మేడే - నిర్దిష్టమైన విప్లవ క ర్తవ్యాలు.
* మేడే - నిర్దిష్టమైన విప్లవ క ర్తవ్యాలు. మేడే అంటే కేవలం అంతర్జాతీయ సౌహార్ద్రతను జనరల్ గా ప్రకటన చేయమని అర్ధంకాదని గూడా లెనిన్ కార్మికులకు చెప్పారు. ఆయా దేశాలలో కార్మికులు ఎదుర్కొంటున్న నిర్దిష్టమైన విప్లవ కర్తవ్యాలకు అంకితం కావాలి. విప్లవకర ప్రాధాన్యతగల తక్షణ ఆర్థిక కోర్కెలను, అంతర్జాతీయ సౌహార్దత సోషలిజంపట్ల జనరల్ గా వాంఛను కలిపి ప్రకటించడం సరిపోదు. సోషలిజం లక్ష్యాన్ని చేరుకునేందుకు, కార్మికవర్గం తాను ఎదుర్కొంటున్న నిర్దిష్ట విప్లవ సమస్యలను పట్టించుకోవాలి. అందువల్ల మేడే సభలలో పెట్టుబడి దారీ విధానానికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో భాగంగా ఈ సమస్యలను లేవనెత్తడం అవసరం, ఇది 1902లో నార్తరన్ లీగ్ కు రాసిన తన లేఖలో లెనిన్ చెప్పింది. "మనదేశంలో మేడే ప్రదర్శనలు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, రాజకీయ స్వేచ్ఛకోనం జరిగే ప్రదర్శనగా గూడా తయారైందని గూడా చేర్చి వుండా ల్సింది. ఆ పవిత్ర దినం గురించిన అంతర్జాతీయ ప్రాధాన్యతను ఎత్తి చూపడంతో సరిపోదు, దానిని కీలకమైన జాతీయ రాజకీయ డిమాండ్లతో జత చేయాలి. (సంపూర్ణ రచనలు 6వ భాగం పేజీ 168. 1903లో రానున్న మేదే సందర్భంలో సహితం లెనిన్ అదే అంశాన్ని నొక్కి చెప్పారు. ...