వైరుధ్యాలు ( వ్యతిరేకతలు)






హెగెల్ చెప్పిన 'వ్యతిరేకతల (వైరుధ్యాల)' నియమం అర్ధం ఇలా ఉంటుంది: 'ప్రతీ పదార్ధంలోనూ పరస్పర వ్యతిరేకతలు ఉంటాయి. వాటిలో ఘర్షణలు ఉంటూ, ఐక్యతలు కూడా ఉంటాయి. ఆ వ్యతిరేకతల వల్లనే
ఆ పదార్ధంలో చలనం సాగుతూ వుంటుంది. ఆ చలనం వల్ల, ఆ పదార్థ పరిమాణంలో, ఆ పదార్ధ స్వభావాన్ని బట్టి, దానిలో మార్పు ఎలా సాధ్యమో అలా జరిగి, ఆ పదార్ధంలో కొత్త గుణం ఏర్పడుతుంది.' 

హెగెల్ చెప్పిన నియమాల్లో ప్రధాన మైనది, మొదటిది వ్యతిరేకతలు.
'వ్యతిరేకత' అంటే, విరుద్ధత. అదే, వైరుధ్యం.
ఒక దానికి ఒకటి విరుద్ధంగాఉంటే, అదే వ్యతిరేకత.దానినే వైరుధ్యం అంటాం.


     pc:  Getty images
పగలూ రాత్రి, చలీ వేడీ, ఎండా వానా, వెలుతురూ చీకటి, నిన్నా నేడూ, నేడూ - రేపూ, నలుపూ - తెలుపూ, ఆడా మగా, పులి - మేకా, జననమూ - మరణమూ, ఇటువంటి జంటల్లో ఉండే రెండు అంశాలూ, ఒక దానికి ఒకటి వ్యతిరేకాలే. కానీ, ఇటువంటి వ్యతిరేకతలు, ప్రకృతిలో సహజమైనవి. ఈ వ్యతిరేకతలు ఎప్పుడూ ఉండేవి.
        p c:  pinterest
ఇంకో రకం వ్యతిరేకతల్ని చూడండి.
 కలిమీ - లేమీ, రాజూ - పేదా, సేవకత్వం యజమానితనం, మంచీ - చెడ్డా, తప్పు ఒప్పు, కష్టం - సుఖం, ఈ కులం ఆ కులం - ఈ మతం ఆ మతం , ఈ వ్యతిరేకతలు ఏమిటి? ఇవి, ప్రకృతి వ్యతిరేకతల వంటివి కావు. ఇవి, వాటి లాగ సహజంగా ఉద్భవించేవి కావు. ఇవి, మనుషులు నివసించే సమాజంలో అసహజత్వం' అనే ఒక కారణం వల్ల ఏర్పడి సాగుతూ వున్న అసహజ వ్యతిరేకతలు. మానవ సంబంధాల్లో ఆ అసహజత్వం, 'శ్రమ దోపిడీ' అనేది. దాని వల్లనే, మనుషుల మధ్య 'యజ మానితనం సేవకత్వం' అనే అసహజ వ్యతిరేక తలు మొదలయ్యాయి. ఇక, సమాజంలో ప్రతీ రంగంలోనూ, ప్రతీ కోణంలోనూ, ఏర్పడే ప్రతీ వ్యతిరేకతా, ఆ మొదటి దాని ఫలితమే. ఇవి ప్రకృతి వ్యతిరేకతల వంటి సహజత్వాలు కావు కాబట్టి, ఈ వ్యతిరేకతల్ని తీసివెయ్యడం సాధ్యమే. వీటి అసహజ కారణాన్ని తీసివేస్తే, ఈ అసహజ వ్యతిరేకతలన్నీ అంతరిస్తాయి. ఈ వ్యతిరేకతల్ని రద్దు చెయ్యవలసిందే గానీ,వాటికై అవే రద్దు కావు.

       'ప్రకృతి సహజం' కానీ ఏ వ్యతిరేకత అయినా, 'అసహజం' అయినదే. కానీ, దోపిడీ సమాజాల్లో ఏర్పడే ప్రతీ వ్యతిరేకతా శతృ వ్యతిరేకతే కాదు. అదే సమాజంలో, అనేక మిత్ర వ్యతిరేకతలు' కూడా ఉంటాయి. ఒకే రకం సరుకుల్ని తయారు చేయించి అమ్మి 'లాభాలు' సంపాదించే ఇద్దరు యజమానుల మధ్య కూడా వ్యతిరేకతలు ఉంటాయి. కానీ అవి, మిత్ర వ్యతిరేకతలు. ఒకే యజమాని దగ్గిర, ఒకే పని స్తలంలో పని చేసే శారీరక శ్రమల పని వాళ్ళకీ, మేధాశ్రమల పని వాళ్ళకి మధ్య కూడా వ్యతిరేకతలు ఉంటాయి. అవి కూడా మిత్ర వ్యతిరేకతలే. కానీ, యజమాను లకూ పని వాళ్ళకూ మధ్య ఉండేవి అయితే, ఎప్పుడూ శతృవ్యతిరేకతలే.

సమాజంలో ఏర్పడే వ్యతిరేకతల్లో, 'శత్రు' అనీ, 'మిత్ర' అనీ, ఎన్ని రకాల పాత - కొత్త వ్యతిరేకతలు ఉన్నా, వాటికి కారణం, ఆ సమాజం శ్రమ దోపిడీ సమాజంగా ఉండడమే ఈ శతృ - మిత్ర తేడాల విషయం మనకి ఇక్కడ ఇంత కన్నా అవసరం లేదు. మన దృష్టి అంతా 'శత్రు వ్యతిరేకతల' మీద మాత్రమే ఉండాలి.

 
తర తరాలుగా మను షులు నివసిస్తూ ఉన్న సమాజం, దోపిడీ సంబం ధాల సమాజం. కాబట్టి, సమాజ సంబంధాల్లో ఏర్పడే వైరుధ్యాలనే మనుషులు పరిశీలించాలి. 
కలిమీ - లేమీ' జంటని తీసుకుందాం. ఇతరుల శ్రమల్ని దోచే వాడి దగ్గరే 'కలిమి'

కూడుతుంది. కూడుతూ వుంటుంది. దోపిడీకి గురయ్యే వాడి దగ్గర 'లేమి' పెరుగుతుంది. పెరుగుతూ వుంటుంది. శ్రమ దోపిడీ జరిగే సంబంధాలే లేకపోతే, ఆ కలిమి - లేమీ పరి స్తితులు మాయమై, భాష నించి ఆ రెండు మాటలూ కూడా అంతరిస్తాయి. 'కలిమి' పోయి నప్పుడు "లేమి' మిగిలి ఉండడమో, లేమి పోయినప్పుడు కలిమి మిగిలి ఉండడమో అలా జరగవు. మనుషుల మధ్య, శత్రు- మిత్ర వ్యతిరేకతల జంటల్లో, ఏ జంటలో అయినా ఒక అంశం పోతే, రెండో అంశం కూడా పోతుంది.

మంచీ - చెడ్డా' జంటని చూడండి! ఇది ప్రకృతి వ్యతిరేకత కాదు. సమాజంలో ఏర్పడే వ్యతిరేకతే. మంచి చెడ్డలు, సమాజానికి సంబంధించినవే. ప్రకృతిలో అయితే, మంచి చెడ్డలూ, తప్పొప్పులూ, ఉండవు. ప్రకృతిలో జరిగే ప్రతి చర్యా, ప్రకృతి అంశాల మధ్య ప్రతి సంబంధమూ, సహజత్వాలే. కాబట్టి, మంచి చెడ్డల్ని, తప్పొప్పుల్నీ, దోపిడీ సమాజపు వ్యతిరేక తలు గానే చూడాలి. ఈ వ్యతిరేకతలు రద్దు కావాలంటే, దాని మూల కారణాన్ని రద్దు చేసి సమాజ సంబంధాల్ని వ్యతిరేకతలు లేని మార్గం లోకి తిప్పడం తప్ప వేరే పరిష్కారం ఉండదు సంస్కరణలు గానీ, ఐక్యతలు గానీ, సాధ్యం కాని వ్యతిరేకతల్ని పూర్తిగా రద్దు చెయ్యవలిసిందే.

__ Ranganaayakamma
(తత్వశాస్త్రం నుండి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..