కార్మిక వర్గం



    
        కార్మికవర్గం అభివృద్ధి చెందటంలో వివిధ దశలున్నాయి. బూర్జువా వర్గంతో దాని పోరాటం పుట్టుకతోనే ప్రారంభమౌతుంది. మొదట కార్మికులు విడివిడిగా ఎవరిపాటికివారు పోరాడుతారు. తరువాత ఒక ఫ్యాక్టరీలోని వాళ్లందరూ కలిసి పోరాడుతారు. ఆ తరువాత ఒకే స్థలంలో ఒకే రకమైన ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళందరూ కలసి పోరాడుతారు. ఈ పోరాటాలన్నీ తమను ప్రత్యక్షంగా దోపిడీ చేసే బూర్జువా యజమానులు అనే వ్యక్తులమీద జరుగుతాయి. బూర్జువా ఉత్పత్తి నియమాలమీద గాక, ఉత్పత్తి సాధనాలమీదనే కార్మికులు దాడి చేస్తారు. తమ శ్రమతో పోటీచేసే విదేశీ సరుకులను ధ్వంసం చేస్తారు. యంత్రాలను ముక్కలు ముక్కలు చేస్తారు. ఫ్యాక్టరీలను దగ్ధం చేస్తారు.      

       అయితే కార్మికవర్గం 'విశ్వవ్యాపిత వర్గం'.  'ఈ వర్గం' మొత్తం దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా విప్లవం పట్ల ఆసక్తి కలిగి వుంటారు. దోపిడీ వ్యవస్థను వేరేవేరు భాగాలుగా రద్దుచేయటం సాధ్యంకాదు.
         బూర్జువా వర్గం నిరంతర యుద్ధంలో చిక్కుకొని వుంటుంది. మొదట ప్యూడల్ ప్రభువర్గంతో యుద్ధం తరువాత బూర్జువావర్గంలోనే పరిశ్రమల అభివృద్ధి వలన నష్టపడేవాళ్ళతో  యుద్ధం, మొదటినుండి చివరదాకా విదేశీ బూర్జువావర్గాలతో యుద్ధం. ఈ యుద్ధాలన్నిటి లోనూ కార్మికవర్గ సహాయం అర్ధించకతప్పని పరిస్థితి బూర్జువా వర్గానికి ఏర్పడుతుంది.దాంతా కార్మిక వర్గానికి రాజకీయ విద్య ను నేర్పుతుంది. ఫ్యాక్టరీలు తమ సమస్యలకు కారణం కాదని అర్థం చేసుకొని బూర్జువా వర్గం అందించిన అస్త్రాలను బూర్జువా వర్గం పైకి వదులుతారు.
        అప్పుడప్పుడు  వాణిజ్య సంక్షోభాలు  వస్తుంటాయి.అవి  మరింత ప్రమాదకరంగా మారి, మొత్తం బూర్జువా సమాజానికే చావు బతుకుల సమస్యను తెచ్చిపెడతాయి. దాంతో కార్మికుల వేతనాలు  మరింత దిగజారిపోతాయి.
       యంత్రాలు పెరిగడం వల్ల, ఆర్థిక సంక్షోభాలవల్ల, పెట్టుబడుల విస్తరణ జరిగేకొద్దీ మధ్యతరగతి కిందివర్గం వాళ్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు, దుకాణదారులూ, రిటైరైన వర్తకులూ, చేతిపనివాళ్లూ, రైతులు- వీళ్లందరూ క్రమ క్రమంగా కార్మికవర్గంలోకి దిగజారిపోతారు.  ఈ విధంగా అన్ని తరగతుల ప్రజలనుండి కొత్తవారు వచ్చి కార్మికవర్గంలో కలుస్తుంటారు.       
        మధ్యతరగతిలో కిందివర్గంవాళ్లు చిన్న చిన్న పరిశ్రమల యజమానులు, దుకాణ దారులూ, చేతిపనివాళ్లు, రైతులు - వీళ్లందరూ బూర్జువా తో పోరాడుతారు. కానీ వీళ్ల పోరాటమంతా మధ్యతరగతిలో  తమ ఉనికిని కాపాడుకోవటం కోసమే. కనుకవీరు యథాస్థితివాదులు. కానీవీళ్లు తమ  భవిష్యత్ ప్రయోజనాలకొరకు పోరాడుతారు తమ సొంత దృక్పథం వదిలిపెట్టి కార్మికవర్గ దృక్పథం స్వీకరిస్తారు.

         కార్మిక వర్గం బూర్జువా వర్గంతో చేసే పోరాటం మొదటిదశలో స్వభావంలో కాకపోయినా స్వరూపంలో, జాతీయ పోరాటంగా వుంటుంది. ఏదేమైన మొదట తన దేశపు బూర్జువావర్గంతోనే వ్యవహారాలు తేల్చుకుంటుంది.
         వర్గ పోరాటం ఆటో యిటో తేలిపోయే గడియ సమీపిస్తుంది.ఆ రోజు పాలకవర్గంలోని విభేదాల కారణంగా కొద్దిమంది తమ వర్గం సంబంధాలు తెంచుకొని వచ్చి విప్లవ వర్గంతో కలుస్తారు.
       బూర్జువా వర్గానికి ముఖాముఖిగా నిలబడిన వర్గాలన్నింటిలోకి కార్మికవర్గం ఒక్కటే నిజమైన విప్లవ వర్గం. కార్మికవర్గ చేపట్టిన విప్లవంలో మొదటి మెట్టు కార్మికవర్గం పాలకవర్గం కావడమే. ప్రజాస్వామ్యాన్ని గెలుచుకోవడమే.
        అసలు రాజకీయ అధికారమనేది ఒక వర్గాన్ని పీడించడానికి మరొక వర్గం ఉపయోగించే సంఘటిత శక్తి మాత్రమే.భూస్వామ్య, బూర్జువావర్గాలు శ్రమ జీవులను తొక్కిపట్టి వుంచేదీ, కేవలం తమ సంపదద్వారా, శ్రమని దోచుకొనేదీ - కేవలం పెట్టుబడిద్వారా మాత్రమేకాదు, సైన్యం, అధికాక వర్గం, కోర్టులు మొదలైన వాటితోకూడిన రాజ్యాంగ యంత్రం ద్వారా కూడా సంపన్నవర్గాలు శ్రమ జీవులను దోచుకొంటాయి. మన ప్రత్యర్థులపై రాజకీయ రంగంలో పోరాట విరమణ చెయ్యడమంటే దాని అర్థం అత్యంత శక్తివంతమైన పోరాట సాధనాన్ని ప్రత్యేకించి నిర్మాణప్రచార రంగాలు వదులుకోవడమే." అని పేర్కొన్నారు ఏంగెల్స్.

       కార్మికవర్గం, బూర్జువా వర్గంతో తాను పోరాటం చేసే కాలంలో విప్లవం ద్వారా తానే పాలక వర్గ స్థానాన్ని అధిష్టిస్తే,  పాత ఉత్పత్తి విధానాన్ని బలవంతంగా మార్చివేస్తుంది. అప్పుడు ఆ విధానంతో పాటు మొత్తం వర్గాలూ, వర్గ విభేదాలూ బతకడానికి అవసరమైన పరిస్థితులను కూడా ఊడ్చి పారవేస్తుంది . దాంతో పాత ఉత్పత్తి విధానాన్ని విప్లవాత్మకంగా మార్చివేస్తుంది.

           ఈ వర్గం చేపట్టే చర్యలు వివిధ దేశాల లో వివిధ రకాలుగా ఉన్నా సాధారణంగా ఇలాంటి చర్యలు తీసుకుంటారు.

1. భూములమీద ఆస్తి హక్కు రద్దుచేసి, భూములమీద వచ్చే కౌలు డబ్బు అంతా సామాజికకార్యాలకు  వినియోగించడం.
2.క్రమప్రవర్ధమానంగా వుండే భారమైన ఆదాయపు పన్ను,
3.వారసత్వపు హక్కు సంపూర్ణంగా రద్దు
4. కార్పొరేట్ వర్గాల ఆస్తి ని, తిరుగుబాటుదార్ల ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం.
5. ప్రభుత్వ పెట్టుబడితో జాతీయ బ్యాంకు ను ఏర్పాటు చేసి, పరపతి అంతా గుత్తాధికారంతో ప్రభుత్వం చేతిలో కేంద్రీకరించడం.
6. వార్తా రవాణా సాధనాలు ప్రభుత్వం చేతిలో కేంద్రీకరించడం. 7.ప్రభుత్వ ఫ్యాక్టరీలూ, ఉత్పత్తి సాధనాలూ విస్తరింపజేయడం. బంజరుభూములు సాగుచేయడం, ఒక సమష్టి పథకం ప్రకారం భూములు సారవంతం చేయడం.
8.పనిచేసే బాధ్యత అందరికీ సమానంగా వుండడం, కార్మిక సైన్యాలు: ఏర్పరచడం ముఖ్యంగా వ్యవసాయం కొరకు . 
9.వ్యవసాయాన్ని పరిశ్రమలనూ సమ్మేళనం చేయడం, జనసాంద్రత విషయంలో వివిధ ప్రాంతాల అసమానతలు తగ్గించడం ద్వారా పట్టణాలకు పల్లెలకు గల భేదాన్ని క్రమక్రమంగా రద్దుచేయడం.
10.ప్రభుత్వపాఠశాలల్లో పిల్లలందరికీ ఉచిత విద్య, ఇప్పుడు చేస్తున్నట్లు పిల్లలు ఫ్యాక్టరీలో పనిచేయడం రద్దు. విద్యను పారిశ్రామిక ఉత్పత్తితో మేళవించడం మొదలైనవి.
         
(కమ్యూనిస్టు ప్రణాళిక ఆధారంగా)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?