అంతరంగిక పోరాటం
పార్టీ అంతరంగిక పోరాటమనేది అత్యంత ప్రాధాన్యం గలది. బాధ్యతాయుతమైనది అన్న విషయాన్ని కామ్రేడ్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దీనిని నిర్వహించేటప్పుడు మనం నిక్కచ్చిగానూ, అత్యంత బాధ్యతాయుత వైఖరితోనూ ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు. పార్టీ అంతరంగిక పోరాటాన్ని నిర్వహించేటప్పుడు మనం ముందుగా పార్టీ వైఖరికి పూర్తిగా కట్టుబడి ఉండాలి. పార్టీ ప్రయోజనాలకు నిస్వార్థంగా తోడ్పడే వైఖరిని చేపట్టాలి.
1."ఇతరులకు చెప్పేముందు మనలను మనం సరిదిద్దుకోవాలి. "
ఇతర కామ్రేడ్స్ తమ పొరపాట్లను గుర్తించి సమస్యల పట్ల సదవగాహన కలిగివుండేందుకు తోడ్పడాలి. సమగ్రమైన పరిశీలన, అధ్యయనాల ద్వారా ముందుగా మనం వాస్తవాల గురించి, సమస్యల గురించి స్పష్టమైన అవగాహనను కలిగివుండాలి.
ముందుగా మనం సవ్యమైన వైఖరిని చేపట్టడం ద్వారా మాత్రమే ఇతరుల అపసవ్య వైఖరులను సరిదిద్దగలమని కామ్రేడ్స్ గ్రహించాలి. సవ్యంగా ప్రవర్తించడం ద్వారా మాత్రమే ఇతరుల అపసవ్య ప్రవర్తనను సరిదిద్దగలం. ఏదో సామెత చెప్పినట్లుగా "ఇతరులకు చెప్పేముందు మనలను మనం సరిదిద్దుకోవాలి. "
2. చర్చలు వాదనలు ప్రశాంతంగా జరపాలి.కొంచెం ఆవేశం తగ్గించుకుంటే మంచిది.
పార్టీ అంతరంగిక పోరాటమనేది మౌలికంగా పార్టీలోపలి విరుద్ధభావజాలాలకూ, సూత్రాలకూ మధ్య సాగే పోరాటమని కామ్రేడ్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పోరాటరూపమూ, మాట్లాడేతీరు, విమర్శించే పద్ధతి సాధ్యమైనంత తక్కువ వైరభావంతో ఉండాలి. చర్చలు వాదనలు ప్రశాంతంగా జరపాలి. సాధ్యమైనంత మేరకు క్రమశిక్షణా చర్యలను చేపట్టకుండానూ, నిర్మాణపరమైన నిర్ధారణలు చేయకుండానూ ఉండేందుకు ప్రయత్నించాలి.
సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండటం. చాలామంది పొరపాటు పడటానికి కారణమేమిటంటే ఒకవైపున భావజాలానికి, సూత్రాలకు సంబంధించి ఎలాంటి పోరాటంగానీ, స్షష్టమైన విభేదాలుగానీ వుండవు. మరోవైపున నిర్మాణానికీ పోరాటరూపాలకూ సంబంధించిన విషయాలపై శృతిమించిన పోరాటం ఉంటుంది. ముఖం కందగడ్డలా మారేవరకూ వాదనలు చేస్తారు. శాపనార్థాలు పెడతారు. రకరకాల పేర్లతో ఒకర్నొకరు పిలుచుకొంటారు. ఒండొరులు తెలుసుకోవడానికి ఇష్టపడనంతగా తగవులాడుతారు. వాళ్ల మధ్య విద్వేషం ప్రబలుతుంది. అయితే విచిత్రమేమిటంటే సూత్రాలకు, భావజాలానికి సంబంధించి వారి మధ్య విభేదాలు ఉండవు.
3.గుడ్డివాడు రాయి విసిరినట్లు ఉండరాదు.
పార్టీ నిర్మాణం పైనా లేదా కామ్రేడ్స్ పైనా, వారి పనివిధానంపైనా చేసే విమర్శలు సముచితం గాను, సక్రమంగానూ ఉండాలి.
ఒకానొక కామ్రేడ్ గురించి అంచనా వేయాలన్నా, విమర్శించాలన్నా అతని లోపాలను తప్పులను మాత్రమే నీవు ఎత్తిచూపరాదు. అవే అతని సర్వస్వమన్నట్లుగా చెప్పరాదు చెప్పుకోదగిన అతని ఘనకార్యాలను, అనుపమాన సేవలను, సద్విషయాలను, సరియైన అతని దృక్పథాన్ని కూడా వివరించాలి. ఒకవేళ అతని అభిప్రాయాల్లో సరియైనవి స్వల్పమే అయినప్పటికీ వాటిని విడిచిపెట్టకు. అలా చేయగలిగిననాడే అతని గురించి పూర్తి అంచనాకు రాగలవు, విమర్శించగలవు. తనను తాను మెరుగుపరచుకోవటానికి అతనికి తోడ్పడగలవు,
అతనికి నచ్చచెప్పగలవు. పార్టీ అంతరంగిక పోరాటంలో మనం అనుసరించవలసిన పద్ధతి ఇది.
4 పార్టీ నాయకత్వ కమిటీలోగానీ మరే ఇతర కమిటీతోగానీ విభేదించే పార్టీ సభ్యులు తమ అభిప్రాయాలను, విమర్శలను సంబంధిత పార్టీ కమిటీకి తెలియజేయాలి. అంతేగాని
జనాల మధ్య చర్చకు పెట్టరాదు.
5.ఇతర పార్టీ సభ్యులతోను లేదా నిర్దిష్టమైన బాధ్యతలని చూసే పార్టీ సభ్యులతోగానీ విభేదించే పార్టీ సభ్యులు ఆయా సభ్యుల సమక్షంలోను లేదా తత్సంబంధిత పార్టీ కమిటీలలోను విమర్శించవచ్చు. అంతేగాని జనాంతికంగా మాట్లాడరాదు.
6. పైస్థాయి పార్టీ కమిటీతో విభేదించే పార్టీ సభ్యులు గానీ లేదా దిగువస్థాయి పార్టీ కమిటీలుగానీ పైస్థాయి కమిటీ ముందు తమ అభిప్రాయాలు ఉండాలి. లేదా తద్విషయాన్ని పరిశీలించేటందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయమని కోరాలి. అదేకాకుండా ఇంకా పై
స్థాయి కమిటీకి విషయాన్ని నివేదించాలి. అంతేకాని యధాలాపంగా చర్చలు సాగించటమే లేకపోతే దిగువస్థాయి కమిటీలకు విషయాన్ని తెల్పటమో చేయరాదు పార్టీ సభ్యులెవరైనా తప్పు చేస్తున్నట్లుగానీ లేదా పార్టీ ప్రయోజనాలకు హానికరంగా ప్రవర్తిస్తున్నట్లుగానీ పార్టీ సభ్యుల దృష్టికి వచ్చినట్లయితే వారు ఆ కార్యకలాపాల గురించి సంబంధిత పార్టీ కమిటీకి తెలియజేయాలి. అంతేగాని దానిని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేయరాదు. లేదా పరస్పర లాభం కోసం ఉపయోగించుకోరాదు. నికరమైన పని విధానాన్ని పార్టీ సభ్యులు ప్రోత్సహించాలి. వంచన పూరితమైన ప్రతి దానిని వ్యతిరేకించాలి. కపటంతో కూడుకున్న మాటలను, చేతలను వ్యతిరేకించాలి. పనికి మాలిన మాటలలోనూ, కట్టుకథలల్లటంలోనూ, ఇతరుల రహస్యాల పట్ల ఆసక్తి చూపటంలోను, వదంతులను వ్యాప్తి చేయటంలోను కాలం గడిపే వారందరినీ తీవ్రంగా నిరసించాలి.
Sogood
రిప్లయితొలగించండి