పాలకవర్గాల ప్రభావం నుంచి విద్యను కాపాడడమే కార్మిక వర్గం ఉద్దేశ్యం.
పాలకవర్గాల ప్రభావం నుంచి విద్యను కాపాడడమే కార్మిక వర్గం ఉద్దేశ్యం.
కుటుంబం రద్దు! కమ్యూనిస్టుల ఈ దారుణమైన ప్రతిపాదనపై అత్యంత రాడికల్స్ అనబడేవాళ్లు కూడా మండిపడతారు.
అసలు ప్రస్తుత బూర్జువా కుటుంబం ఏ పునాదిపై నిలబడింది. పెట్టుబడి మీద, సొంత స్వార్ధంపైన నిలబడిందది. బూర్జువాల్లో మాత్రమే ఈ కుటుంబం అన్నది పూర్తిగా అభివృద్ధి చెందిన రూపంలో ఉంది. అయితే ఆచరణలో కార్మికవర్గంలో కుటుంబం అన్నది లేకపోవడమూ వ్యభిచారం అన్నది బహిరంగంగా సాగడమూ అన్న అంశాలు ఈ పరిస్థితికి అనుబంధంగా ఉన్నాయి.
ఈ అనుబంధ అంశాలు మాయమైనప్పుడు కాలక్రమంలో బూర్జువా కుటుంబం కూడా మాయమవుతుంది. పెట్టుబడి మాయమవడంతో పాటు ఈ రెండూ మాయమవుతాయి.
తల్లిదండ్రులు తమ పిల్లలను దోపిడీ చేయడాన్ని ఆపాలనుకుంటున్నామని మా మీద ఆరోపణ మోపుతున్నారా? ఆ నేరాన్ని మేం అంగీకరిస్తున్నాం. అయితే ఇంటి విద్యను తొలగించి సామాజిక విద్యను ప్రవేశపెట్టడం ద్వారా అత్యంత పవిత్ర బంధాలను మేము ధ్వంసం చేస్తున్నామని మీరంటారు.
మరి మీ విద్య మాటేమిటి? అది సామాజిక విద్య కాదా? పాఠశాలలు వగైరాల ద్వారా మీరు నేర్పే విద్యను సామాజిక పరిస్థితులు శాసించవా? ఆ విద్యలో సమాజం నేరుగానో పరోక్షంగానో జోక్యమే చేసుకోదా? విద్య విషయంలో సామాజిక జోక్యం అన్నదాన్ని కమ్యూనిస్టులు కనుక్కోలేదు. ఆ జోక్యానికి ఉన్న స్వభావాన్ని మాత్రమే వారు మార్చ దలుచుకున్నారు. పాలకవర్గాల ప్రభావం నుంచి విద్యను కాపాడడమే వారి ఉద్దేశ్యం.
____ మార్క్స్ ఏంగెల్స్
( కమ్యూనిస్టు ప్రణాళిక)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి