సరళీకృత విధానాలకు అవసరమైన భావజాలాన్ని ప్రచారం చేసిన రాజీవ్

      (Pc siasat.com) Rajiv Gandhi
                     
        
      1984లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా దేశ పగ్గాలను చేబట్టారు. అతడు భారత ఆర్థికవ్యవస్థ, విజ్ఞానం , సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాలలో అనేక మార్పులను తీసుకవచ్చే ప్రయత్నం చేశాడు. శ్రీలంకలో అల్పసంఖ్యాకులైన తమిళుల సమస్యను పరిష్కరించడానికి రాజీవ్ గాంధీ ముందంజ వేశాడు. తమిళ సముదాయానికి దేశాంతర్గతంగా స్వయం ప్రతిపత్తిని కల్పించాలనే ఉద్దేశంతో  శ్రీలంక ప్రభుత్వానికి   అతడు మద్దతునిచ్చాడు. అయినప్పటికి అతని ఆ ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కలేదు.అది LTTE
నేత ప్రభాకరన్ ఆగ్రహానికి గురైంది.

 రాజీవ్ గాంధీ 'సోషలిజం పేరిట జాతీయకరణ విధానాలను జరిపించడం మానేసి ఆర్థిక వ్యవస్థలో సరళీకృత విధానాలను తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలు కేవలం ఉద్యోగాలు సృష్టించే పరిశ్రమలనీ, వీటిలో అసమర్థత పెరిగిందనీ, అందువల్ల ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. నూతన ఆర్థిక విధానాలు, నూతన పారిశ్రామిక విధానాలు, నూతన విద్యావిధానాలను ప్రకటించారు. సరళీకృత విధానాలకు అవసరమైన భావజాలాన్ని ప్రచారం చేశారు. 

        రక్షణ సామగ్రి ప్రత్యేకించి బోఫార్స్ కంపెనీ నుండి సుదూర లక్ష్యాలను ఛేదించే ఫిరంగుల కొనుగోలు సందర్భంలో జరిగిన అవినీతి ఆరోపణ కేసులో అతనిపై చాలా విమర్శలు వచ్చాయి.
రాజకీయ అవినీతి ఆ కాలంలో ఎన్నికల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఈ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షం ఓడిపోయింది. 

తర్వాత వివిధ పక్షాలు ఒక్కటై జనతాదళ్గా ఏర్పడింది. జనతాదళ్ ప్రభుత్వం కూడా సారాంశంలో ఈ విధానాలనే అమలుచేసింది. ఆ సందర్భంలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ భారతదేశ ప్రధానమంత్రి అయ్యారు.  

             V P Singh
ఇతర వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ విధానంలో అతని పాత్ర అత్యంత కీలకమైంది.మండల్ కమీషన్ ఏర్పాటు చేశారు.
ఆసమయంలో దానికి వ్యతిరేకంగా కమండలం
అందుకొని అయోధ్య రథయాత్ర అందుకున్నారు.దాంతో  అధికారపక్షంలోని అంతర్గత కలహాలమూలంగా అతడు ఎక్కువ కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగలేకపోయాడు. 1990లో చంద్రశేఖర్ భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. అతని ప్రభుత్వం కూడా స్వల్ప కాలమే నిలిచింది. 

1991లో ఎన్నికల ప్రచార వ్యవధిలో శ్రీలంకలోని లిట్టే (LTTE) అను సంస్థ రాజీవ్ గాంధీని హత్య చేసింది.  ఆయన పై సానుభూతి పవనాలు వీచి కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. దాంతో1991లో  పి.వి. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడింది. ఆయన నూతన ఆర్థిక విధానాల పేరుతో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చారు.
      2004లో రాజీవ్ గాంధీని న్యాయస్థానం బోఫోర్స్ అవినీతి ఆరోపణ నుండి నిర్దోషిగా తేల్చివేసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..