యూరపును ఒక దెయ్యం పట్టుకొంది. ఆ దెయ్యం పేరు కమ్యూనిజం.
*యూరపును ఒక దెయ్యం పట్టుకొంది. ఆ దెయ్యం పేరు కమ్యూనిజం*
దెయ్యాన్ని వదిలించడానికి పాత యూరపులోని అధికార శక్తులన్నీ ఒక పవిత్ర కూటమిగా ఏర్పడ్డాయి. పోపూ జారూ; మెటర్నిక్, గిజో; ఫ్రెంచి రాడికల్సూ జర్మన్ గూఢచారులూ; ఒకరేమిటి, అందరూ ఏకమయ్యారు.
అధికారంలో ఉన్నవాళ్లు ఏ ప్రతిపక్ష పార్టీనయినా కమ్యూనిస్టు అని నిందించకుండా వదిలారా? ఏ ప్రతిపక్షమైనా అదే నిందను తిప్పికొట్టకుండా ఉందా? తనకంటే పురోగాములయిన తోటి ప్రతిపక్షాలపైనే కాక తిరోగాములైన పక్షాలపై కూడా కమ్యూనిస్టు అనే అదే నిందను మోపని ప్రతిపక్షం ఎక్కడైనా ఉందా?
దీనిని బట్టి రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి:
1. కమ్యూనిజమే స్వయంగా ఒక శక్తి అనే సంగతిని యూరపు అధికారవర్గాలన్నీ ఇప్పటికే గుర్తించాయి.
2. కమ్యూనిస్టులు తమ అభిప్రాయా లనూ తమ లక్ష్యాలనూ తమ ధోరణులనూ బహిరంగంగా మొత్తం ప్రపంచం ఎదుట ప్రకటించాల్సిన సమయం వచ్చింది.
కమ్యూనిస్టు దెయ్యం అనే ఈ కాకమ్మ కథను తిప్పికొట్టడానికి వారు తమ పార్టీ ప్రణాళికను ప్రచురిం చాల్సిన తరుణం ఆసన్నం అయింది.
ఈ ఉద్దేశంతో వివిధ జాతులకు చెందిన కమ్యూనిస్టులు లండన్లో సమావేశమై ఈ ప్రణాళికను రూపొందించారు. దీనిని ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మన్, ఇటాలియన్, ఫ్లెమిష్, డేనిష్ భాషల్లో ప్రచురించడానికి నిర్ణయించారు.
(కమ్యూనిస్టు ప్రణాళిక_1)
____మార్క్స్, ఏంగెల్స్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి