మేడే - నిర్దిష్టమైన విప్లవ క ర్తవ్యాలు.
* మేడే - నిర్దిష్టమైన విప్లవ క ర్తవ్యాలు.
మేడే అంటే కేవలం అంతర్జాతీయ సౌహార్ద్రతను జనరల్ గా ప్రకటన చేయమని అర్ధంకాదని గూడా లెనిన్ కార్మికులకు చెప్పారు. ఆయా దేశాలలో కార్మికులు ఎదుర్కొంటున్న నిర్దిష్టమైన విప్లవ కర్తవ్యాలకు అంకితం కావాలి. విప్లవకర ప్రాధాన్యతగల తక్షణ ఆర్థిక కోర్కెలను, అంతర్జాతీయ సౌహార్దత సోషలిజంపట్ల జనరల్ గా వాంఛను కలిపి ప్రకటించడం సరిపోదు. సోషలిజం లక్ష్యాన్ని చేరుకునేందుకు, కార్మికవర్గం తాను ఎదుర్కొంటున్న నిర్దిష్ట విప్లవ సమస్యలను పట్టించుకోవాలి. అందువల్ల మేడే సభలలో పెట్టుబడి దారీ విధానానికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో భాగంగా ఈ సమస్యలను లేవనెత్తడం అవసరం,
ఇది 1902లో నార్తరన్ లీగ్ కు రాసిన తన లేఖలో లెనిన్ చెప్పింది. "మనదేశంలో మేడే ప్రదర్శనలు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, రాజకీయ స్వేచ్ఛకోనం జరిగే ప్రదర్శనగా గూడా తయారైందని గూడా చేర్చి వుండా ల్సింది. ఆ పవిత్ర దినం గురించిన అంతర్జాతీయ ప్రాధాన్యతను ఎత్తి చూపడంతో సరిపోదు, దానిని కీలకమైన జాతీయ రాజకీయ డిమాండ్లతో జత చేయాలి. (సంపూర్ణ రచనలు 6వ భాగం పేజీ 168.
1903లో రానున్న మేదే సందర్భంలో సహితం లెనిన్ అదే అంశాన్ని నొక్కి చెప్పారు. "తుట్టతుదకు కార్మికుల సమాధానాన్ని వీధుల కెక్కించాలి.. ప్రదర్శన ద్వారా మన డిమాండ్లను చాటాలి. రాజకీయంగా కార్మికుల సంఖ్యను, బలాన్ని ప్రదర్శించాలి. కార్మికవర్గ వర్గచైతన్యాన్ని కృతనిశ్చయాన్ని తెలియజేయాలి. రానున్న మేడే ఉత్సవం కార్మికవర్గపు జనరల్ డిమాండ్ల ప్రకటనగా మాత్రమేగాక, ఫిబ్రవరి 26 ప్రణాళికకు ప్రత్యేకమైన స్పష్టమైన సమాధానంగా గూడా ఆ ఉత్సవం జరపాలి" లెనిన్ సంపూర్ణ రచనలు ఆరవ భాగం పుట 348, 350].
ప్రజలము వెర్రి వాళ్ళను చేసేందుకు రష్యన్ జార్ ప్రకటించిన ప్రణాళికే ఫిబ్రవరి 26 ప్రణాళిక.
1)సమావేశ, పత్రికా స్వేచ్ఛలు, రాజకీయ ఖైదీలకు, మత సంఘాల సభ్యులకు క్షమ తక్షణమే, ఎలాంటి షరతులు లేకుండా చట్టంద్వారా గుర్తిం చడం
2) పౌరులంతా కలసి ఎన్నుకొనే రాజ్యాంగసభను ఏర్పర్చడం, ఎన్ని కైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్
3) ఇతర సామాజిక తర గతులతో రైతాంగానికి సమానత్వాన్ని తక్షణమే, బేషరతుగా చట్టంద్వారా ఆమోదించడం
గ్రామీణ ప్రాంతాలలో అర్థబానిస అవశేషాలను రద్దుచేసేందుకు రైతాంగకమిటీల సమావేశం ఏర్పాటు చేయడం వంటి రాజకీయ డిమాండ్లను మేడే సందర్భంగా లేవనెత్తాలని లెనిన్ చెప్పారు. ఒక్కముక్కలో చెప్పా అంటే ప్రజాతంత్ర విప్లవపు పరిపక్వత పొందుతున్న నినాదాలను మేడే సందర్భంగా వ్యక్తం చేయాలని లెనిన్ కోరారు.
* రష్యా జపాన్ యుద్ధం.
1904 నాటికి రష్యా—జపాన్ యుద్ధం ప్రారంభమైంది. యుద్ధానికి ఏదో సాధారణ వ్యతిరేకతను వ్యక్తం చేసే సమయం కాదు ఆది. జపాన్కు వ్యతి రేకంగా జార్ జరుపుతున్న యుద్ధాన్ని నేరుగా వ్యతిరేకించే సమస్య ముందు కొచ్చింది. తమను తాము సోషలిస్టులుగా భావించుకునే అనేకమంది సోషల్ డెమోక్రాట్లు, ఇతరులు యుద్ధ వ్యతిరేకతలో ఊగిసలాడసాగారు. బూర్జువా జాతీయ వాదపు సెగకులోనైనారు. ఈ ఇలాంటి పరిస్థితిలో లెనిన్ మేడే కోసం ఒక కరపత్రం రాశారు. అందులో యుద్ధాన్ని వ్యతిరేకించమని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. "దేశంలో దారిద్య్రం, ఆకలితో మన ప్రజలు కూలి
పోతున్నారు.
అయినా వారిని వినాశకరమూ, అర్థరహితమూ అయిన యుద్ధం లోకి లాగుతున్నారు. విదేశీ జాతులు నివశించే వేలాదిమైళ్ళ దూరాన వున్న, పరాయి భూభాగాలలో యుద్ధ రంగానికి ఈడుస్తున్నారు. బానిసత్వంతో మన ప్రజలు కుంగిపోతున్నారు. అయినా ఇతర జాతులను బానిసత్వంలోకి లాగే యుద్ధంలోకి ప్రజలను ఈడుస్తున్నారు. దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులను డిమాండ్ చేస్తున్నారు మన ప్రజలు. మరో ప్రపంచపు అంచున పేలే తుపాకీ మోతలతో ఈ డిమాండ్ను పక్కదారులు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలకులు" అని రాశారు లెనిన్.
జార్ పాలనకు వ్యతిరేకంగా నిర్ణయాత్మక సమరానికి సిద్ధం కావల సింగా లెనిన్ పిలుపు నిచ్చారు. “మన కెదురౌతున్న సమరంలో నిర్ణయాత్మ కంగా పాల్గొనేందుకు రెట్టింపుశ క్తితో సంసిద్ధం కావాలి. కామ్రేడ్స్ కార్మికులారా! అపూర్వమైన రీతిలో సోషల్ డెమొక్రటిక్ కార్మిక విభాగాలు సన్నిహితం కావాలి. దూరతీరాలకు వారి మాటలను వ్యాపింపజేయాలి. మరింత సాహ నంతో కార్మికుల డిమాండ్లకై ఉద్యమం సాగించాలి. మన సమిష్టి లక్ష్యంకోసం పోరాడే నూతన శక్తులను వేలాదిగా సంపాదించేందుకు మేడే వుత్సవం జర పాలి. ప్రజలందరి స్వేచ్ఛకు, పెట్టుబడిదారీ శృంఖలాల నుండి శ్రమజీవు లందరికీ విముక్తి సాధించేందుకు అపారమైన శక్తులను సమీకరించేలా మేడే ప్రదర్శనలు జరగాలి.
_ఎనిమిది గంటల పనిదినం - వరిలాలి. _అంతర్జాతీయ విప్లకర సోషల్ డెమొక్రసీ - వర్థిల్లాలి.
_దోపిడీ, దుర్మార్గపు జార్ నిరంకుశత్వం - నశించాలి." (లెనిన్ సంపూర్ణ రచనలు - ఏడవభాగం - 202 పేజీ)
* 1905 విప్లవ సందర్భంగా మేడే.
1905 విప్లవ సంవత్సరం. దేశమంతా విప్లవ పరిస్థితి నెలకొంటున్నది. ఆ పరిస్థితికి అనుగుణ్యమైన మేడే నినాదాలు రూపొందాలి. రష్యా-జపాన్ • యుద్ధం ఇంకా కొనసాగుతున్నది. దానిని వ్యతిరేకించాలి.. ఆదే సమయంలో సోషలిస్టు ఉద్యమ అంతర్జాతీయ ఐక్యత విషయమై కార్మికవర్గాన్ని హెచ్చ రించాలి.
1905 మే లెనిన్ మరొక కరపత్రం రాశారు. "కామ్రేడ్స్ కార్మికు లారా ప్రపంచ కార్మికుల మహత్తర సెలవుదినం రానున్నది. వెలుగు విజ్ఞా నాలకు తమ జాగృతిని మే మొదటిరోజున పండుగ చేసుకుంటారు. అన్ని రకాల దోపిడికి, అన్ని విధాల నియంతృత్వానికి, వివిధ రకాల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, సోషలిస్టు విధాన సమాజ సాధనకు సాగించే పోరాటంలో ఒకే సౌహార్దతా యూనియన్ లో తమ ఐక్యతను ప్రదర్శించాలి.
"విభిన్న జాతులకు, విశ్వాసాలకు చెందిన కార్మికుల మధ్య శత్రుత్వంనశించాలి. అలాంటి శత్రుత్వం దోపిడిదారులకు, నిరంకుశులకు మాత్రమేలాభం. వారు కార్మికవర్గ అనైక్యత, అజ్ఞానంపైనే తమ మనుగడ సాగిస్తున్నారు. యూదులు, క్రైస్తవులు, ఆర్మేనియన్లు, తార్తారులు, పోలీష్ జాతి,
రషన్లు, ఫిన్నిష్జాతులు, స్వీడిష్ ప్రజలు, లెట్స్, జర్మన్లు అందరూ,వారంతా ఒకే సోషలిస్టు పతాకం క్రింద సమిష్టిగా పురోగమిస్తారు.....
అన్నిదేశాల కార్మికుల ఈ ఐక్యత, అంతర్జాతీయ సోషల్ ప్రజాస్వామ్య శక్తులను మేడే నాడు పునఃపరిశీలించుకు టుంది. ఎలాంటి వెరలుబాటు, తడ బాటులేని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల సాధనకు మరింత ముందుకు సాగే పోరాటంలో తన శక్తులన్నింటినీ సమీకరిస్తుంది.” అన్నారు కామ్రేడ్
లెనిన్ ఆ కరపత్రంలో.
"దూర ప్రాచ్యంలో అసువులు అర్పించేందుకు లక్షలాది యువజీవితాలను దూరంగా తీసుకెళ్తున్నారు.... ఇంతకూ ఆ యుద్ధం ఎందుకు? మంచూరియా కోసం. ఆ మంచూరియాను మన దోపిడిదారీ ప్రభుత్వం చైనా నుంచి కాజేసింది. విదేశీ భూభాగాల కోసం రష్యన్ రక్తం రాల్చబడుతున్నది. దేశం నాశనం చేయబడుతున్నది.
"ప్రజల తిరుగుబాటు ఉత్సవంగా ఈ ఏడాది మే మొదటి తారీఖును. జరుపుకుందాం. అందుకు సిద్ధమౌదాం. నియంతలపై నిర్ణయాత్మక పోరాటా నికి పచ్చజెండా కై ఎదురుచూడండి.... మహతర సమరాలకు సిద్ధంకండి. కామ్రేడ్ కార్మికులారాః మే మొదటి తేదీన ఫ్యాక్టరీలలో, మిల్లులలో వని నిలుపు చేయండి., సోషల్ డెమొక్రటిక్ లేబర్పార్టీ కమిటీ సలహా మేరకు ఈ ఆయుధాలు చేపట్టండి జనవరి 96 సెంట్ పీటర్స్బర్గ్ కార్మికులు స్వాతం త్ర్యమో, మరణమో తేల్చుకోవాలని ప్రకటించారు. రష్యన్ కార్మికులంతా ఆ మహా అక్షర నినాదాన్ని ప్రతి ధ్వనించాలి. ఎలాంటి త్యాగాలకు మనం జంక రాదు. తిరుగుబాటు ద్వారా స్వేచ్ఛను, స్వేచ్ఛద్వారా సోషలిజాన్ని మనం సాధించుకుంటాం.
"మే మొదటితేది వర్దిలాలి, ఇంటర్నేషనల్ సోషల్ డెమొక్రసీ వర్థిల్లాలి. కార్మిక కర్షక స్వేచ్ఛ వర్థిల్లాలి. ప్రజాతంత్ర రిపబ్లిక్ వర్థిల్లాలి. జారిస్టు రిపబ్లిక్ నశించాలి. జారిస్టు నియంతృత్వం నశించాలి " లెనిన్ సంపూర్ణ రచనలు 8వ భాగం పేజి 348, 350) అని రాశారు కామ్రేడ్ లెనిన్.
కార్మికవర్గ పార్టీ అయిన సోషల్ డెమొక్రటిక్పార్టీ లెనిన్ నాయ కత్వాన అనేక పోరాటాలు సాగించింది. పాక్షిక కోర్కెల కైసాగే పోరాటాన్ని, దోపిడిదారీ యుద్ధాన్ని వ్యతిరేకించడం, పెట్టుబడిదారీ విధానాన్ని తుద ముట్టించడం అనే లక్ష్యాలతో సమ్మిశ్రితంచేసి నడపడంద్వారా మేడే విప్లవ సాంప్రదాయాన్ని, కాపాడింది.
దీనితోపాటు ముంచుకొస్తున్న ప్రజాతంత్ర విప్లవకర్తవ్యాలను పూర్తిచేసి, సోషలిజానికి మార్గం సుగమంచేసేందుకు ఆనాటి రష్యన్ పరిస్థితులలో అవసరమైన రాజకీయ నినాదాలను, విప్లవకర పరిస్థితి క్రమేపి అభివృద్ధి కావడంతో రష్యాలో మేడే మొత్తం ప్రజల విప్లవ డిమాండ్ల మే సోషల్ డెమెక్రటిక్ పార్టీ లేవనెత్తింది విప్లవకర డిమాండ్లను ప్రతిబింబించసాగింది. 1905 నాటికి ఆయుధాలను చేపట్ట- మనే డిమా డ్ను
లెనిన్ లేవనెత్త గలిగారు.
ఈ సంవత్సరాలలో రష్యా, విప్లవోద్యమ తుఫాను కేంద్రమైనది 1905 విప్లవం విఫలమైంది. కాని లెనిన్ బోల్షివిక్ పార్టీల నాయకత్వాన, మార్క్స్, ఏంగెల్స్ల విప్లవకర బోధనలను అనుసరించి 1905 ఓటమిని అధిగమించి రష్యన్ కార్మికవర్గం 1917 లో సోషలిస్టు విప్లవ విజయం సాధించ గలిగింది.
* విప్లవ సాంప్రదాయాలనుండి దిగజారాడు.
అయితే ఐరోపాలోని అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో పరిస్థితి పూర్తిగా వేరుగా తయారైంది. వీటిలో కొన్నింటిలో ఒక సమయంలో కార్మిక వర్గ ఉద్యమానికి మార్క్సిస్టు నాయకత్వం వుండేది. పెట్టుబడిదారీ విధానంలో ""శాంతియుత" కాలం తలెత్తింది. పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్య వాదంగా మారింది. వలస దేశాలను దోపిడీ చేయడం మూలంగా లాభ పడిన ప్రత్యేక హక్కులు పొందే అతి కొద్దిమంది కార్మిక నిరంకుశులు (ప్రివిలేజ్ లేబర్ అరిస్టోకసీ) తలెత్తింది. కార్మికులకు కొన్ని పార్లమె టరీ, ప్రజాతంత్ర హక్కులు కొంత వరకు విస్తరించాయి. ఇవన్నీ కలసి సోషలిజానికి శాంతి యుతంగా పురోగమించ వచ్చనే భ్రమలు ఏర్పడ్డాయి.
సోషల్ డెమొక్రాటిక్ ఉద్యమంలో క్రమేపి ఒక రివిజనిస్టు ధోరణి తలెత్తింది. వర్గ పోరాటం, విప్లవం ఏ మాత్రం అవసరం లేదని భావించే ధోరణి ఇది. మేడే ప్రదర్శనలో ఇమిడి వున్న కార్మిక వర్గ విప్లవ, మిలిటెంట్ సాంప్రదాయాలకు తిలోదకాలు యివ్వడం ప్రారంభమైంది.
ట్రేడ్ యూనియన్ నాయకత్వమే ప్రధానంగా ఈ రివిజనిస్టు ధోరణి. దృక్పధాలను వ్యక్తం చేయసాగింది. అప్పటికే చాలా కాలంగా బ్రిటిష్ ట్రేడ్ యూనియన్ ఉద్యమం సంస్కరణవాద, మిలాఖత్వారీ పద్ధతులలో నడపబడు
తున్నది. సమ్మెల ద్వారా మేడే జరుపుకొనడాన్ని లేదా నిరాకరించింది. బ్రిటిషు ట్రేడ్ యూనియన్ ఉద్యమం గురించే 1879 లోనే ఏంగెల్స్ ఇలా అన్నారు.
"అదనపు జీతాలు, పని గంటల తగ్గింపుకు జరిగే హ్రస్వ పరిధిలో జరిగే సమ్మెలనే నిస్సహాయంగా అభివర్ణిస్తోంది. (చిన్న విడివిడి నమ్మెలకు పరిమితమై పోయింది. అను) అయితే ఇలాంటి సమ్మెలకు తప్పని పరిస్థితుల లోనో, ప్రచార సాధనంగానో, నిర్మాణాన్ని పెంచుకునేందుకో చేపట్టడం లేదు. ఆవే చరమ లక్ష్యంగా భావిస్తున్నారు. ఒక సూత్రంగా, స్వభావంగానే ట్రేడ్ యూనియన్లు అన్ని రాజకీయ కార్యకలాపాలను నిషేధిస్తున్నాయి. ఆ విధంగా కార్మిక వర్గం ఒక వర్గంగా సార్వత్రిక కార్యకలాపాలలో పాల్గొనడాన్ని గూడా అడ్డుకుంటున్నారు ..... కాంటినెంట్ అనే అర్థంలో ప్రస్తుతం నిజమైన కార్మికవర్గ పుద్యమం లేదనే విషయం దాచేందుకు ఎలాంటి ప్రయత్నం చేయరాదు"
సోషలిస్టు ఇంటర్నేషనల్ సంస్థాపనకు ఒక దశాబ్దం ముందున్న పరిస్థితి ఇది. కాంటినెంటల్ పార్టీలలో సహితం ఇదే ధోరణి పెంపొందసాగింది. ఆ ధోరణి సహజంగానే మేడే నుండి దాని విప్లవ సారం నుండి తొలగించ చూచింది. పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధిలోనే కొద్దిపాటి ఆర్థిక డిమాండ్లను ముందుకు నెట్టేందుకే పరిమితం కాసాగారు.
* జేనా కాంగ్రెస్ పై లెనిన్.
జర్మన్ పార్టీలో ఇలాంటి పోకడలను 1905 నాటికే లెనిన్ గమనించారు. జర్మన్ సోషల్ డెమొక్రటిక్ పార్టీ జేనా కాంగ్రెస్ గురించి ఒక వ్యాసం రాస్తూ లెనిన్ ఇలా అన్నారు. "రాజకీయ నమ్మె నమన్య కన్నా ముందు మరొక నసున్య చర్చకు వచ్చింది. అది రష్యాకు ఎంతో విజ్ఞానకర మైంది. మేడే సమస్యే ఈ సమస్య. (ఈ సమస్యపై చర్చకు దారి తీసిన అంశాన్ని గాక, విషయసార౦ దృష్ట్యా చూస్తే) ఇంకా స్పష్టంగా పేర్కొనవచ్చు. ఇది సోషల్ డెమొక్రటిక్ పార్టీతో ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి వుండ వలసిన సంబంధం సమస్య ఆది. జర్మన్ సోషల్ డెమొక్రాట్లపై, కేవలం వారిపైనే కాదు, కాలొగ్నే ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నెరపిన ప్రభావం గురించి ప్రొటరీ చాల మాట్లు ప్రసంగించారు. మార్క్సిజం సాంప్రదాయాలు బాగా బలంగా వున్న జర్మనీలో సహితం, ట్రేడ్ యూనియన్లలో సోషలిస్టు వ్యతిరేక ధోరణులు ప్రవర్థమాన మౌతున్నట్లు ఈ కాంగ్రెస్లో స్పష్టమైంది. బ్రిటిష్ వారి "స్వచ్ఛమైన ట్రేడ్ యూనియనిజం" ధోరణి, అంటే సంపూర్ణ మైన బూర్జువా తరహా పెంపొందుతున్నది అని ఈ కాంగ్రెన్ రుజువు చేసింది.
ట్రేడ్ యూనియన్లు అందే సోషల్ డెమొక్రటిక్ ట్రేడ్ యూనియన్లు అనే విషయం గుర్తుంచుకోండి. మేడే ప్రదర్శనలు అనే సాధారణ విషయం నుం-డి. ట్రేడ్ యూనియనిజము, సోషల్ డెమొక్రసీల సమస్య అనివార్యంగానే జేనా కాంగ్రెస్లో తలెత్తింది. రష్యన్ సోషల్ డెమొక్రటిక్ ఉద్యమ లో వచ్చిన ధోరణుల భాషలో చెప్పాలంటే ఆర్థిక తత్వధోరణి అక్కడా ప్రతిబింబిస్తున్నది.
"ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో సోషలిస్టు భావన అదృశ్యమౌతున్న విషయం విస్మరించడం పెద్ద పొరపాటు ఔతుందని మేడే సమస్యపై నివేదిక యిస్తూ ఫిషర్ స్పష్టంగానే చెప్పాడు. విషయం దూరం పోయింది.
ఉదాహరణకు కార్పెంటర్స్ యూనియన్ ప్రతినిధి బ్రింగ్మాన్ "మేడే నాడు. సమ్మె చేయడం మానవ శరీరంలో ఇతర ముద్ర అంశాలు ప్రవేశించడంవంటిది" అని రాశారు "ఈనాటి పరిస్థితులలో కార్మికుల పరిస్థితిని మెరుగుపరచే ఏకైక సాధనమే ట్రేడ్ యూనియన్లు" అనిగూడా అన్నారు.
ఫిషర్ సరిగానే అభివర్ణించినట్లు ఈ రుగ్మతా చిహ్నాలు అనేక ఇతరులతో నహితం కనిపిస్తున్నాయి. రష్యాలోలాగే జర్మనీలో గూడా నిజం చెప్పాలంటే. ప్రతిచోటా హ్రస్వ దృష్టి గల ట్రేడ్ యూనియనిజం లేదా ఆర్థిక తత్వమనేది అవకాశ వాదంలో జతకడుతున్నది" (రివిజనిజ అనే గ్రంధం నుండి).
శాస్త్రీయ సోషలిజపు కూలిపోతున్న పునాదులను గురించి, ఆదే కార్పెంటర్స్ యూనియన్ ప్రకటించే పత్రికల్లో రాస్తున్నారు. సంక్షోభాన్ని గురించిన తప్పుడు సిద్ధాంతాలు ప్రచురిస్తున్నారు. కూలిపోవడం పై సిద్ధాంతం లాంటివి ప్రచారం చేస్తున్నారు. కార్మికులను తమ అసంతృప్తి వ్యక్తం చేయ ముని, తమ డిమాండ్లను పెంచమని గాక, కార్మికులు తమ కోర్కెలలో నన్రుత చూపాలనే వంటి మాటలను రివిజనిస్టు కాల్వర్ ప్రకటిస్తున్నారు.
"హ్రస్వ పరిధిగల ట్రేడ్ యూనియన్ తత్వపు ప్రమాదాన్ని బెబెల్ పూర్తిగా గుర్తించారు. ఆయా వృత్తి ట్రేడ్ యూనియన్ల నిర్లిప్తత గురించి అతి హీనమైన వుదాహరణలు తనకు తెలుసునని ఆయన చెప్తూనే వున్నాడు.. మొత్తంగా పార్టీ, సోషలిజం, వర్గ పోరాట సిద్ధాంతం పట్ల యువ గ్రేడ్ యూనియన్ కార్యక ర్తలు అవహేళన చేస్తున్నారు" (9వ సంపుటి 293 పేజీ)
పశ్చిమ ఐరోపాలో పెరుగుతున్న ధోరణి ఇది కాగా లెనిన్ మార్గ దర్శకత్వం మూలంగా రష్యాలో పెంపొందుతున్న విప్లవకర పరిస్థితి మధ్య, మేడే ప్రదర్శనలు మొత్తం ప్రజల విప్లవ కార్యకలాపాలకు చిహ్నంగా 1912 లో "విప్లవకర కెరటం" అనే తన వా సంలో "అఖిల రష్యా కార్మికుల మేడే సమ్మే, దానితో జరిగిన వీధి ప్రదర్శ లు, విప్లవకర కరపత్రాలు, కార్మిక సమావేశాల్లో విప్లవకర ఉపన్యాసాలు రష్యా విప్లత కెరటపు ప్రాంగణ లో ప్రవేశించిందని స్పష్టం చేస్తున్నాయి" అని రాశారు. లెనిన్ 18 వ సంపుటి పేజీ 208)
* 1912-1913 మేడే.
మేడే నాడు కార్మిక వర్గం ప్రజలందరి నాయకుడు గా ఆవిర్భవించిందని రాసి 1912 మేడే ప్రాధాన్యతను ప్రత్యేకించి పేర్కొన్నారు. లెనిన్. "ఒక రాజ్యాంగ సభ, ఎనిమిది గంటల పని దినం, భూమి ఎస్టేట్ల స్వాధీనం అనేవి మన నినాదాలుగా వుండాలని నెంట్ పీటర్స్ బర్గ్ కమిటీ కరపత్రం పేరొంది. జారిస్టు ప్రభుత్వం నశించుగాక, జూన్ 3 సిరంతర రాజ్యాంగం నశించుగాక, ప్రజాతంత్ర రిపబ్లిక్ వర్ధిల్లుగాక, సోషలిజం వర్ధిలుగాక" అనే పిలుపును సహితం ఆ కరపత్రం ప్రవేశ పెట్టింది" అని రాశారు లెనిన్.
రష్యా అంతటా కార్మికులంతా అనుసరిస్తుండగా, లక్షలాది సెంట్ పీటర్స్ బర్గ్ కార్మికులు సమ్మెలకు, ప్రదర్శనలకు పూనుకున్నారు. అయితే బూర్జువా సమాజపు వేరు వేరు వర్గాల మాదిరి సాగలేదు ఈ ఉద్యమం. "తమ స్వంత" కేవలం ఆర్థిక నినాదాలతోనే గాక, మొత్తం ప్రజలందరి విప్లవ పతాకను విను వీధులకు ఎగరేశారు. మొత్తం ప్రజలు అందరి తరపున వారిని జాగృతమొనర్చే లక్ష్యంతో, స్వేచ్ఛను వాంఛించే, దానికై పోరాడగల అన్ని వర్గాలను పోరాటంలోకి ఆకర్షించేందుకు వారి ఉద్యమం సాగించారు." చేశారు. విప్లవకర డిమాండ్లకు మద్దకుగా 3 లక్షల మంది కార్మికులు నమ్మె జేచారు.
1913 మేడే ప్రదర్శనలను అభివర్ణిస్తూ రాజకీయ పోరాటాలలో కార్మిక వర్గ నాయకత్వ పాత్రను నొక్కి వక్కాణించారు. “రష్యన్ కార్మికవర్గ మేడే కార్యాచరణ మరోసారి వస్తోంది. రేగాలో వారు మొదట రిహార్సల్స్ వేశారు. ఆ తరువాత మే ఒకటవ తేదీన కృతనిశ్చయమైన కార్యాచరణకు పూనుకున్నారు. సెంట్ పీటర్ బర్గ్ లో... రానున్న విప్లవ కర్తవ్యాలన్నీ మరో సారి వైభవో పేతంగా ముందుకొచ్చాయి. అగ్ర శ్రామివర్గ శక్తులు దానికి నాయ కత్వం వహిస్తున్నాయి. వందలాది పాత విప్లవకారుల కెంతో ఆహ్లాదం కలిగి స్తుంది. హంతకుల నిర్బంధాలు, స్నేహితులు ఏకాకులను చేసినా వారు ఓడిపో లేదు, కుంగిపోలేదు. నూతన తరం ప్రజాస్వామిక శక్తుల, సోషలిస్థులముందు వారు తలెత్తుక నిలబడుకున్నారు."
మేడేనాటి ఘటనలను, ఆనాడు సాగిన దౌష్ట్యాన్ని వర్ణిస్తూ "మేడేకి వారాల ముందే ప్రభుత్వం నివ్వెరపోయింది. మానసిక శక్తి కోల్పోయింది. ఇకఫ్యాక్టరీలకు యజమానులైనా వారు తమకసలు మానసిక ప్రతిస్పందనే లేని వారిలా ప్రవర్తించారు. రాజధానిలోని కార్మికుల జిల్లాలలో జరిగిన ఆరెస్టులు, రోధనలు ఆ ప్రాంతాలను తల్లకిందులు చేసినట్లు కనిపిస్తున్నది. ఈ కేంద్రాల కన్నా రాష్ట్రాలు వెనుకబడుతున్నట్లు లేదు. ఇబ్బందులు పడుతున్న ఫ్యాక్టరీ యజమానులు సమావేశాలు జరుపుతున్నారు. విరుద్ధమైన నినాదాలు చేపడు తున్నారు. ఒకసారి కార్మికులను శిక్షిస్తామని, లాకౌట్లు చేస్తామని బెదిరిస్తు న్నారు. మరొకసారి ముందుగానే సౌకర్యాలు యిస్తామని లాలిస్తున్నారు. వని నిలుపుదలకు తామే అంగీకరిస్తామని అంటున్నారు. ఇంకొకసారి దౌర్జన్యాలు జరవమని ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తారు. అధికార సెలవు దినాలలో మేడేని గూడా చేర్చమని అభ్యర్థిస్తారు.
"పోలీసు అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తించినా, పారి శ్రామిక నివాస ప్రాంతాలను "అణగదొక్కినా", "ఈ మధ్యనే తయారైన అనుమానితుల"ను నిచ్చలవిడిగా అరెస్టులు చేసినా, ఏమీ ప్రయోజనం కనిపించలేదు. జార్ ముఠా చేతగాని క్రోధం చూచి కార్మికులు నవ్వుకుంటున్నారు. పెట్టుబడిదారీ వర్గ నిర్వీర్యతను హేళన చేస్తున్నారు. ప్రభుత్వం వినాశకరమైన దయనీయమైన “ప్రకటనలను" ఖండిస్తున్నారు. వ్యంగ్య గీతాలు రాస్తున్నారు కార్మికులు. ఆ పాటలు ఆ నోటా ఆ నోటా అందరిలోకి వ్యాపిస్తున్నాయి. చేతితో రాసి పక్క వారికి అందిస్తున్నారు. ఆకాశంనుండి పూడిపడినట్లు ఎప్పటికప్పుడు కొత్త కర పత్రాలు వచ్చిపడుతున్నాయి. అవి సొంపుగా లేవు. కాని విషయం సూటిగా, క్లుప్తంగా వుంటున్నది. నమ్మెలకు, ప్రదర్శనలకు పిలుపునిస్తున్నారు వాటిలో. ప్రజఁకు సూచనలు అందుతున్నాయి.
వాటిద్వారా గతంలో ప్రజల గుండెలలో మోగిన విప్లవ నినాదాలను గుర్తు చేస్తున్నారు. 1905లో నిరంకుశత్వానికి, రాచరికానికి వ్యతిరేకంగా ప్రజా దాడులకు నాయకత్వం వహించిన సోషల్ డెమోక్రాట్లు రూపొందించిన నినాదాలు అవి. ఎలాంటి కత్తిరింపులు లేకుండా ప్రచారమౌతున్నాయి.
సోషల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వాన, లెనిన్ నేత్రుత్వంలో ప్రతి మేడే, పాలకవర్గాలకు ఒక పీడకలలా పరిణమించింది. మొత్తం ప్రజలక అదొక మహా సంస్థగా, ఉద్రిక్తతా భావ ప్రదాయినిగా తయారైంది.
* 1914 సామ్రాజ్యవాద యుద్ధం- కూలిపోయిన
సంస్కరణవాదం.
మొదటి సామ్రాజ్యవాద యుద్ద బద్దలెంది. బోల్షివిక్ పార్టీ జార్ ప్రభువుల సామ్రాజ్యవాద యుద్ధాన్ని వ్యతిరేకించింది. యుద్ధ
నంక్షోభాన్ని విప్లవ ప్రయోజనాలకు వాడుకోవాలని నిర్ణయించింది. అధికారం స్వాధీనం చేసుకునేందుకు వినియోగించాలని భావించింది. ప్రారంభంలో ఎనలేని దౌర్జన్యాన్ని ఎదుర్కొన్నది.
కార్మికవర్గంలోని సంస్కరణవాదుల నుండి వ్యతిరేకత వచ్చింది. యుద్ధాన్ని వ్యతిరేకించాలనే అంతర్జాతీయ సాంప్రదాయా లకు కట్టుబడి, తుదకు జార్ను కుల ద్రోయడంలో విజయవంతులైనారు. పెట్టుబడిదారీ పాలన కూలగొట్టారు. ప్రపంచంలో మొదటి సోషలిస్టు రాజ్యాన్ని ఏర్పర్చి విజయ దుందుభి మ్రోగించారు.
దురదృష్టవశాత్తూ, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్సు, అమెరికా మొదలైన దేశాలలో ట్రేడ్ యూనియన్ల సంస్కరణవాద నాయకత్వపు వత్తిళ్ళతో పూర్వపు మేడే మిలిటెంట్ సాంప్రదాయాలు భగ్నమైనాయి. పెట్టుబడిదారీ విధానాన్ని కూలగొట్టి, సోషలిజపు ఉషోదయాన్ని సాధించడంలో తన వర్గ శక్తి, యుక్తులను బేరీజు వేసుకునే దినంగా గాక మేడేని ఒక సాధారణ సెలవుదినంగా మార్చివేశారు.
మేడే నిర్వహణకు నమ్మెను ఒక పద్ధతిగా విసర్జించారు ఆ నాయకులు. కేవలం మేడే కోసం ఫ్యాక్టరీ స్థాయి సెలవు కోసం ఎక్కువమార్లు కృషిచేశారు. తమ వర్గసంకర విధానాలను కొనసాగిస్తూ, క్రమేపి అంతర్జాతీయ దృక్పథాన్నే విసర్జించారు.
సామ్రాజ్యవాద యుద్దంపట్ల ఊగిసలాడే లేదా విప్లవ ప్రతీఘాత వైఖరులు చేపట్టారు. ఫలితంగా మొదటి ప్రపంచయుద్ధం బద్దలైనప్పుడు, దానిని వ్యతిరేకించి, కార్మికవర్గ అంతర్జాతీయ ఐక్యత పరిరక్షించే బదులు, సామ్రాజ్యవాద యుద్ధ నిర్వహణలో తమతమ సామ్రాజ్యవాద పాలకులకు మద్దతు ఇవ్వసాగారు.
ర ష్యా లో బోల్షివిక్ విభాగం, లెనిన్ నాయకత్వాన జర్మనీలో రోజా లగ్జెంబర్గ్ నాయకత్వానగల సోషల్ డెమోక్రసీ విభాగం మాత్రమే అంతర్జాతీయతకు కట్టుబడి, యుద్ధాన్ని వ్యతిరేకించారు. మేడే మిలిటెంట్ సాంప్రదాయాన్ని, దాని అంతర్జాతీయ స్వభావాన్ని కమ్యూ నిస్టులు విప్లవకర ట్రేడ్ యూనియన్లు మాత్రమే పరిరక్షించారు. అందువల్లనే రష్యన్ కార్మికవర్గం సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేశాయి. ఉమ్మడి ఉద్యమానికి ఘనవిజయం సాధించాయి.
సంస్కరణవాద విధానం కొనసాగింది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతకూడా సంస్కరణవాదులు తమఎత్తుగడలను మార్చుకోలేదు. పెట్టుబడిదారి ప్రభుత్వాలతో అంతకంతకూ ఎక్కువగా మీలాఖత్ కాసాగారు. కొన్ని తక్షణ డిమాండ్లపై కేంద్రీకరించే వారు. ఆ డిమాండ్లను పునశ్చరణ చేసేందుకు మాత్రమే మేడేని అంకితంచేసేవారు. మిలిటెంట్ సాంప్రదాయాన్ని, వర్గపోరాటాన్ని, తలెత్తుతున్న ఫాసిస్టు శక్తులతో పోరాడే తత్వాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత కమ్యూ నిస్టుల పైన మిలిటెంట్ కార్మికవర్గంపైనా పడింది.
జర్మనీలోని కమ్యూనిస్టు పార్టీ కార్మికవర్గంలోని మిలిటెంట్ సెక్షన్లు ఫాసిస్టు వ్యతిరేకపోరాటంతో కీర్తి సాధించుకున్నారు. ఫ్రెంచి, బ్రిటిష్ ట్రేడ్ యూనియన్ల సంస్కరణవాద నాయకులు హిట్లర్ ఫాసిజానికి వ్యతిరేకంగా సాగే సమిష్టి పోరాటంలో పాల్గొన లేదు. తమ తమ సామ్రాజ్యవాదప్రభుత్వాలు సోవియట్ యూనియన్కు వ్యతి రేకంగా సాగించే అసహ్యకరమైన అంతర్జాతీయ కుట్రలకు తోడ్పడసాగారు.
ఈ కాలంలో ఆమెరికాలోని ట్రేడ్ యూనియన్ ఉద్యమం మిలాఖతాదార్ల రౌడీ గుంపుల ఆధ్వర్యాన చేరింది. మేనేజిమెంట్లతో షరీకై కృషి చేయసాగారు. వారు. (ఏడాది కేడాది పాత కాలపు అంతర్జాతీయ దృక్పధం, మిలిటెంసీల గొంతు నులిమి వేశారు.)
దీని ఫలితంగానే యూరోప్, అమెరికాల కార్మికవర్గం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చాలావరకు తమకు అనువైనపాత్ర వహించలేదు. ఎక్కువ సందర్భాలలో సోవియట్ వ్యతిరేక కుట్రలలో సామ్రాజ్యవాదానికి, సహ కరించారు. అయితే ఈ సమయానికి ఆశియా, తదితర ఖండాలలోని అనేక దేశాలలో కార్మికవర్గ తత్వము, సోషలిస్టు విప్లవ చైతన్యము వ్యాపించాయి.
సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటకాలంలో ఈ దేశాలలో మేడే విప్లవ సాంప్ర దాయాలు సజీవంగా నిలిచాయి. ఫలితంగా ప్రపంచంలోనే అతి పెద్దదైన చైనా విప్లవం విజయ పతాకను ఎగురవేసింది. ఆ తరువాత కొరియా, వియ త్నాం లలో విప్లవాలు విజయవంతమైనాయి. విజయవంతమైన ఎర్ర నేన ప్రత్యక్ష ప్రభావంతో తూర్పు యూరోప్ జ్యాలలో సోషలిస్టు విప్లవం విజయ వంతమైంది.
సోవియట్ కార్మికవర్గము, ప్రజలు 1945 మేడేని ఘనంగా జరుపు కున్నారు. దాని చారిత్రక ప్రాధాన్యతలో ఏదీ మీరజాలదు. అదొక విశిష్ట వైభవంతో సాగింది. సోవియట్ సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ స్టాలిన్ ఆనాటి తన ఉపన్యాసంలో ఇలా అన్నారు. ప్రజలారా! మన దేశం ఈనాడు మేడే జరుపుకుంటున్నాం. ఇది కార్మికవర్గ అంతర్జాతీయ పండగ. "మహత్తర దేశభక్త యుద్ధం విజయవంతంగా పూర్తిఔతున్న సందర్భంగా మన మాతృభూమి మన ప్రజలు ఈ ఏడు మేడేని జరుపుకుంటున్నారు.
"మాస్కో, లెనిన్ గ్రాడ్, గ్రోడ్నీ, స్టాలిన్ గ్రాడ్ల ముంగిట శత్రు దాడులను తిప్పికొడుతున్న దుర్భర దినాలు పోయాయి. అవి ఇక తలెత్తవు. జర్మనీ గడ్డపైన శత్రుసైన్యాలను మన విజయ సైన్యం నాశనం చేస్తున్నది. బెర్లిన్ దాటారు. ఎల్బేనదిని అధిగమించి ఈ శత్రు వినాశన కార్యక్రమం సాగిస్తున్నారు. హిట్లర్ జర్మనీ పతనం ఇక రోజుల్లోకి వచ్చింది.”
ముందుకాలపు వర్గసాంప్రదాయం. అంతర్జాతీయతా సౌహార్దతలు ఎక్క డైతే నిలబెట్టబడ్డాయో అక్కడే కార్మికవర్గం అతివేగంగా పురోగమించిందని స్పష్టమౌతూనే వుంది. ఇతరదేశాలలో సంస్కరణ వాదనాయకులు దానికి ద్రోహం చేశారు. సామూహిక హత్యలు, ఉరితీతలు, చిత్రహింసలు సాగినా కార్మికవర్గం అపూర్వమైన విజయాలను సాధించింది. మూడవవంతు ప్రపం చంలో పెట్టుబడిదారీ విధానాన్ని తుడిచి పెట్టింది.
“హే మార్కెట్" ఘటన అనంతరం, వందసంవత్సరాల తరువాత మన కళ్ళకుకట్టే దృశ్యం ఇది. ఈ శతాబ్ది దినాన, ఆనాటి మహత్తర త్యాగాలనే గాదు. అమర వీరుల స్మృతులనే గాక. అంతర్జాతీయ కార్మికవర్గ మహత్తర విజయాలను సహితం స్మరించు కోవాలి. తద్వారా మన దేశంలో సోషలిజానికిసాగే మహా ప్రస్థానాన్ని మరింత వేగంగా సాగించగలం.
* నూతన పరిస్థితికి ప్రతిస్పందన .
జీవితము, వర్గ వాస్తవాలు మన వెన్నుతడుతున్నాయి. పశ్చిమ యూరోప్ సంస్కరణవాద ట్రేడ్ యూనియన్లు సహితం అణు యుద్ధ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ ప్రమాదానికి వ్యతిరేకంగా మాట్లాడక తప్పడంలేదు. మేడే సభలలో తమ నిరసనను ప్రకటించినా లేకున్నా. యుద్ధ ప్రమాదాన్ని వారు విస్మరించలేకుండా వున్నారు. తమ వార్షిక సభలలో దానిని ఎదిరించక తప్పడంలేదు. ఈ సంఘాల నాయకులు యుద్ధానికి బాధ్యత తమ తమ సామ్రాజ్యవాద ప్రభుత్వాల ముంగిట వేయలేకున్నారు. సోవియట్ పై నింద మోపేందుకు వెనకాడటంలేదు.
అయితే సాధారణ కార్మిక నమూ హాలు చొరవ తమ చేతికి తీసుకున్నాయి. తమ నాయకత్వం వ్యతిరేకించినా లక్షలాది పాల్గొంటున్న శాంతి ఉద్యమ శ్రేణుల్లో వారు చేరుతున్నారు. బ్రిటిష్ గ్రేడ్ యూనియన్ కాంగ్రెస్వంటి బలమైన సంస్థ యుద్ధానికి తన పరిపూర్ణ వ్యతిరేకతను వ్యక్తంచేయాల్సి వచ్చింది. బ్రిటిష్ లేబర్ పార్టీ తన కాన్ఫరెన్స్లో ఏకపక్ష అణు నిరాయుధీకరణకు అనుకూలంగా ఓటు చేసింది. అణ్వాయుధాల ఫలితంగా అంతర్జాతీయ ఐక్యతా భావం, అంతర్జాతీయ తత్వం తిరిగి ఆవిర్భవిస్తున్నాయి. అంతర్జాతీయ ఘర్షణలను వ్యతిరేకించాలనే
పూర్వ సాంప్రదాయం తిరిగి పునరుద్ధరింపబడుతున్నది. ఈ దేశాలలో కార్మికవర్గంపై అత్యంత ప్రభావంగల సోషలిస్టుపార్టీలు తమ పాత సంస్కరణ వాద ఆటలనే ఆడుతున్న విషయం నిజం. సోవియట్ వ్యతిరే కత కలిగివున్నదీ నిజమే. తమ ప్రవర్తన ఆచరణల ద్వారా యుద్ధ సమస్య పై గూడా కార్మికవర్గ శ్రేణులను చీల్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్న మాటా వా స్తవమే.
*:మహత్తర కాంతి శక్తులు.
అయితే మేడే అంతర్జాతీయతా సాంప్రదాయలను కాపాడుతూ ఓట మెరుగని, ఒక మహా శక్తి తలెత్తింది. అన్ని సోషలిస్టు దేశాల కార్మిక వర్గము, ఈ దేశాల ప్రజలే ఆ మహా శక్తి కోట్లాది ప్రజలతో కూడినది ఆ శక్తి. కార్మిక వర్గ అంతర్జాతీయ ఐక్యతను కాపాడేందుకు సహోదరుల మధ్య యుద్ధాన్ని వ్యతిరేకించేందుకు అలాంటి శక్తి మునుపేనాడూఎర్పడలేదుకార్మిక వర్గ అంతర్జాతీయ ఐక్యతా పరి రక్షణకు శక్తివంతమైన సోషలిస్టు రాజ్యాల
అండ గూడా గతంలో ఏనాడూ లేదు. అది ఈనాటి అనుకూల పరిస్థితి.
ఈ మహత్తర శక్తికి అండగా ప్రపంచ కార్మిక సమాఖ్య పతాకం కింద సమీకృతులైన లక్షలాది పెట్టుబడిదారీ, మూడవ ప్రపంచ దేశాల కార్మిక వర్గం వుంది. ఆ పతాకం కిందనే ప్రపంచ శాంతి, అంతర్జాతీయ ఐక్యతకై నిరంతరం నికరంగా పోరాడే సోషలిస్టు దేశాల కార్మిక వర్గమూ వుంది. ఈ శక్తికి ప్రపంచ శాంతి ఉద్యమం అండదండలు కలిగిస్తున్నది.
ఇవీ ఈనాడు కార్మికవర్గ అంతర్జాతీయ ఐక్యతను కాపాడేందుకు గల మహా శక్తివంతమైన శక్తులు. అయినా ప్రపంచ యుద్ధ ప్రమాదం వెన్నాడు. తోంది. యుద్ధ కాముకుల ప్రయత్నాలను వమ్ము చేసేందుకు అన్ని సెక్షన్ల కార్మిక వర్గము తన కృషిని రెట్టింపు చేయాలని శత వార్షికోత్సవం పిలుపు నిస్తున్నది.
* భారతదేశంలో మేడే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి