మహిళల విముక్తి పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర


మహిళల విముక్తి కోసం పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర

 
   PC : Outlookindia.com
 1920 లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైన నాటి నుండి  "ఉద్యమాల లో  మహిళల భాగస్వామ్యం 
అనే ప్రశ్న" పై పార్టీ చర్చించింది.
       స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో  మహిళల పోరాటానికి సంబంధించి కమ్యూనిస్టులు  మూడు క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్నారు.అవి:

1. మహిళలను దోపిడీ నుండి విముక్తి చేస్తూ 
దాన్ని ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో భాగం చేయడం మొదటిది.

2. మహిళలకు పౌరసత్వం సాధించడం ,  కుల వ్యవస్థను రద్దు చేయడానికి పోరాటం రెండోది.

3. సంప్రదాయాలు, మత గ్రంథాలు, పెట్టుబడిదారీ సంస్కృతి _ఈ మూడు  మహిళలపై  జరిపే హింసకు వ్యతిరేకంగా పోరాటం మూడవది.

 
       స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా, శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహాలలోకి  పార్టీ మహిళలను సమీకరించింది.కార్మిక సంఘాలలో పనిచేస్తున్న కమ్యూనిస్టులు కార్మికవర్గ పోరాటం నిర్వహించేవారు.
      బొంబాయిలోని టెక్స్‌టైల్ మిల్లుల్లో,  షోలాపూర్  బీడీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు మరియు బీహార్, బెంగాల్ లోని పేద రైతు మహిళల వేతనాల కోసం, భూమి కోసం, గౌరవం కోసం వారి ప్రాథమిక సమస్యలపై కమ్యూనిస్టు లు
పోరాడేవారు.
   అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేతృత్వంలో ఇది జరిగేది.  ఇది1920 లో  కమ్యూనిస్టుల ప్రభావంలోకి వచ్చింది.  మొదటి నిర్వాహకులలో ఒకరైన సంతోష్ దేవి   AITUC లో చేరారు.ఆమె బెంగాల్ లోని జనపనార కార్మికులు, వారి కుటుంబాల మధ్య పని ప్రారంభించారు.  బొంబాయిలోని పార్వతి భోరే మరియు తరువాత ముప్పై మరియు నలభైల దశాబ్దంలో అహిల్య రంగ్నేకర్, ఉషతై డాంగే, విమల్ రనదివే మొదలైన వారు పాల్గొన్నారు.  1936 లో అఖిల భారత కిసాన్ సభ ఏర్పడటంతో  కమ్యూనిస్టులు పోషించిన ముఖ్యమైన పాత్రతో, రైతులు మహిళలు భూమి, గౌరవం సమస్యలపై పెద్ద ఎత్తునముందుకు వచ్చారు.  తెభాగా, తెలంగాణ, సుర్మా వ్యాలీ పోరాటం, ఇవన్నీ ఆర్థిక మరియు సామాజిక న్యాయం కోసం భారతదేశ శ్రామిక ప్రజలు చేసిన పోరాటంలో మైలురాళ్ళు. ఇందులో మహిళలు చాలా మంది  పాల్గొనేవారు.
         మహారాష్ట్రలోని థానేలోని వార్లి ఆదివాసులలో గోదావరి పరులేకర్  పని 1945 లో ప్రారంభమైంది.  భూస్వాముల క్రూరమైన దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటమది.వర్గ పోరాటంలో పాల్గొనడం ద్వారా, సమిష్టి శక్తి ద్వారా తమకు,  అణచివేతదారులకు మధ్య ఉన్న సామాజిక బంధనాలను తెంచినప్పుడు, దానిపై మాట్లాడటానికి వీలు కల్పించినప్పుడు, పోరాటంలో చేరిన ఆదివాసీ మహిళలు తమ పోరాట అనుభవాలను వివరించారు.  భూస్వాముల చేతిలో వారు ఎదుర్కొన్న భయంకరమైన క్రమమైన లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడిన విధానాన్ని వివరించారు.

            త్రిపురలో, దాసరత్ దేబ్ బార్మా నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ, అత్యంత దోపిడీకి గురవుతున్న గిరిజనుల్లో,ప్రత్యేకించి గిరిజన మహిళలలో అక్షరాస్యత ను, సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చింది.  ఇది బలవంతంగా భూస్వామ్య "టైటున్" సేకరణకు వ్యతిరేకంగా భారీ తిరుగుబాటుకు దారితీసింది. ముగ్గురు గిరిజన మహిళల బలిదానానికి దారితీసింది.

       మధ్యతరగతి  స్త్రీ , పురుషుల మధ్య గల  అసమాన సంబంధాల వల్ల మహిళలు 
ఉద్యమాల లోకి రావడంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారి రచనల ద్వారా ఇలాంటి అనేక సమస్యలు తెలిశాయి.సంప్రదాయ పద్దతిలో జరిగే   వివాహాలను ఆపాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే  పెళ్లయ్యాక వారి భాగస్వాములు పోరాటానికి మద్దతు ఇవ్వలేదు.  పుచ్చలపల్లి సుందరయ్య తన రచనలలో ఇలాంటి అనేక ఉదాహరణలు ఇచ్చారు.  
        మల్లు స్వరాజ్యం  చురుకుగా పాల్గొనేవారు.  మహిళలను మాట్లాడటానికి పార్టీ ఎలా ప్రోత్సహించిందో ఆమె వివరించారు.  ఇద్దరూ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటే వచ్చే ఇబ్బందులు, మహిళలు ఇంటి పని పంచుకోవడం వంటి విషయాలపై చర్చ జరిగింది.  పార్టీ సహాయం చేసిన  మహిళలు స్త్రీ సమానత్వం కోసం ఉద్యమంలో ఒక మార్గదర్శక పాత్ర పోషించారు.

 ముఖ్యమైన పాఠం ఏమిటంటే, వర్గ పోరాటం మహిళల  స్పృహను మారుస్తోంది. అయితే ఉద్యమంలో లైంగిక ఆధారిత వివక్ష కు సంబంధించిన అన్ని అంశాలతో పోరాడటం ద్వారా పోరాటం  సమానంగా విస్తరిస్తోంది.  ఇది వర్గ పోరాటాన్ని బలపరుస్తోంది. 
       అనేక దశాబ్దాల తరువాత, ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ప్రత్యేక వర్కింగ్ ఉమెన్స్ కమిటీలు మరియు ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించటానికి మార్గదర్శకుడు బిటి రనదేవ్. ప్రారంభ దశలో చాలా ప్రతిఘటనను ఎదుర్కొన్నాడు.  మార్క్స్ 'వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్' అని చెప్పినప్పుడు  కేవలం మగ కార్మికుల గురించి మాట్లాడటం లేదు.  మరో మాటలో చెప్పాలంటే, వర్గ పోరాటమనేది పెట్టుబడిదారీ విధానం లో సెక్స్ ఆధారిత వర్గ దోపిడీపై కూడా పోరాడాలి.


   ప్రారంభంలో కమ్యూనిస్టుల పని చాలావరకు సామాజిక సంస్కరణ మరియు దళితుల విముక్తి కోసం కుల వ్యతిరేక పోరాటాల రంగంలో ఉండేది.  ఇది  అణగారిన కులాల మహిళలపై పెద్ద ప్రభావాన్ని చూపింది.  అదే సమయంలో ఉన్నత కులాలలోని మహిళల నీచమైన స్థితిపై కూడా పోరాడారు.కేరళలో  ఇఎంఎస్ నంబూద్రిపాద్
నేతృత్వంలోని ఉద్యమం కూడా మంచి ప్రభావాన్ని చూపింది.
    అంబేద్కర్ ప్రవేశ పెట్టిన  హిందూ కోడ్ సంస్కరణ బిల్లు పై చర్చ జరిగినప్పుడు, దాని పోరాటాల సమయంలో, సంస్కరణ కోసం, మద్దతు కోసం జరిగిన పోరాటాలలో కమ్యూనిస్ట్ మహిళలు ముందంజలో ఉండటం తార్కిక పరిణామం.   హిందూ కోడ్ సంస్కరణ బిల్లు కోసం పోరాటం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటంతో ముడిపడి ఉంది.  నలభై దశాబ్దం నుండి యాభైల  వరకు, హిందూ చట్టాలలో సంస్కరణల సమస్యలో మహిళల  పోరాటాలను చవి చూసింది.
        కుల అణచివేతకు , కుల అసమానతలకు, వర్గ దోపిడీ , లింగ వివక్ష కు వ్యతిరేకంగా పోరాటాన్ని  కమ్యూనిస్టు మహిళలు స్థిరంగా నిర్వహించారు.  కులానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పని విధానం,అవగాహన ఎంతవరకు  ఉందో  అర్థం చేసుకోవడానికి హత్రాస్ కేసును ఉదాహరణగా చెప్పొచ్చు.
       కమ్యూనిస్ట్ భావాలు గల విద్యార్థులు  1936 లో  AISF  ఏర్పాటు చేశారు . మూడు సంవత్సరాల తరువాత, 1939 లో   బాలికల  కమిటీని ఏర్పాటు చేశారు.ఇందులో కనక్ ముఖర్జీ ఉన్నారుు. మొట్టమొదటి కన్వీనర్లలో ఒకరిగా మరియు చిట్టగాంగ్ ఆర్మరీ దాడిలో కథానాయిక కల్పనా దత్ కూడా ఉన్నారు.  వివిధ రాష్ట్రాల్లోని కమ్యూనిస్ట్ మహిళలు నలభైలలో అనేక రాష్ట్రాల్లో మహిళా సమితిని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు, ఉదాహరణకు కేరళ, తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్.  ముఖ్యంగా 1942 లో బెంగాల్‌లో, భయంకరమైన కరువు బెంగాల్‌ను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పేద మహిళల మధ్య పనిచేయడానికి ప్రధాన దృష్టితో కమ్యూనిస్ట్ మహిళలు మహిలా ఆత్మ రక్షా సమితిని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు.  

     1954 లో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఏర్పాటుకు రాష్ట్ర ఆధారిత మహిళా ఏ సమితి కలిసి వచ్చింది, ఇందులో కమ్యూనిస్ట్ మహిళలు ఇతరులతో కలిసి పనిచేశారు.  స్వాతంత్ర్య పోరాటం యొక్క సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లి, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యులోని అనేక రాష్ట్ర యూనిట్లు లేదా యూనిట్లు ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నుండి స్వతంత్రంగా పనిచేయడం ప్రారంభించాయి.  తరువాత 1981 లో, ఈ యూనిట్లు కలిసి విలీనం అయ్యి లెఫ్ట్ ఓరియెంటెడ్ ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్, ఇది భారతదేశంలో అతిపెద్ద మహిళా సంస్థగా అవతరించింది, ఒక కోటి మందికి పైగా మహిళల సభ్యత్వం ఉంది.  అయితే ఈ సంస్థలో కమ్యూనిస్ట్ మహిళలు పనిచేస్తున్నప్పటికీ, దీనిని కమ్యూనిస్ట్ మహిళల సంస్థగా వర్ణించలేము.  ఈ సంస్థ మహిళల విముక్తి పట్ల రాజకీయ విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఇది కమ్యూనిస్ట్ సంస్థ గా లేదు. దాని సభ్యుల్లో ఎక్కువ మందికి పార్టీ అనుబంధం లేదు.

  1964 లో సిపిఐ (ఎం) ఏర్పడటంతో  మహిళల విముక్తికి సరైన సైద్ధాంతిక స్పష్టత ఏర్పడింది.
2000 లో నవీకరించబడిన పార్టీ కార్యక్రమంలో, పీపుల్స్ డెమోక్రటిక్ ప్రోగ్రామ్ విభాగంలో ఒక ముఖ్యమైన అంశం చర్చించారు.దాంట్లో
 ‘పిల్లల సంరక్షణ , ఇంటి పనులలో తగిన సహాయక వ్యవస్థలు కుటుంబ నిర్మాణాలను ప్రజాస్వామ్యం చేసే ప్రయత్నంలో భాగంగా ఉంటాయి.’ అని పేర్కొన్నారు. 
     వ్యవసాయ విప్లవంలో భాగంగా కుల, లింగ వివక్షత కు వ్యతిరేకంగా పోరాటం గురించి ఒక నిర్దిష్ట సూచన ఉంది.  పార్టీ కార్యక్రమం   "బూర్జువా భూస్వామిక పాలన  ప్రతి రంగాలలో పితృస్వామ్యాన్ని శాశ్వతం చేసింది" అని చెప్పింది.  

    నియోలిబరల్ విధానాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో మహిళల యొక్క నిర్దిష్ట సమస్యలు మరియు డిమాండ్లు ఉన్నాయి.  పార్లమెంటులో  రాష్ట్ర అసెంబ్లీలలో సిపిఐ (ఎమ్) సభ్యులు మహిళలకు సమాన హక్కులు , న్యాయ చట్టాలను  తీసుకురావడంలో సరైన కృషి ఉంది.  
    
    భారతదేశంలో 
1.మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాటం, 2.యువతుల హక్కుల పరిరక్షణ 
3 స్వీయ ఎంపిక భాగస్వామ్యం చేయడానికి స్వయంప్రతిపత్తి  
4 స్వలింగ సంబంధాలను వివక్షపరచాలన్న డిమాండ్కు మద్దతు, 
5.మైనారిటీ మహిళల రక్షణ మరియు వారి హక్కులు  మొదలైన వాటి పట్ల
ఇతర పార్టీల మాదిరిగా కాకుండా సిపిఐ (ఎం) మహిళలకు మద్దతుగా ఒక వైఖరి తీసుకుంది.

 పశ్చిమ బెంగాల్, త్రిపుర మరియు కేరళలో మాదిరిగా సిపిఐ (ఎం) రాష్ట్రాలలో ప్రభుత్వాలను నడిపించినప్పుడు ఈ నిబద్ధత కనబడుతుంది.  కేరళలో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం మహిళల హోదాను పెంచడానికి అనేక విధాన జోక్యం చేసుకుంది.  స్వయం సహాయక బృందాల కుదుంబశ్రీ ఉద్యమంతో దేశంలో ప్రత్యేకమైనది.  శబరిమల వంటి సామాజిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లింది.  అంతకుముందు, బెంగాల్ , త్రిపురలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాలు విద్య మరియు ఆరోగ్య రంగంలో గణనీయమైన కార్యక్రమాలు చేపట్టాయి. ఇది మహిళల జీవితాల్లో మార్పు తెచ్చింది.  ముఖ్యంగా, బెంగాల్‌లో భూ సంస్కరణ ఉద్యమం ద్వారా పురుషులు, మహిళల పేరిట ఉమ్మడి పట్టాలు , ఒంటరి మహిళలకు పట్టాలు పంపిణీ చేయడం, ఆస్తి చట్టాలలో మార్పులు చేయడానికి చాలా ముందు భూమిలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం వంటి చట్టాలు చేశారు.  
   పార్లమెంటులో మూడవ వంతు మహిళల రిజర్వేషన్ల కోసం  ఉద్యమం జరుగుతోంది.
దశాబ్దాల క్రితం బెంగాల్‌లోని  వికేంద్రీకరణ పంచాయతీ వ్యవస్థ ద్వారా మహిళలకు మూడవ వంతు ప్రాతినిధ్యంతో జరిగింది.దీని ద్వారా పార్టీ నేతృత్వంలోని ఉద్యమాలు మహిళల్లోని అత్యంత పేద వర్గాల సంస్థలు నిర్ణయాధికారంలో ప్రాతినిధ్యం వహించాయి.  

   BJP-RSS  పాలనలో, మహిళల హక్కుల ను కాలరాసే సందర్భంలో, వారి హక్కుల పరిరక్షణలో కమ్యూనిస్టుల కృషి  మహిళలకు బలమైన మిత్రులుగా చేస్తోంది.

___బృందా కారత్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..