స్థానిక స్వపరిపాలన- పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు
19వ శతాబ్దాంతంలో చేయబడిన వివిధ చట్టాల ప్రకారం ఏర్పడిన గ్రామ పంచాయతీలకు మాత్రం వారి కార్యక్రమాలకు తగిన నిధులు అందేవి కాదు. గ్రామ పంచాయతీలు కేవలం కేంద్రంలోని వలస పాలకులు అధికార గణానికి గ్రామాల్లోని స్వార్థపర శక్తులుగా, భూస్వాములుకు మధ్య వారథిగా మాత్రమే వుపయోగపడేవి.
అప్పుడే వునికిలోనికి వచ్చిన జాతీయోద్యమం 1909లో జరిగిన లాహోర్ కాంగ్రెసు జాతీయ మహాసభల్లో తీర్మానించినట్లుగా (మాలవీయ 1956) స్థానిక సంస్థలకు బలోపేతం చెయ్యడానికి ఉత్సాహం చూపింది. కాంగ్రెసు మహాసభ తగినన్ని ఆర్థిక వనరులతో ఎన్నికైన పంచాయతీలు కావాలని డిమాండ్ చెయ్యడమేగాక, స్థానిక స్వపరిపాలనా సంస్థల ఏర్పాటులో బ్రిటిష్ పాలకులు అనుసరిస్తున్న అలసత్వ ధోరణిని దుయ్యబట్టింది. వలస పాలనకు ముందున్న ప్రాచీన గ్రామీణ వ్యవస్థ వలస పాలకులచే కూలగొట్టబడినా, బలమైన జాతీయ భావాలకు పుగా నిలిచింది. గాంధీజీ గ్రామీణ స్వపరిపాలనే దేశానికి ఆదర్శమని బోధించడమేగాక. అసలు ఆయన ఉద్దేశంలో స్వరాజ్యమంటే గ్రామ స్వరాజ్యమే. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రవేశపెట్టబడిన మాంటేగు చెమ్స్ వర్డ్ సంస్కరణల తరువాత స్థానిక సంస్థల ఏర్పాటు పందుకని, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో మంత్రులకు స్థానిక స్వపరిపాలన బరిలీ అంశంగా రూపుదాల్చింది. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రాంతీయ ప్రభుత్వాలను, స్థానిక స్వపరిపాలన అభివృద్ధిని జాతీయతా వాదులు ప్రభావితం చెయ్యడానికి అవకాశం కల్పించిన -1935లో భారత ప్రభుత్వ చట్టం ఒక మైలురాయిగా పేర్కొనవచ్చు. ఏమైనా వలస పాలస అంతమొండేనాటికి స్థానిక సంస్థలు వనరులు లేకపోవడమేగాక, పౌర సదుపాయాలు కల్పించడం తప్ప వేరే బాధ్యత లేమీ లేకపోవడం, అధికారుల అనవసర జోక్యం, భూస్వాములు, అగ్రవర్గాల ప్రాతినిధ్యం పెరిగిపోవడం జరిగింది.
స్వాతంత్య్రానంతరం మరో పదేళ్లు యీ పరిస్థితే కొనసాగడం ఆశ్చర్యకరమేనని చెప్పుకోవాలి. ప్రస్తుత పరిస్థితులలో స్థానిక స్వపరిపాలనను కొనసాగించడం స్వార్థపర శక్తులకు వూతమివ్వడమేన్న ప్రప్రథమ దళిత నాయకుడు డా॥ అంబేద్కర్ వాదనతో, గాంధీజీ జోక్యం చేసుకున్నాగాని, రాజ్యాంగ నిర్మాతలెవరూ అంగీకరించలేదు. అందువల్లనే రాజ్యాంగం రూపొందించినప్పుడు ఎన్నికయిన స్థానిక సంస్థలను ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా చూపించలేదు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలలో పొందుపరిచినా, ఆ అంశాన్ని ఆచరణలో ఎవరూ పట్టించుకోనేలదు.
1951లో ప్రారంభమైన పంచవర్ష ప్రణాళికలో భాగంగా చేపట్టిన అనేక గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు అమలు పరచవలసినప్పుడు ఎన్నుకోబడిన స్థానిక సంస్థల లోటు స్పష్టంగా గోచరించింది. మొత్తం దేశాన్ని 35,000 కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాకులుగా విడగొట్టి వాటి ద్వారా గ్రామీణాభివృద్ధికి కేటాయించిన నిధులు ఖర్చు పెట్టాలని సంకల్పించారు. ఎన్నికయిన ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో తగిన ప్రజా ప్రాతినిధ్యం లభించడం కష్టమైంది. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో వాటి పాత్రను నిర్ధారించడానికి బల్వంతరాయ్ మెహతా (1959) కమిటీ నియామకం జరిగింది.
అగ్రభాగాన జిల్లా పంచాయతీ వ్యవస్థ అట్టడుగున గ్రామ పంచాయతీలతో కూడిన మూడంచెల పంచాయతీ వ్యవస్థ రూపొందించడంలో ఈ కమిటీ నివేదిక చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండింటి మధ్యన కమ్యూనిటీ డెవలప్మెంటు బ్లాకు అనుసంధానకర్తగా వుంటుంది. ఈ కమిటీ సిఫారసుల ననుసరించి చాలా రాష్ట్రాలు తమ చట్టాలను సవరించుకున్నాయి.
ఈ క్రొత్త చట్టాలు కలిగించిన ఉత్సాహం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పడిన నూతన పంచాయతీ రాజ్ వ్యవస్థ చాలా కాలం నిలబడలేకపోయింది. 1960వ దశకం మధ్య భాగంలో కేంద్ర ప్రభుత్వం స్థానిక స్వపరిపాలనా సంస్థలను పక్కకుపెట్టి డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం (ఐఆరిడిపి) ప్రవేశపెట్టడంతో దేశంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం ఏర్పడింది. వెనువెంటనే జాతీయ స్థాయిలో నేరుగా నిర్వహించే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎస్ఎఫ్ఎఎ), డ్రాట్ ప్రోగెరియాస్ ప్రోగ్రాం (డిపిఎపి), ఇంటెన్సివ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఐఆర్టిపి) వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టబడ్డాయి. క్రమంగా అధికారిక ఎజెండా నుండి స్థానిక అభివృద్ధి అనే భావనే కనుమరుగయింది. బదులుగా, ఉపాధికల్పన, పేదరికం నిర్మూలనల కొరకు అధికార యంత్రాంగంచే ఒకే మూసలో వుండే కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు, అఖిలభారత, లేదా రాష్ట్ర స్థాయిలో చేపట్టిన పథకాలు పంచవర్ష ప్రణాళికల ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు అందవలసిన వనరులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాల్లో వాటి పాత్ర మృగ్యమయింది. (జార్జి మాథ్యూ 1986 1986) అశోకెమెహతా అధ్యక్షుడిగా ఏర్పాటయిన ఎంక్వయిరీ కమిటీ (1978) తన నివేదికలో స్వతంత్ర భారత దేశంలో మొదటి తరం పంచాయతీ వ్యవస్థ ఛిన్నాభిన్నమవడాన్ని విపులంగా చర్చించింది.
రాష్ట్ర స్థాయిలోని రాజకీయ నాయకులు కూడా తమ అధికారాన్ని స్థానిక సంస్థలకు బదలాయించడానికి యిష్టపడడం లేదు. స్థానిక బాధ్యుల బెదిరింపులకు భయపడి వారసలు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా వుండడానికే నిర్ణయించారు. ఈ విధంగా పదకొండు రాష్ట్రాలలోని పంచాయతీ రాజ్ సంస్థలతో వొకటి లేదా రెండుంచెల స్థాయిలో ఎన్నికల కాలం ముగిసినట్లు తెలుస్తున్నది. దేశంలో ఎక్కడా కూడా కాల వ్యవధి ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబడలేదు. రాష్ట్ర నాయకత్వం వికేంద్రీకరణకు విముఖత చూపడానికి ఒక ముఖ్యమైన కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అధికారాలు కట్టబెట్టడానికి నిరాకరించడమే. ఏమైనా అశోక్ మెహతా కమిటీ కేంద్ర - రాష్ట్ర సంబంధాలను గురించి పరిశీలించడం తమ పరిధికి మించిన విషయంగా పరిగణించింది. (నంబూద్రిపాద్ 1978).
అయితే మనం ముందుగానే గమనించినట్లుగా యీ సంస్కరణలను కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల పునర్నిర్మాణంలో అనుసంధానించలేదు. కేంద్రంలో కొంత మంది వ్యక్తులు రాష్ట్రాలు బలహీనపడడం వల్ల ఇరు వర్గాల బలపరీక్షలో తమకు మేలు జరుగుతుందని వుత్సాహపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలను నిర్లక్ష్యం చేసి కేంద్రమే నేరుగా స్థానిక సంస్థలతో సంబంధాలు నెలకొల్పుకోవడానికి వుద్దేశించిన 1990 రాజ్యాంగపు 64, 65 వ సవరణలకు వివిధ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చాలాకాలంపాటు కొనసాగిన రాజీ సంప్రదింపుల తరువాత 1993లో గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలను వాటి అంతర్గత సంస్థలుగానే గుర్తిస్తూ రాజ్యాంగానికి 73, 74వ సవరణలు ఆమోదించబడ్డాయి.
స్థానిక సంస్థలు కేవలం అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితమనే భావన కొత్త చట్టాలలో కూడా కొనసాగింది. ఇంకా దారుణమేమంటే ణల వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండు భాగాలుగా విడిపోయాయి. జిల్లా స్థాయి స్థానిక పరిపాలనా సంస్థలు పట్టణాలను ఇముడ్చుకోవు. దీనితో ఈ రాజ్యాంగ సవరణల వల్ల జిల్లా స్థాయిలో సమగ్రమైన ఎన్నికైన ప్రభుత్వమనే భావనకు అవకాశం లేకుండా పోయింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రణాళిక సమన్వయం చేసే వుద్దేశంతో ఏర్పాటు చేయబడిన జిల్లా ప్రణాళికా కమిటీలు తరచుగా గ్రామీణ-పట్టణ ప్రాంతాలను సమన్వయం చేస్తాయనే అపోహను కలిగించాయి. అయితే ఇది ప్రణాళికా సంస్థ మాత్రమే. పరిపాలనా సంస్థ కాదు.
73, 74వ సవరణలు కేవలం రాష్ట్ర శాసనసభల ద్వారా స్థానిక సంస్థల పరిమితుల్ని సంక్రమింపచేయడం వరకే పరిమితమయ్యాయి. ఈ క్రొత్త సంస్థలకు అప్పగించవలసిన అధికారాలు, విధులు చాలా రాష్ట్రాలు వాటిని విస్తృత పరచకపోవడం వల్ల రాష్ట్రాలన్నింటిలో ఒకే విధంగా లేవు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్లు ఏర్పాటు చేయబడి, వీటి నివేదికలను అందజేశాయి. కమిషన్ సిఫారసుల్లో అమలు పరిచినా గానీ స్థానిక సంస్థల పనితీరు మెరుగు పడలేదని యీ నివేదిక విశ్లేషణ వల్ల తేలింది. వనరుల్ని పెంచుకోవడం కంటే ఎక్కువగా, రాష్ట్ర ఫైనాన్సు కమిషన్లు చేసిన మంచి పని నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యాన్ని కుదించడం (లేఖా 1997 : షహీనా 1997) జిల్లా ప్రణాళికా కమిటీలు యింకా సమర్ధవంతంగా పనిచేయడం వున్నది. స్థానిక స్వపరిపాలనా సంస్థల పనితీరులో గతం కంటే కొంత మార్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఆర్టికల్ చాలా బాగుంది
రిప్లయితొలగించండి