బూర్జువా సమాజం స్త్రీ లను ఉత్పత్తి పరికరంగా చూస్తుంది
బూర్జువా సమాజం స్త్రీ లను ఉత్పత్తి పరికరంగా చూస్తుంది
ఆధునిక పరిశ్రమ శ్రామికుల కుటుంబ సంబంధాలన్నింటినీ చిందరవందర
చేసేస్తోంది. కార్మికుల బిడ్డలు వ్యాపార వస్తువులుగానూ కూలిపని చేసే పనిముట్లు
గానూ మారిపోతున్నారు. ఈ క్రమం సాగుతున్న కొద్దీ, కుటుంబం గురించి విద్య గురించీ తల్లిదండ్రులకూ బిడ్డలకూ ఉన్న పవిత్ర సంబంధాల గురించీ బూర్జువాల చెత్త వాగుడు మరింత రోత పుట్టిస్తోంది. మీ కమ్యూనిస్టులు స్త్రీలను సమాజపరం చేస్తారో అని బూర్జువాలు కలిసికట్టుగా పెడబొబ్బలు పెడుతున్నారు.
బూర్జువాకి తన భార్య కేవలం ఒక ఉత్పత్తి పరికరంలా కనిపిస్తుంది. ఉత్పత్తి పరికరాలను సమష్టిగా అనుభవిస్తారన్నమాట బూర్జువా చెవుల్లో పడగానే స్త్రీలు కూడా సమాజపరం అయిపోతారనే నిర్ధారణకు వచ్చేస్తాడు.
కేవలం ఉత్పత్తి పరికరంగా పడివుండే దౌర్భాగ్యం నుంచి స్త్రీలను బయట పడేయడమే కమ్యూనిస్టుల ఉద్దేశమేమో అన్న కనీస సందేహం కూడా బూర్జువాకు రాదు.
కమ్యూనిస్టులు స్త్రీలను బహిరంగంగా శాసనపరంగా సమష్టి ఆస్తిగా మార్చేస్తారని తామే కల్పించి దానిపైన మన బూర్జువాలు తమ ఆగ్రహాన్ని వెలిగక్కుతున్నారు. అంతకంటే హాస్యాస్పదమైనది ఏముంది? అయినా స్త్రీలను సమష్టి ఆస్తిగా మార్చే పని కమ్యూనిస్టులు కొత్తగా చేయాల్సిన అవసరమే లేదు. అనాదిగా జరుగుతున్నది.
మన బూర్జువాలకు బజారు వేశ్యల మాట అటుంచి, తమ చేతికింది కార్మికుల భార్యలూ కూతుళ్లూ చాలక వారు ఒకరి పెళ్లాన్ని మరొకరు ఆకట్టుకోవడంలో అపారమైన ఆనందాన్ని పొందుతున్నారు.
బూర్జువా వివాహ వ్యవస్థే వాస్తవంలో ఒక సమష్టి పెళ్లాల వ్యవస్థ. ఈ విషయంలో కమ్యూనిస్టులపై ఏ నింద మోపుతారు? మహా అయితే, బూర్జువాలు చాటుమాటుగా చేసే పనినే కమ్యూనిస్టులు బాహాటంగా, చట్టబద్ధంగా చేస్తారు అనగలరు. అసలు ప్రస్తుత ఉత్పత్తి వ్యవస్థనే రద్దు చేసినప్పుడు ఆ వ్యవస్థకు పుట్టిన సమష్టి పెండ్లాల వ్యవస్థ కూడా రద్దు అవుతుంది. దానితో బహిరంగ వేశ్యావృత్తి పోతుంది. పరోక్ష వేశ్యావృత్తి అంతమవుతుంది.
మార్క్స్ ఎంగెల్స్
(కమ్యూనిస్తు ప్రణాళిక)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి