విశాల ప్రజా వేదిక ను ఏర్పాటు చేయాలి

                         
          
*విశాల ప్రజా వేదిక ను ఏర్పాటు చేయాలి*

మన దేశంలో ప్రజాస్వామిక సోషలిస్టు భావజాల విజయాన్ని కోరుకునే శక్తులు కూడా సాంస్కృతిక రంగంలో పెద్ద విస్ఫోటనాన్ని సాధించాల్సిన అవసరం వుంది. సంఘపరివార్ దాని మిత్ర బృందాలు, సరళీకరణ భావజాల అనుయాయులు సంక్షోభంలో కూరుకు పోయిన పెట్టుబడిదారీ వ్యవస్థను సంరక్షించడానికి సాంస్కృతిక భావజాల రంగాలను బలంగా వినియోగించుకుంటున్నాయి. ఈ శక్తుల ప్రయత్నాలను ఎదిరించడానికి సాంస్కతిక సాహిత్య సంఘాలు కృషి చేయాలి.
        "సుడిగాలి వీచింది. జడివాన కురిసింది. నట్టనడి సంద్రాన నావ నిలిచుండాది. చుక్కాని పట్టరా తెలుగోడా. నావ దరిజేర్చరా మొనగాడా" అని రాశాడు వేములపల్లి శ్రీకృష్ణ . నువ్వు నావ దరిచేర్చాలి. చుక్కాని పట్టాలి. లేకపోతే వామపక్ష ఉద్యమం క్షమించదు ఈ దేశ ప్రజలు క్షమించరు. సమాజం. క్షమించదు. ఉద్ధరించాల్సింది వాళ్లే. కమ్యూనిస్టు పార్టీకి ఒక సాంస్కృతిక విధానముందా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును అడిగాను. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ని నిర్వహించగలదా? గ్రామీణవ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయింది. ప్రజలు వలసలు పోతున్నారు. పట్టణాల్లో ఉంటే ఏదో కొంత సంపాదించుకుని మళ్లీ ఆర్నెలు గ్రామాల్లో ఉంటున్నారు. నువ్వు యువజన సంఘాన్ని స్థాపించగలవా? ఒకసారి బి.వి.రాఘవులును అడిగాను. ఏంటి రాఘవులు సంగతి అంటే, మా దర్శిల్లో తేలిందేమిటంటే, ప్రతి గ్రామంలో రెండు మూడు లిక్కర్ పావులున్నాయి. 30, 40 టూవీలర్స్ ఉన్నాయి. అయినా యువతలో మార్పు పొదపుకున్నది. వాళ్లని ఉద్యమంలోకి తీసుకు రావాలి. కొత్త పద్ధతులేమిటి? నిర్మాణ పద్ధతులేమిటి? సాంస్కృతికంగా ఏ కార్యక్రమాలు చేపడతాం మనం ప్రజల్లోకి వెళతాం.. ఈ మైగ్రేటింగ్ పాపులేషన్నుఈ చట్టంలోకి ఎలా తీసుకొస్తాం. ఇది ఒక ప్రశ్న. ఇదొక సమస్య. కమ్యూనిస్టుపార్టీలన్నింటి ముందరున్న ప్రశ్న. పట్టణాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులను, వారు నివసించే 'అడ్డాల్లో'కి వెళ్ళి సమీకరించాలి. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా రాజకీయ స్పృహ కల్పించాలి. తిరిగి వారు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు గ్రహించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి.

          మారుతున్న పరిస్థితులకనుగుణంగా సాంస్కృతిక రూపాలను పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టకపోతే, ముఖ్యంగా కింది మధ్య తరగతి వర్గాల్లో మనం ఆశించిన మార్పు తీసుకురాలేం. దానికోసం కృషిచేయాలి. ఈ సభారంభంలో ప్రజానాట్యమండలి ప్రదర్శించిన రూపకం అద్భుతంగా ఉంది. నాకొక ధైర్యాన్ని కలిగించింది.

        పెరుగుతున్న జనాభాతోపాటు మన ముందుకొస్తున్న అనేకానేక కొత్త సమస్యలు అటు పట్టణాల్లో ఇటు గ్రామాల్లో నిలకడలేని జీవితాలు. వారిని మనం ఎలా ప్రభావితులను చేయాలి. దీని కోసం ఇంటర్నెట్ ను ఉపయోగించుకోవాలి. ప్రసార సాధనాలు మారుతున్నాయి. సోషల్ మీడియా బలవత్తర శక్తిగా తయారైంది. ఎవరో చెప్పారు ఇంటర్నెట్లో పెట్టిన ఒక గాయని పాడిన పాటలు విపరీతంగా వైరల్ అయ్యాడని కొత్త కళారూపాలను సాంస్కృతిక రూపాలను సృజించుకుని ప్రజల్లోకి వెళ్లగలమా? వెళ్లకపో భవిష్యత్తు ఏమిటి? మన సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించుకోవడంలో మారుతున్న పరిస్థితులకనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది.

సాహిత్య పాఠశాలలు, పార్టీ కార్యక్రమాలను చర్చించి, భావ ప్రసారం చేసే స్టడీ సర్కిల్స్ నిర్వహించడం అవసరం. ముఖ్యంగా విద్యార్థి, యువజన సంఘాలు ఇవాళ నయా ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల నిస్తేజంగా ఉన్నాయి. ఈ విధానాల వలలో చిక్కుకుని యువత తన కర్తవ్యాలను, భవిష్యత్తును విస్మరిస్తున్నది. వీటిని శక్తి మేరకు పునరుద్ధరిస్తే తిరిగి యువత ఉద్యమాల్లోకి వచ్చే అవకాశం ఉంది. పట్టణాలను దాటి గ్రామాలకు వెళ్లాలి. సన్నకారు రైతులు, ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు ఉద్యమంలోకి రావడానికి వీలుగా వారి సమస్యలను కళారూపాల ద్వారా వ్యక్తీకరించాలి. మతం చేస్తున్న మాయను, గారడీని ఎదుర్కోడానికి తగిన ప్రచార కృషి జరగాలి. సాహిత్యరంగం,పత్రికలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నా వాటిని మరింతగా ప్రజలకునేలా కృషిచేయాల్సిన విధంగా కార్యక్రమాలను చేపట్టాలి.

        ఆధునిక యుగానికి చెందిన సాహితీవేత్తలే కాకుండా అంతకుముందున్న వామపక్ష ప్రధాన స్రవంతికి చెందిన, హేతు, ప్రగతివాద భావాలతో సాహిత్య కృషి చేసినవారి జయంతులు, వర్ధంతులను నగరాలు, పట్టణాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి.

        ప్రత్యామ్నాయ సంస్కృతి - ప్రజా సంస్కృతి - కింది నుంచి మధ్యతరగతి వరకూ రూపొందించుకోవాలి. ఇప్పటికే ఈ దిశలో కృషిచేస్తున్న వారితో, వారు ఎవరైనా వారితో సంఘటితం కావాలి. సాంస్కృతిక సంచార బృందాలు ఏర్పడాలి. వాటి ద్వారా భాష వినిమయం జరగాలి. విశాల ప్రజావేదికను ఏర్పాటుచేసుకునే దిశలో కమ్యూనిస్టు పార్టీలు అడుగులు వేయాలి. 

(వామపక్ష సాంస్కృతిక వారసత్వం- వకుళాభరణం రామకృష్ణ, నుండి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?