ కమిటీ అనుమతి తీసుకోవాలి.

(6) ప్రజాప్రతినిధులు తమకు లభించే వేతనాలు, అలవెన్సులపై పార్టీ నిర్ణయించిన లెవీని కచ్చితంగా, క్రమబద్ధంగా చెల్లించాలి. పార్టీ నాయకత్వస్థానాల్లో ఉన్న కేడరు ఈ విషయంలో ఇతరులకు ఆదర్శంగా ఉండాలి.
నిధుల సేకరణకు సంబంధించి ఆ రాష్ట్రకమిటీలు రూపొందించిన సూత్రాలకు కట్టుబడి పార్టీనాయకులు, ప్రజాప్రతినిధులు నిధులు వసూలు చేయాలి. 
(7) పార్టీ డబ్బుకు, ప్రజాసంఘాల నిధులకు, ప్రభుత్వ నిధులకు పార్టీ నాయ కచ్చితమైన జమా, ఖర్చులు నిర్వహించాలి. అధికారిక కార్లు, ఇతర సదుపాయాలను కుటుంబ సభ్యుల కోసం, స్నేహితుల కోసం దుర్వినియోగం చేయకూడదు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?