చైనాలో సెజ్ లు -- వాస్తవాలు
The Pudong New District, Shanghai, China.
Pc: britannica.com
మొత్తం మూడు అంశాల దీర్ఘకాలిక వ్యూహాన్ని పార్టీ చేపట్టింది. మొట్టమొదటిదేమిటంటే, చైనాలో రాజకీయపరమైన ఇబ్బందులు, అస్థిరత్వం కారణంగా ప్రధానమైన నగరాలలో విదేశీయులు పెట్టుబడులు పెట్టబోరన్న దానికి సంబంధించినది. రెండవది భయం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రధానమైన ఆర్థిక కేంద్రాలలోకి అకస్మాత్తుగా విదేశీ పెట్టుబడులకు ప్రవేశాన్ని కల్పిస్తే ఆర్థిక, రాజకీయ ఇబ్బందులు తలెత్తుతాయని భావించటం. చిట్టచివరిదేమిటంటే, చైనా చారిత్రాత్మక కర్తవ్యానికి సంబంధించినది. హాంకాంగ్ తైవాన్, మకావోల సార్వభౌమత్వాన్ని పునరుద్ఘాటిస్తూ వాటిని ప్రధాన భూభాగంలో విలీనం చేయాలని చైనా కోరటం, డెంగ్ సియావో పింగ్ తన ప్రయోగాన్ని ప్రారంభించినపుడు, స్పష్టమైన ప్రణాళికేదీ లేదని ఆయన అన్నారు. వీటి విషయంలో ఆయన సందిగ్ధంగానూ. అనుమానంగానూ ఉన్నారు. కనుకనే ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నారు. "నదిని దాటేటప్పుడు కాళ్ళ క్రింద రాళ్ళు ఉండవచ్చునన్న భావనతో" ఎలాగైతే జాగ్రతగా ఉంటామో అలానే ఆయన కూడా ఉన్నాడు. సెజ్లను ఏర్పాటు చేసే ప్రాంతాన్ని ఎంతో ఆలోచించి ఎంపిక చేశారు. వాటిని దక్షిణ కోస్తాలో ఏర్పాటు చేసి, చైనా భూభాగాలతోనూ, సామాజిక నెట్వర్క్ నూ అనుసంధానం చేశారు. ఇక్కడ పరిశ్రమలు లేదా మౌలిక సదుపాయాలంటూ ఏమీ లేవు జన సాంద్రతకూడా తక్కువ. ఇవి విఫలమైతే తొలగించటానికి లేదా సఫలమైతే దేశమంతటా ఏర్పాటు చేయటానికి వీలుగా సెజ్ల కోసం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు.
చైనా మొదటి దఫాగా 1980లో నాలుగు సెజ్ లను ఆగ్నేయ చైనా ప్రాంతంలో అనుమతించింది. ఆ తర్వాత తీరప్రాంత నగరాల్లో రెండో దఫాగా మరో 10 సెజ్ లను అనుమతించింది. ఈ అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకొని 1984 నుండి సముద్ర తీరం వెంబడి ఎకనామిక్ అండ్ టెక్నలాజికల్ జోన్లు (ఇటిడిజడ్) ఏర్పాటు చేయడానికి చైనా పూనుకుంది. 1984-1988 మధ్య కాలంలో మొదటి దఫాగా 14 ఇటిడిజట్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. అప్పటి నుండి చైనాలో సెజ్లు మూడు రకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అవి
1. సెజ్ ను ఇటిడిజట్లుగా విస్తరించడం,
2 వాటిని తూర్పుతీర ప్రాంతం నుండి మధ్య, పశ్చిమ ప్రాంతాలకు పొడిగించడం,
3. ప్రాధమిక పరిశ్రమల నుండి ఉన్నత సాంకేతిక పరిశ్రమలకు సెజ్ స్థాయిని పెంచడం.
ప్రస్తుతం చైనాలో 54 ఇటిడిజడ్లు ఉన్నాయి. తర్వాత కాలంలో మున్సిపల్, రాష్ట్ర స్థాయిలో కూడ ఇటిడిజన్లు ఏర్పాటయ్యాయి. వాటికి ఒక స్పష్టమైన అవగాహన, పథకం ఉన్నాయి. మొదట వారు ఆయా సంస్థల ప్రాధాన్యతలను బట్టికాకుండా దేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇటిదిజట్లను ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తర్వాత లక్ష్యం అక్కడ 'టెక్నాలజీ' స్థాయిని పెంచడం. ఉదాహరణకు గ్వాంగ్లింగ్ రాష్ట్రంలో సెజ్ నిబంధనల్లో ఆర్టికల్ 4 ఇలా పేర్కొంది.
"అంతర్జాతీయ ఆర్థిక సహకారాన్ని పెంపొందించే, సాంకేతిక బదలాయింపుకు ఉపయోగపడే ప్రాజెక్టులను ఇన్వెస్టర్లు తమ సొంత పెటుబడితో కాని, మాతో కలిసి సంయుక్త రంగంలో కాని ఏర్పాటు చేయవచ్చు. అవి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి వ్యవసాయం, పశుపోషణ, టూరిజం, గృహనిర్మాణం, నిర్మాణ రంగం, పరిశోధన, మాన్యుఫాక్చరింగ్ రంగాలలో ఉండవచ్చు." (వక్కాణింపు చేర్చబడింది. )
ఇటిడిజట్ల ఏర్పాటు సమయంలో ఈ ఆర్టికల్ మరింత అభివృద్ధి చేయబడింది. పరిధి విస్తరించబడింది. ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టే, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చి, ఎగుమతి కోసం ఉన్నత స్థాయి ఉత్పత్తులను తయారుచేసే, చైనాకు కొత్త పరికరాలను అందించే నూతన సాంకేతిక పద్ధతులను, పరిజ్ఞానాన్ని సమకూర్చే పరిశ్రమలపై కేంద్రీకరణ అధికమయింది. ఉదాహరణకు గ్వాంగూ ఇటిడిజద్ తాత్కాలిక నిబంధనలు (1985)లో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన భాగంలో పరిజ్ఞానం ఎలాంటిది, ఏ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. వాటిని ఎలా ప్రాధాన్యతా పూర్వకంగా ప్రవేశపెట్టే సాంకేతిక తీసుకోవాలి అన్ని అంశాల గురించి పూర్తిగా ఒక అధ్యాయమే ఉంది.
అంతేకాకుండా చైనాలో సెజ్ స్థాపకులకు భూమిపై యాజమాన్య హక్కులు కల్పించబడటం లేదు. గ్యాంగ్లింగ్ రాష్ట్రం సెజ్ నిబంధనల (1980) లో ఆర్టికల్ 12 ఇలా పేర్కొంటున్నది:
"ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్)లలో భూమి చైనా జనతంత్ర రిపబ్లిక్ యాజమాన్యంలోనే ఉంటుంది. ఇన్వెస్టర్లకు వారి వాస్తవ అవసరాలకు అనుగుణంగా కేటాయించబడుతుంది. ఏ పరిశ్రమ కోసం, ఎలా వినియోగించడం కోసం భూమి కేటాయించబడుతున్నది అన్నదాన్ని బట్టి ఆ భూమికి చెల్లించే రుసుము చెల్లించే పద్ధతి నిర్ణయించబడుతుంది. దీనికి సంబంధించిన నిర్దిష్టమైన అంశాలు విడిగా ఇవ్వబడ్డాయి. '
అంతేకాకుండా ఆర్టికల్ 5 ప్రభుత్వం కూడా వాటిని అభివృద్ధి చేయవచ్చునని స్పష్టం చేసింది:
"సెజ్ భూమిని అభివృద్ధిచేయడానికి, నీటి సరఫరా, డ్రైనేజి, విద్యుత్ సరఫరా, రోడ్లు, కమ్యూనికేషన్లు, వేర్ హౌసులు మొదలైన వాటిని ఏర్పాటుచేయడానికి సెజీల నిర్వహణకు ఉద్దేశించబడిన గ్వాంగ్ డంగ్ ప్రభుత్వ కమిటీ బాధ్యత వహిస్తుంది.
1984లో చైనా తన సంస్కరణ విధానాలను పునర్వ్యవస్థీకరించింది. 14 కోస్తా. పట్టణాలను ఎంపికచేసి సెక్లకు ప్రాధాన్యతనిచ్చింది. ఈ ప్రాంతాలను "స్వేచ్ఛా ప్రాంతాలు అని పిలిచింది. దీనితో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి. ఎనిమిదవ దశకం చివరిలోనూ, తొమ్మిదవ దశకం ప్రారంభంలోనూ మూడు కోస్తాలలో 'స్వేచ్ఛా ప్రాంతాలు' ఏర్పడ్డాయి.. 1992లో దక్షిణాదిలో డెంగ్ పర్యటన ఎంతో ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్నది. ఈ పర్యటన కారణంగా మరిన్ని నూతన సెజ్లు ఏర్పాటయ్యాయి.
చైనాలో అత్యధిక భాగంలో తలుపులు తెరవటంతో, సాపేక్షకంగా చూస్తే సెకు ప్రత్యేకత లేకుండా పోయింది. సెజ్లను ప్రయోగాత్మకంగా చూస్తూ, క్రమక్రమంగా వాటిని విస్తరించాలన్న డెంగ్ అభిప్రాయం సరైనదేనని తేలింది. అయితే చైనీయులు సెజ్లకు దూరంగా వైదొలగుతున్నట్లు తదనంతర పరిణామాలు తెలిపాయి. ఆదాయాలలో పెరుగుతున్న వ్యత్యాసాలు వారికి ఆందోళన కలిగించింది. దేశీయ, విదేశీ సంస్థల మధ్య సమత్వాన్ని కల్పించి. ప్రభుత్వాదాయాన్ని పెంచే నూతన చట్టాల కోసం వారు అన్వేషించారు. సెజ్లతో పాటుగా చిన్నచిన్న ఆర్ధిక, సాంకేతిక అభివృద్ధి మండలాలను (ఇటిజర్) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజల నుంచి వచ్చిన డిమాండు మేరకు హైటెక్ మండలాలను, శాస్త్ర-సాంకేతిక పార్యులను, పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశారు. ఇవి కొన్ని అవలక్షణాలకు దారితీసినప్పటికీ ఉత్పత్తి. ఎగుమతులు పెరగటానికి దోహదపడ్డాయి. సెజ్లు వెనుకబడినప్పుడు ఇతర మండలాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
చైనాలో ఎగుమతుల ప్రాతిపదికపై సెజ్లు ఏర్పడ్డాయి. తొలి దశలో కొన్ని ఆటంకాలు ఎదురయినప్పటికీ ఆ తరువాత సత్ఫలితాలనిచ్చాయి. విదేశాలలో నివసిస్తూ ఆర్థిక, వాణిజ్య లావాదేవీలను కలిగిన చైనీయులు స్వదేశానికి రావడం కూడా ఇవి జయప్రదం కావడానికి ఒక కారణం. తక్కువ వేతనాలకుకార్మికులు లభించే ప్రాంతాల కోసం బహుళజాతి సంస్థల అన్వేషణ కూడా సహాయకారిగా మారింది. చిట్టచివరి అంశమేమిటంటే, నూతన చైనా విధానంవల్ల అమెరికన్ మార్కెట్ ప్రవేశానికి వీలు కలిగింది. హాంగాంగ్, మకావోలతో చైనా విలీనం పూర్తయింది. నిజానికి సెజ్ ఏర్పాటు ఈ ప్రక్రియను వేగిరం చేసింది.
ఇదిలా ఉండగా అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో మందకొడితనం ఏర్పడింది. దీనితో అది పెరుగుదలకు చోదక శక్తిగా ఉండే సామర్థ్యాన్ని కోల్పోయింది. కాగా చైనా తన వ్యూహాన్ని పునర్వ్యవస్థీకరించుకుని తన అభివృద్ధిని నిలుపుకునేందుకుగాను దేశీయ డిమాండును పెంచే ప్రయత్నాలను ప్రారంభించింది.
టియావిజయ్ బిన్హాయ్నును పరిశీలిస్తే ఈ ప్రాంతంలో టియాంజిన్ పోర్టు, టియాసిన్ ఎకనామిక్ అండ్ టెక్నలాజికల్ డెవలప్మెంట్ ఏరియా (టెడా), టియాంజిన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా (టిఎల్బీఎ) ఉన్నాయి. దాని జిడిపి 1993లో 11.2 బిలియన్ డాలర్ల యువాన్ల నుండి 2005 నాటికి 160.8 బిలియన్ డాలర్ల యువాన్లకు పెరిగింది. అంటే ఏడాదికి దాదాపు 26.5 శాతం చొప్పున పెరిగింది. ఆ ప్రాంతంలో తలసరి జిడిపి 14,200 డాలర్లుగా ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15.9 బిలియన్ డాలర్లు వచ్చాయి. విదేశీ వాణిజ్య పరిమాణం 500 మిలియన్ డాలర్ల నుండి 18.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ పెరుగుదల 36. రెట్లు, ప్రపంచ ప్రఖ్యాత ఫార్చూన్ 500 కంపెనీల్లో 152 ఈ ప్రాంతంలో యూనిట్లు స్థాపించి ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకు వెళ్లి 2010 నాటికి ప్రస్తుత జిడిపిని రెట్టింపు చెయ్యాలన్నది లక్ష్యం. అంటే ఏడాదికి 17 శాతం చొప్పున జిడిపిని అది పెంచబోతున్నది.
చైనాలోనీ అతి పెద్ద పోర్టులలో టియాన్టిన్ పోర్టు నాల్గవది .ప్రపంచంలో ఏడవది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే దేశం ఇతర ప్రాంతాల్లో అమలు జరిగే కార్మిక చట్టాలు, ఇతర చట్టాలు వర్టించని స్పెషల్ ఎకనామిక్ జోన్లు (సెజ్లు) అక్కడ లేనే లేవు. ఇరవై ఏళ్ల క్రితం దక్షిణ తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన షెంజన్ సెజ్లో తొలుత అలాంటి కొన్ని ఆంక్షలు ఉండేవి. కాని వాటిని కొన్ని సంవత్సరాల తర్వాత ఎత్తి వేశారు. 1990ల నుండి అలాంటి ఆంక్షలు ఏమీ అమలు కావడం లేదు. అనుభవం నుండి తాము నేర్చుకుంటున్నామని, దాని ప్రకారమే అలాంటి ఆంక్షల నిషేధాల అవసరం ఇంక లేదన్న నిర్ధారణకు వచ్చామని చైనా కమ్యూనిస్టు పార్టీ మాకు చెప్పింది. ప్రస్తుతం చైనాలో మొత్తం 54 స్పెషల్ డెవలప్మెంట్ ఏరియాలు (ఏడాలు) ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి రాజ్యంలో మరో రాజ్యంగా పనిచేయడం లేదు. దేశంలో అమలయ్యే ప్రతి చట్టం ప్రతి జోన్ లో అమలవుతుంది.
చైనాలోకి ఎల్డీఐ అంతా దాదాపు సంయుక్త రంగంలోనే వస్తున్నది. ఏడాదికి 220,000 కార్లు తయారుచేసే టయోటా కర్మాగారం లో 12,000 మంది పనిచేస్తున్నారు. కొద్దిమంది టెక్నికల్, మేనేజీరియల్ సిబ్బంది మినహా అందరూ చైనీయులే. బయోటా సగం భాగస్వామిగా, మిగతా సగానికి రెండు చైనా కంపెనీలు భాగస్వాములుగా ఈ కర్మాగారం ఏర్పాటయింది. కార్మికులంతా ట్రేడ్ యూనియన్లో సభ్యులే. ప్రతి సంస్థలోను ట్రేడ్ యూనియన్, పార్టీ శాఖలు ఉన్నాయి. 50:50 భాగస్వామిగా స్థాపించబడిన ఉన్నత సాంకేతిక స్థాయి కెమికల్ కర్మాగారంలో కూడ ఇదే మాదిరి పరిస్థితి ఉంది.
భూమి సమస్య
ఇంత బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిన ఈ ప్రాంతం ఒకప్పుడు పనికిరాని చిత్తడి.
భూమిగా ఉండేది. చైనాలో భూమి మొత్తం ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటుంది. రైతులకు సైతం భూమి నిర్దిష్ట కాలపరిమితితో కంట్రాక్టుకు అందచేయబడుతుంది. అందుచేత రైతులు నుండి భూమిని స్వాధీనం చేసుకోవడం అన్న ప్రశ్నే అక్కడ తలెత్తదు. అంతేకాకుండా చైనాలో వ్యవసాయ భూమి. భారత దేశంలో కన్నా తక్కువ. అందుచేత వ్యవసాయ భూమిని బదలాయించకూడదన్న కచ్చితమైన వైఖరితో చైనా ప్రభుత్వం ఉంది. లేకపోతే ఆహార ఉత్పత్తి తగ్గిపోగలదని భావిస్తున్నది.
కాని అరుదైన సందర్భాలలో వ్యవసాయ భూమిని పారిశ్రామిక అభివృద్ధికి కేటాయించాల్సి వస్తే అక్కడ వ్యవసాయం చేసే రైతులకు ప్రత్యామ్నాయం చూపడానికి ఎంతో స్పష్టమైన పథకాలు అక్కడ ఉన్నాయి. మొదట ఆ రైతులకు పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది. వారి భూమిని స్వాధీనం చేసుకోవడానికి ముందే ఇది జరుగుతుంది. భూమిపై వ్యవసాయం చేయడం ద్వారా ఉపాధి పొందే రైతుకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించబడుతుంది. అలాంటి వారికి అవసరమైన శిక్షణ, సంబంధిత నైపుణ్యాలను ప్రభుత్వమే ఉచితంగా నేర్పిస్తుంది. గతంలో వ్యవసాయం చేసిన రైతులు ఇప్పుడే తమ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని భావిస్తున్నారు.
అంతేకాకుండా చైనాలో వ్యవసాయ భూమి. భారత దేశంలో కన్నా తక్కువ. అందుచేత వ్యవసాయ భూమిని బదలాయించకూడదన్న కచ్చితమైన వైఖరితో చైనా ప్రభుత్వం ఉంది. లేకపోతే ఆహార ఉత్పత్తి తగ్గిపోగలదని భావిస్తున్నది.
కాని అరుదైన సందర్భాలలో వ్యవసాయ భూమిని పారిశ్రామిక అభివృద్ధికి కేటాయించాల్సి వస్తే అక్కడ వ్యవసాయం చేసే రైతులకు ప్రత్యామ్నాయం చూపడానికి ఎంతో స్పష్టమైన పథకాలు అక్కడ ఉన్నాయి. మొదట ఆ రైతులకు పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది. వారి భూమిని స్వాధీనం చేసుకోవడానికి ముందే ఇది జరుగుతుంది. భూమిపై వ్యవసాయం చేయడం ద్వారా ఉపాధి పొందే రైతుకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించబడుతుంది. అలాంటి వారికి అవసరమైన శిక్షణ, సంబంధిత నైపుణ్యాలను ప్రభుత్వమే ఉచితంగా నేర్పిస్తుంది. గతంలో వ్యవసాయం చేసిన రైతులు ఇప్పుడే తమ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని భావిస్తున్నారు.
చైనాను భారతదేశంతో తప్పుడుగా పోల్చే మరో అంశం ఎఫ్ఐకి అక్కడ ఇస్తున్న రాయితీలు, పన్ను మినహాయింపులు. చైనాలో సంస్కరణలు ప్రారంభమయిన తొలి దశలో ప్రతి సంస్థకు రెండేళ్లు పూర్తి పన్ను మినహాయింపును కల్పించారు. ఆ తర్వాత మరో మూడేళ్లు 50 శాతం పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు మొదటి సంవత్సరం మాత్రమే పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. రెండో సంవత్సరం 50 శాతం మినహాయింపు ఉంటుంది. అక్కడి నుండి పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎగుమతి, దిగుమతి సుంకాలు అసలు లేని ఫ్రీ ట్రేడ్ ఏరియాల్లో సైతం 12 శాతం వ్యాట్ను వసూలు చేస్తున్నారు. టియాన్టిన్ రెవిన్యూ ఆదాయం 1993లో 2.36 బిలియన్ యువాన్ల నుండి 2005లో 317 బిలియన్ యువాన్లకు పెరిగింది. అందుచేత ఎఫ్ఐల మీద ఎలాంటి పన్నులు లేకపోవడం వల్లనే అది అంతటి ఆర్థిక ప్రగతి సాధించగలిగిందన్న ప్రచారం అవాస్తవమని స్పష్టమవుతుంది.
అందుచేత అది భూసేకరణ కానివ్వండి. పన్ను రాయితీలు కానివ్వండి, కార్మిక, ఇతర చట్టాలు వర్తింపు విషయంలో కానివ్వండి- ఇక్కడ మన నయా ఉదారవాద పండితులు మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నదానికి, చైనాలో వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన లేదు. వీరు చెబుతున్న దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి అక్కడ ఉంది.
- సీతారాం ఏచూరి & k. Subramanian
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి