చేగువేరా


                                   Che
 మనం భూగోళవటాన్ని చూద్దాం. ఇందులో మనకి మూడు రకాల దేశాలు కనబడతాయి. విప్లవం విజయం సాధించిన దేశాలు (రష్యా, చిన్నా తూర్పు యూరప్ దేశాలు క్యూబా), విప్లవం తాత్కాలిక పరాజయం పొందిన దేశాలు (మలేషియా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మీనా, సూడాన్, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, కొన్ని దక్షిణ అమెరికా దేశాలు) మూడోతెగ దేశాలలో విప్లవం ఇంకా సాగుతూనే ఉంది. ఉదాహరణకి విప్లవానికి బద్ద శత్రువైన  యునైటెడ్ స్టేట్స్లోనే విప్లద ఝుంఝు తీవ్రత తీవ్రంగా వీస్తోంది. మన దేశమే మరో ఉదాహరణ. అన్ని అరబ్ రాజ్యాలలో అశాంతి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఈనాడు విప్లవశక్తులు దెబ్బతీసే దశకు వచ్చాయి. విప్లవ నిరోధక శక్తులు దెబ్బ కాచుకునే స్థితిలో పడ్డాయి. అందుకే చేగువేరా ఇందుముందు ఇలా అన్నాడు. ఈ ప్రపంచమంతా ఒక చిన్న కుగ్రామం ఇక్కడ కలవాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. లేనివాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. విప్లవానికింకా పరిస్థితులెప్పుడో" పరిపక్వ మవుతాయని వేచుకు కూచోనక్కరలేదు. The duty of a revolutionary is to create revolution."

అందుకోసమే చేగువేరా తన మంత్రిపదవికి రాజీనామా ఇచ్చేసి తుపాకీ భుజాన వేసుకొని విశాలవిశ్వంలోకి వెళ్ళిపోయాడు. విప్లవం ఎక్కడ చెలరేగుతూ వుంటే అక్కడ తన అవసరం ఉందన్నాడు. రెండు సంవత్సరాల దాకా చేగువేరా ఏమయాడో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. కాంగో లో చూశామన్నారు. వియత్నాం కు వెళ్ళేడన్నారు. ఈలోగా క్యూబాలో జరిగిన మూడు మహాఖండాల సభకి తవ శుభాకాంక్షలను "ప్రపంచంలోని కొండొక చోటినుంచి పంపించాడు.

ఇక్కడ ఉద్దేశం గువేరా జీవిత చరిత్రను చిత్రించడం కాదు మన బుద్ధిజీవులకు అందుబాటులో లేకున్నా. అతని మీద చాలా పుస్తకాలు వచ్చాయి. అతడు రాసినవి కొన్ని ఉన్నాయి. ఇరవై ఒకటో శతాబ్దపు మానవుణ్ణి గురించి అతడురాశాడు. అతడే అటువంటి మానవుడా అనిపించేటట్టు బతికేడు అర్జెంటీనాలో జన్మించాడు. క్యూబాలో విజయం సాధించాడు. బొలివియా అడవుల్లో గెరిల్లా యుద్ధం సాగిస్తూ కాలికి గుండు దెబ్బ తగిలి శత్రువుకి దొరికిపోయాడు. అతని జేబులో ఉన్న కాగితాలను బట్టి అతడు దళనాయకుడు మేజర్ రామన్" అని మాత్రం శత్రువులకి తెలిసింది. గెరిల్లాల మీద కేసుల పెట్టడం, విచారణ సాగించడం ఇలాంటివన్నీ బూర్జువా పద్ధతికి విరుద్ధం. అందుచేత బూర్జువా న్యాయం ప్రకారం అతని గుండెల్లో గుండుపేల్చి చంపేశారు. తర్వాత ఇతడే గువేరా అని తెలిసింది. ఆదరాబాదరగా అతని ఫొటోగ్రాఫులు తీసుకుని అంతర్జాతీయ పత్రికలకి పంపించి శవాన్ని సక్రమంగా సమాధి చేశారు. ప్రపంచం అంతటికీ చనిపోయింది. చేగువేరా అని తెలిపింది. క్యూబా నాయకుడు కాస్ట్రో కూడా గువేరా మరణించాడని హవానా నగరంలో తన ప్రజలముందు ప్రకటించాడు.

"ఒక పేరులేని సమాధిలో విశ్రాంతి తీసు కుంటున్నా లేదా ఇంకోసారి తప్పించుకుని ఇంకోచోట ప్రత్యక్షమైనా ఈ మహాధైర్యశాలి మన ప్రశంసలకీ, గౌరవానికి అర్హుడు" అని న్యూయార్కు, టైమ్పు పత్రిక సంపాదకీయం లో రాసింది.

అక్కడ బొలీవియాలో అధికారులు హడలిపోతున్నారు. బతికి ఉన్న గువేరా కంటె, సమాదిలోని గువేరా శవమే వాళ్ళని భయపెడుతోంది. అంచేత శవాన్ని తవ్వి తీసి, చేతి బొటనవ్రేళ్ళు మాత్రం కోసేసి శరీరాన్ని దహనంచేసేసి, బూడిదను గాలిలో కలిపివేశారు. అంతటితో గువేరా కధ ముగిసిందని వాళ్ళనుకున్నారు. కాని ఆ క్షణం నుంచే అతని కథ ప్రారంభమయింది. అమెరికన్ నీగ్రో నాయకుడు స్టాక్రీకార్నైబేల్ ఇలా అన్నాడు చేగువేరాను నేనెప్పుడూ వ్యక్తిగతంగా కలుసుకొలేదు. కాని నేనతణ్ణి ఎరుగుదును ఇప్పుడు ఇంకా బాగా ఎరుగుదును ముఖ్యమైన విషయం ఏమిటంటే అతని భావాలన్నీ మనతోనే ఉన్నాయి. అందుచేతనే మనం నిర్విరామంగా పోరాటం సాగించడానికి సిద్ధంగా ఉన్నాం" అని, అందుకే చేగువేరా చనిపోయాడని తానంగీకరించలేనన్నాడు.

చేగువేరా అవలంబించిన పోరాట పద్ధతులను గరిస్తున్నవారితో సహా అతడాశించిన సమాజాన్ని ఆహ్వానిస్తూనే ఉన్నారు. అతడు సమాజంలో సమూలమైన మార్పులు కోరాడు. అందుకు మానవ స్వభావంలో సంపూర్ణమైన పరివర్తన జరగాలన్నాడు.(అంబేద్కర్ కూడా ఇలాంటి పరివర్తనే కోరాడు).గువేరా రచించిన "క్యూబాలో మానవుడూ, సామ్యవాదమూ "అనే గ్రంధం నుంచి ఈ దిగువ నాలుగు ముక్కలూ
ఉదహరించి, ఇంతటితో గువేరా ప్రసక్తి ముగిస్తాను.

"మనం సృష్టించవలసింది 21వ శతాబ్దపు మానవుణ్ణి, అయితే ఇంకా ఇది ఊహిస్తున్న చిత్రమేగాని సాధించిన ఆశయం కాదు. ఒకొక్కడూ ఎన్ని కిలోగ్రాముల మాంసం తింటున్నాడు. ఏడాది కెన్నిమార్లు సముద్రతీరాల్లో విలాసయాత్రలు చేస్తున్నాడు లేదా ఇప్పుడున్న జీతంతో ఎన్నిరకాల దిగుమతి సరుకులు కొనుక్కోగలుగుతున్నాడు"అన్నది కాదు ప్రశ్న.వ్యక్తికి మరింత ఎక్కువ సంతృప్తి కలిగిందా లేదా? తనలోని అంతఃస్సoపద ఇంకా అధికమయినట్లు భావిస్తున్నాడా లేదా? ఇంకా ఇంకా ఎన్నెన్నో బాధ్యతలు ఎక్కువవుతున్నట్టు గ్రహిస్తున్నాడా లేదా ?" అని ఆ గ్రంథంలో అడుగుతున్నాడు చేగువేరా.

_____శ్రీ శ్రీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?