మన దేశ ప్రాచీన చరిత్ర తెలుసుకోవాలి


         pc: amp.scmp.com mao

మన దేశ ప్రాచీన చరిత్ర తెలుసుకోవాలి
                           __ మావో
  కొంత మంది పార్టీ సభ్యులు,సానుభూతిపరులు   చరిత్ర అధ్యయనం లో ఉన్నప్పటికీ అది ఒక క్రమపద్ధతిలో జరగడంలేదు. గత వంద సంత్సరాల చరిత్ర కానివ్వండి, పురాతన కాలం నాటి చరిత్ర కానివ్వండి. మొత్తం మీద మన దేశ చరిత్ర గురించి మన పార్టీ సభ్యులు చాలా మంది ఇంకా అయోమయంలోనే వున్నారు. పురాతన గ్రీసును ఉదహరించకుండా మాట్లాడలేని మార్క్సిస్టు-లెనినిస్టు పండితులు చాలా మంది వున్నారు. కానీ తమ పూర్వీకుల గురించి మాత్రం వారు పూర్తిగా మర్చిపోతారు. ప్రస్తుత పరిస్థితుల్నిగాని, తమ చరిత్రనుగాని లోతుగా అధ్యయనం చేయడంలేదు. 

మన చరిత్ర ఏమీ తెలియకపోవడం, లేదా అతికొద్దిగా తెలియడం మూలంగా సిగ్గుపడటానికి బదులు గర్వించేవాళ్ళు కొంత మంది వున్నారు. వాస్తవానికి మన దేశ కమ్యూనిస్టు పార్టీ చరిత్ర, నల్లమందు యుద్ధం నుండి వంద సంవత్సరాల ఆర్థిక, రాజకీయ, సైనిక, సాంస్కృతిక చరిత్రని అధ్యయనం చేయడాన్ని ఎవరూ తీవ్రంగా పట్టించుకోలేదు. తమ దేశం గురించి ఏమీ తెలియని వాళ్ళు విదేశాల పురాతన కథల్ని మాత్రం వల్లెవేస్తారు. కనీసం ఈ విజ్ఞానం అయినా సమగ్రంగా వుండదు. అది కూడా విదేశీ పుస్తకాల నుండి సంగ్రహించిన మిడిమిడి జ్ఞానమే.
విదేశాల నుండి తిరిగి వచ్చిన విద్యార్థులు ఈ జబ్బుతో చాలా దశాబ్దాలుగా బాధపడ్డారు. ఐరోపా, అమెరికా, జపానుల నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన వాళ్ళు విదేశీ చిలక పలుకులు మాత్రమే పలుకుతారు. వాళ్ళు పాడిందే పాడే గ్రామఫోనులుగా మారిపోతారు. కొత్త విషయాలను సృష్టించడం, తెలుసుకోవడం అనే బాధ్యతలను మర్చిపోతారు. ఈ జబ్బు కమ్యూనిస్టు పార్టీలో కూడా ప్రవేశించింది.

__మావో
(పార్టీ పని విధానాన్ని చక్కదిద్దుకొందాం నుండి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?