మార్క్స్ జీవితం Life of Marx


                       Karl Marx
మార్క్స్ కారల్ హెన్రిచ్ 5 మే, 1818 ట్రయర్ లో జన్మించి 14 మార్చి, 1883లో మరణించారు. గొప్ప సామాజిక శాస్త్రవేత్త. చరిత్రకారుడు. ప్రభావశీల విప్లవకారుడు. సామ్యవాద చింతనాపరుడు. తండ్రి హెన్రిచ్. తల్లి హెన్రెట్టా

జర్మనీలోని మొసెల్లీ నదీ తీరాన గల ట్రయర్ పట్టణంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి, తాత, ముత్తాతలు వంశపారంపర్యంగా యూదు మత గురువులు. 17 సంవత్సరాల వయసులో బాస్ విశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర శాఖలో చేరాడు. ఇక్కడ ఉండగా కాల్పనిక భావజాల ప్రభావానికి లోనయ్యాడు. మరుసటి సంవత్సరం న్యాయశాస్త్రం 
        Berlin University, Germany
అభ్యసించడానికి బెర్లిన్ విశ్వ విద్యాలయంలో చేరాడు. ఇక్కడ 4 సంవత్సరాలు ఉన్నాడు. కాల్పనిక భావజాలం వదలి హెగెల్ భావవాదంవైపు మరలాడు.

తర్వాత యువ హెగెలియన్ల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఇది స్ట్రాస్, బ్రూనో బాయర్ పాల్గొన్న ఉద్యమం. వీరు ప్రష్యా ప్రభుత్వ వ్యతిరేకులు మార్క్స్ ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యాడు. విశ్వవిద్యాలయ చదువుకు ప్రభుత్వం అడ్డుపడింది. అటుపై మార్క్స్ పత్రికా రచనవైపు సాగాడు. 1842లో కొలోన్ లో ఒక పారిశ్రామికవేత్త 
          reanish zeeting newspaper
ప్రారంభించిన “రేనిష్ జీటింగ్” వార్తా పత్రికకు సంపాదకు డయ్యాడు. ఆర్థిక సమస్యలపై తీవ్రమైన వ్యాసాలు ఈ పత్రికలో వ్రాసేవాడు. ఫలితంగా పత్రికను ప్రభుత్వం నిషేధించింది. మార్క్స్ పారిస్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.

1843లో మార్క్స్ పారిస్ చేరాడు. జర్మన్ కార్మికులను, సామ్యవాద భావాలు గల వివిధ గ్రూపులను కలిసాడు. కొద్దికాలమే నడచిన మరో వార్తా పత్రికను నిర్వహించాడు. కొత్తగా మొలకెత్తిన సామ్యవాదానికి జర్మనీ దేశపు తీవ్రవాద యువ హెగేలియన్లకు వారధిగా పనిచేయడం ఈ పత్రిక ఉద్దేశ్యం. పారిస్ వచ్చిన కొద్ది నెలలకే అచంచల విశ్వాసం గల కమ్యూనిస్టు అయ్యాడు. ఇక్కడే పుంఖాను పుంఖంగా వ్యాసాలు వ్రాయడం మొదలుపెట్టాడు. ఆ రాతలే -
            1844 ఆర్థిక తాత్విక రాత ప్రతులు

 1844 ఆర్థిక తాత్విక రాత ప్రతులు (ఎకనామిక్ అండ్ ఫిలసాఫిక్ మాన్యుస్క్రిప్ట్). వీటిని మార్క్స్ తొలి రచనలనీ, పారిస్ మాన్యుస్క్రిప్ట్ అనీ అంటారు. మార్క్పై ప్యూయర్బా ప్రభావం వుంది. పెట్టుబడిదారి విధానంలో పరాయీకరణ స్వభావానికి కమ్యూనిస్టు సమాజంలో సమష్టి సహకారం శ్రమ స్వభావానికి గల తేడాపై ఆధారపడి కమ్యూనిస్టు సిద్దాంతానికి రూపురేఖలు దిద్దాడు. ఇక్కడే మార్క్స్, ఏంగెల్స్ ల స్నేహ బంధం ఏర్పడింది. అది జీవితాంతం కొనసాగింది

184 చివరిలో మార్క్స్ ను పారిస్ నుండి ప్రభుత్వం బహిష్కరించింది అక్కడనుండి ఏంగెల్స్ తో బ్రస్సెల్స్ వెళ్ళాడు. 
         Brussels, capital of Belgium

ఇలా 3 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఇక్కడే మార్క్స్ చరిత్రను లోతుగా అధ్యయనం చేసి వివరించాడు. ఇదే గతితార్కిక చారిత్రిక భౌతికవాదంగా ప్రసిద్ధికెక్కింది. దీనినే మార్క్స్  తన  "జర్మన్ ఐడియాలజీ" లో 

                   German ideology
రాశారు. ఇది మార్క్స్ మరణించిన తర్వాత ప్రచురితమైంది. దీని మూల భావన - ఉత్పత్తిని నిర్ధారించే ఉత్పత్తి విధానాలపై మానవుని స్వభావం ఆధారపడి వుంటుంది. వివిధ రకాల ఉత్పత్తి విధానాలను మార్క్స్ గుర్తించాడు. ప్రస్తుత పెట్టుబడిదారి విధానం కూలిపోతుందని సూచించాడు. దానిస్థానంలో కమ్యూనిజం వస్తుందన్నాడు. రచనలు చేయడం మాత్రమే కాదు మార్క్స్ రాజకీయ కార్యాచరణలో కూడా పాల్గొన్నాడు. మితిమీరిన ఆదర్శవాదం గల బ్రౌన్ 
            poverty of phylosophy

 సోషలిజాన్ని “పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ” అనే గ్రంథంలో విమర్శనాత్మకంగా విశ్లేషించాడు. కమ్యూనిస్టు లీగ్ లో చేరాడు. దీనిలోని సభ్యులు జర్మనీ నుండి వచ్చిన కార్మికులు. 1847 చివరిలో కమ్యూనిస్టు లీగ్ కాన్ఫరెన్స్ జరిగింది. మార్క్స్, ఏంగెల్స్ లను "మ్యానిఫెస్టో" వ్రాయమని కాన్ఫరెన్స్ తీర్మానించింది. 
        communist manifesto
1848లో కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఐరోపాలో విప్లవాగ్నులు చెలరేగిన సమయమది. ప్రథమ విప్లవం ప్రజ్వరిల్లిన ఫ్రాన్స్ కు మార్క్స్ మళ్లీ 1848లో వెళ్ళారు. తిరిగి జర్మనీ వచ్చారు. కొలోన్లో “రేనిష్ జీటింగ్"ను తిరిగి ప్రారంభించారు. ఈ పత్రిక ప్రజాతంత్ర తీవ్రవాద ధోరణులు కలిగి వుందని ప్రష్యా ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది. సంపాదకునిదీ అదే పరిస్థితి. “నిద్రలేని సుదీర్ఘ రాత్రుళ్ళు" గడపటానికి మే 9, 1849నాడు తిరిగి లండన్ వెళ్ళాడు.

సమయం ఆశావహంగా వుంది. ఐరోపాలో విప్లవాగ్నుల కొత్త మంటలు లేచాయి. పునరుద్ధరింపబడిన కమ్యూనిస్టు లీగ్ లో చేరాడు. 1848లో ఫ్రాన్స్ లో జరిగిన వర్గపోరాటాలు, లూయిస్ బోనాపార్టీ పై సుదీర్ఘ వ్యాసాలు వ్రాసాడు. “ఒక నూతన సంక్షోభం తర్వాత మరొక నూతన విప్లవం” వస్తుందని విశ్వసించాడు. ఈ నూతన సంక్షోభానికి కారణాలు వెతికే మార్గంలో అర్థశాస్త్ర అధ్యయనానికి అంకితమయ్యాడు. 1850వ దశకం మొదటి భాగంలో మార్క్స్ నివసించింది 3 గదుల ఇల్లు, లండన్ వచ్చే నాటికి మార్క్స్ సంతానం 6 గురు పిల్లలు. అందులో 4గురు పుట్టిన కొద్ది కాలానికే చనిపోయారు. ఈ కాలంలో మార్క్స్ ఆదాయం కేవలం ఏంగెల్స్ సహాయం మాత్రమే. దీనికి తోడుగా న్యూయార్క్ డైలీకి విలేకరిగా పనిచేస్తూ వ్రాసే వ్యాసాలపై కొంత ఆదాయం వచ్చేది. 1857/58లో 800 పేజీల రాత ప్రతులు తయారుచేశాడు. ఇవి 1941లో “గుండిరిస్” అనే పేరిట ప్రచురిత మయ్యాయి. ఈ పని ఇక్కడే ఆగిపోయింది. మరొక పని - “అదనపు విలువ“ సిద్ధాంతంపై రచన సాగించాడు తనకు ముందున్న ఆడం స్మిత్, రికార్డోల సిద్ధాంతాలను విశ్లేషించి వివరించాడు. ఈ గ్రంథంలో “విలువ” “అదనపు విలువ దోపిడీ” సిద్ధాంతాలను మార్క్స్ ప్రతిపాదించాడు. పర్యవసానంలో పెట్టుబడిదారీ విధానం కూలిపోవడానికి లాభాల పతనం కారణమవుతుందని తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 2-3 సంపుటాల రాత ప్రతులు 1860లో పూర్తిచేశాడు. మార్క్ మరణించిన తర్వాతనే వీటిని పెట్టుబడి (capital)గా
ఏంగెల్స్ ప్రచురించాడు.
            capital
1864లో ఏర్పడిన అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థ జనరల్ కౌన్సిల్ కు మార్క్స్ ఎన్నికయ్యాడు. ఈ సంస్థ కార్యాలయం 1872లో లండన్ నుండి న్యూయార్క్ కు మారింది. ఈ కాలంలోనే జరిగిన అతి ముఖ్యమైన సంఘటన-పారిస్ కమ్యూన్. 

          Paris commune 1871 revolt
1871 లో ప్రభుత్వంపై పారిస్ ప్రజలు తిరుగుబాటు చేశారు. విప్లవకారుల చేతుల్లో పారిస్ 2 నెలల పాటు వుంది. తర్వాత ప్రభుత్వం యొక్క దారుణ అణచివేతకు బలైపోయింది. "ఫ్రాన్స్ అంతర్యుద్ధం” పేరుతో మార్క్స్ విశిష్టమైన కరపత్రాన్ని ప్రకటించారు

మార్క్స్ చివరి రోజుల్లో ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఇదివరకటిలా సంశ్లేషణాత్మక రచనలు చేయలేకపోయారు. అయినా సమకాలీన రాజకీయాలపై తన ప్రభావాలు ప్రకటించేవారు. జర్మనీలో ప్రభుత్వం పట్ల తన సహచరుల రాజీ 

            Gotha programme
ధోరణులను "గోథా ప్రోగ్రామ్” లో విమర్శించారు. పెట్టుబడిదారి దశను చేరకుండానే రష్యా కమ్యూనిజం దశలో ప్రవేశించే అవకాశముందని స్నేహితుడు వీరా జెసూలినక్కు వ్రాసిన ఉత్తరంలో చెప్పారు. భార్య, పెద్ద కూతుర్ల మరణం మార్క్స్ ను మరింత క్రుంగదీశాయి.

మానవమాత్రులకు ఎవరికైనా కష్టాలు, అనారోగ్యాలు సాధారణమే. మరణమూ అనివార్యమే. అయితే అవి వారి జీవిత స్మృతులుగా మిగలవు. ఏ మహత్తరమైన ప్రయోజనం కొరకు ఎవరు త్యాగాలు చేశారన్నదే మరువలేని జ్ఞాపకం. మార్క్స్ మానవ చరిత్రను లోతుగా పరిశీలించారు. చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం అన్నారు. వర్గపోరాటం ద్వారా వర్గరహిత సమాజ సాధనే
సర్వ మానవ జాతికి విముక్తిదాయకం అని చాటి చెప్పడమే మార్క్స్ జీవిత సారాంశం మార్క్సిజం మహత్తరమైంది. దాని ప్రబోధకుడే మహా మహోపాధ్యా యుడైనాడు. “ఈ ప్రపంచం గురించి వేదాంతులు రక రకాల వ్యాఖ్యానాలు చెప్పారు. అసలు జరగాల్సిన కర్తవ్యం దానిని మార్చడమే”. ఇది ఆయన సమాధి స్థూపంపై చెక్కిన సువర్ణాక్షరాలు. అవి మనల్ని కర్తవ్యంలోకి దిగమంటున్నాయి.

__ పొట్లూరి వెంకటేశ్వరరావు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..