ఒక జాతి మరో జాతిని దోపిడీ చెయ్యడం అంతమవుతుంది


ఒక జాతి మరో జాతిని దోపిడీ చెయ్యడం అంతమవుతుంది.

దేశాలనూ జాతీయతనూ రద్దుచేయగోరుతున్నారు అన్నది కమ్యూనిస్టుల పై మరో ఆరోపణ.

కార్మికులకు దేశం లేదు. వారి నుంచి వారి దగ్గర లేనిదాన్ని ఎవరూ లాక్కోలేరు. అన్నింటికంటే ముందు శ్రామికవర్గం రాజకీయ ఆధిపత్యాన్ని సాధించాలి; కనుక జాతిలో అది ప్రధాన వర్గం కావాలి. జాతి అంటే తానే అన్న స్థితికి రాక తప్పదు. ఆ మేరకు మాత్రమే అది జాతీయమైనది. కనుక, ఇక్కడ జాతీయం అన్న పదం బూర్జువా అర్ధంలో కాదు.

బూర్జువా వర్గ అభివృద్ధి కారణంగా, స్వేచ్ఛా వాణిజ్యం వల్లనూ, ప్రపంచ మార్కెటు వల్లనూ, ఉత్పత్తి విధానంలోనూ దాన్ని అనుసరించి వుండే జీవన పరిస్థితుల్లోనూ ఏకరూపత వల్లనూ వివిధ దేశాల ప్రజల మధ్య జాతీయ భేదాలూ శత్రుత్వాలూ రాను రాను మాయమవుతున్నాయి.

శ్రామికవర్గ ఆధిపత్యంలో అవి మరింత వేగంగా మాయమవుతాయి. కనీసం ప్రధాన నాగరిక దేశాల ఐక్క ర్యాచరణ అన్నది శ్రామికవర్గ విమోచనకు మొదటి షరతుల్లో ఒకటి.

ఒక వ్యక్తి మరో వ్యక్తిని దోపిడీ చేయడం అన్నది ఏ మేరకు అంతమౌతుందో ఒక జాతి మరో జాతిని దోపిడీ చెయ్యడం కూడా అదే మేరకు అంతమవుతుంది. ఒక జాతిలో వర్గ శత్రుత్వం ఏమేరకు మాయమవుతుందో ఒక జాతికీ మరో జాతికీ మధ్య శత్రుత్వం కూడా ఆ మేరకు అంతమవుతుంది.

ఇక మత దృష్టితోనో, తాత్వికపరంగానో, సిద్ధాంతపరంగానో కమ్యూనిజంపై చేసే ఆరోపణలను అంతగా పట్టించుకోనక్కర్లేదు.

_ మార్క్స్ ఏంగెల్స్
(కమ్యూనిస్టు ప్రణాళిక)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?