గతి తార్కిక పద్ధతి


1.వస్తుగతంగా పరిశీలన వుండాలి.

2.ఏదైనా ఒక వస్తువు మిగతా అన్నింటితో ఏర్పరచుకొన్న సంబంధాన్ని సమగ్రంగా
పరిశీలన చేయాలి.

3.ఆ వస్తువు యొక్క నిరంతర మార్పులో పరిశీలన చేయాలి

4.ఆ వస్తువులో వుండే విరుద్ధమయిన అంశాలను తెలుసుకోవాలి.

5.ఏదైనా వస్తువుగాని, విషయం గాని విరుద్ధ శక్తుల కలయికగానే చూడాలి.

6.ఈ విరుద్ధ శక్తుల యొక్క సంఘర్షణ పరిణామాన్ని పరిశీలించాలి. 

7. ఒక విషయం లేదా వస్తువులోని భాగాలన్నింటిని విడదీసి చూడాలి. మరలా కలిపి నిర్ణయానికి రావాలి

8.ఒక వస్తువులోని ప్రత్యేక అంశాలు, సాధారణంగా వున్న అంశాలను పరిశీలించాలి. 

9. ప్రతి వస్తువుకు నిరంతరం కొత్త అంశాలు, కొత్త సంబంధాలు ఏర్పడుతుంటాయి వీటిని పరిశీలించాలి.

10. బాహ్య విషయాల నుండి సారాంశంలోకి వెళ్ళే కొద్దీ ఆ వస్తువు సక్రమంగా అర్థమవుతుంది. 

11. పరస్పర సంబంధంలో కారణం ఫలితంగావచ్చు ఫలితం కారణం గావచ్చు. కార్యాకారణ సంబంధాలు తెలుసుకోవాలి.

12. పరిమాణాత్మకమయిన మార్పులు గుణాత్మక మార్పుకు కారణమవుతుంది. 

13. అన్ని అంశాలలో ఏది కీలకమైన అంశమనేది పట్టుకోవాలి. 
ఉదా:ఒక కార్యకర్తకు మంచి లక్షణాలు వుండి, రాజకీయ విశ్వాసం లేదనుకోండి. అతను పనికిరాడు. ఈ కీలక అంశాన్ని చూడటం చాలా ప్రధానం. అలాగే రాష్ట్ర మహాసభలో మనం తీసుకున్న కర్తవ్యాలలో ప్రధానమైంది (కీలకమైంది) వర్గపోరాటాలు. అది నెరవేర్చడం ద్వారా మనం ఇతర కర్తవ్యాలను నెరవేర్చగలుగుతాం. అలాగే కార్యకర్తలో అన్ని
లోపాలు లేకుండా కీలక లోపాన్ని మనం గుర్తించాలి.

14.నిర్దిష్ట పరిస్థితులను, నిర్ధిష్టంగా అధ్యయనం చేయాలి.అన్ని విషయాల లోనూవైరుధ్యాలు ఉంటాయి. అందులో అందులో అనుకూల, ప్రతికూల వైఖరుల రెండింటినీ అర్థం చేసుకొని పరిశీలించిన తరువాతే నిర్ణయానికి రావాలి. మనం సమస్యలు అన్ని కోణాల మండి చూడాలి. దాని వెనుక నుండి ముందు నుండి కూడా చూడాలి. ప్రజల అనుభవం, నాయకుల అనుభవం రెండింటినీ అన్వయింప చేయాలి.
ఇది నిర్మాణ సమస్యలలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక సమ్మె, ఎన్నిక
కార్యక్రమం, ప్రదర్శన, నిధి వసూలు, కార్యకర్తను అంచనా వేయడంలో ఈ పరిస్థితిని చూడపచ్చు - ప్రతి సందర్భంలోను, పరిస్థితికి సంబంధించి సంఖ్యాత్మక విశ్లేషణ చేయాలి. గణాంక
వివరాలు, శాతాలు సేకరించాలి.  - ప్రతి ప్రజా ఉద్యమంలోను, కార్యకర్తలు, మిత్రులు, శత్రువులు, న్యూట్రల్స్ ఎంతమందున్నారో అవి పరిశీలన, విశ్లేషణ చేయాలి. అప్పుడే మంచి ఎత్తుగడలు వేయగల్గుతాం.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..