వైరుధ్యం ప్రత్యేకత

     pc: grammartop.com
ప్రతి వైరుధ్యం దేనికదే దాని ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వైరుధ్యానికున్న ఈ 
ప్రత్యేకత ఒక వస్తువు నుండి మరొక వస్తువును విడదీయటానికి ఉపయోగపడుతుంది. 

1.వైరుధ్యాలు ఒకదాని నుండి ఒకటి వేరువేరుగా ఉంటాయి. అదే సమయంలో ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి.
ప్రతి సమాజం, ప్రతి సిద్ధాంతము ప్రత్యేకమైన వైరుధ్యాలను కలిగి ఉంటాయి. వాటిని బట్టి ఒకదాని నుండి మరొక దానిని వేరు చేయగలం రకరకాల వస్తువులు లేదా క్రమాలలోని ప్రత్యేక వైరుధ్యాలను అధ్యయనం చేయటం ద్వారా వాటన్నింటికి వర్తించే కొన్ని సామాన్య లక్షణాలను గ్రహించగలుగుతాం ఈ సామాన్య లక్షణాల ద్వారా ఇంకా తెలుసుకొనని ప్రత్యేక వస్తువుల గురించి అధ్యయనం చేయగలం.

 ఉదా: సముద్రపు నీరు,నదినీరు ఒకే మాదిరిగా ఉండవు. అలాగే బావి నీరు,నదినీరు ఒకే మాదిరిగా ఉండవు. కాని అన్ని రకాల నీటికి కొన్ని ఉమ్మడి లక్షణాలు ఉన్నాయి. అందువలన అన్ని రకాల నీటిలో ఉన్న సాధారణ లక్షణాలను పరిశీలించి దానిని నీరు అని పిలిచారు. రకరకాల నీటికి వాటి ప్రత్యేక వైరుధ్యాలున్నాయి. ఈ భేదాన్ని బట్టి ఒకరకమైన వీటి నుండి మరొక రకమైన నీటిని గుర్తించగలం .

2.వైరుధ్యాలన్నీ గుణాత్మకంగా ఒకే విధంగా ఉండవు. గుణాత్మకంగా భిన్నమైన వైరుధ్యాలను గుణాత్మకంగా భిన్నమైన పద్ధతుల ద్వారానే పరిష్కరించాలి

ఉదా శ్రామిక వర్గానికి, బూర్జువా వర్గానికి మధ్య గల వైరుధ్యాన్ని సోషలిస్టు విప్లవం ద్వారానే పరిష్కరించాలి. అశేష ప్రజానీకానికి, భూస్వామ్య విధానానికి మధ్య గల వైరుధ్యాన్ని ప్రజాస్వామిక విప్లవం ద్వారా పరిష్కరించాలి. వలస దేశాలకు సామ్రాజ్యవాదానికి మధ్య గల వైరుధ్యాన్ని జాతీయ విప్లవం ద్వారానే పరిష్కరించాలి. కమ్యూనిస్టు పార్టీలో వైరుధ్యాన్ని విమర్శ-ఆత్మవిమర్శ ద్వారానే పరిష్కరించాలి.

కాబట్టి ప్రతి కమ్యూనిస్టు వైరుధ్యం యొక్క విశ్వవ్యాపకత్వాన్ని తెలుసుకోవడంతోనే సరిపోదు. వస్తువులు లేదా క్రమాలలోని ప్రతి ప్రత్యేక వైరుధ్యాన్ని తెలుసుకోవాలి. వైరుధ్యం - మన విశ్వవ్యాపకత్వాన్ని వైరుధ్యం యొక్క ప్రత్యేకత్వాన్ని అధ్యయనం చేయటం అర్థం చేసుకోగలుగుతాము. వైరుధ్యం యొక్క ప్రత్యేకత్వం, విశ్వవ్యాపక స్వభావం ఒక దానిపై ఒకటి ఆధారపడుతూ విడదీయరానటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాయి.

3.ఒక వైరుధ్యం లో రెండు పరస్పర వ్యతిరేకమైన అంశాలు ఉంటాయి ఈ రెండు అంశాలు ఒక దాని స్థానాన్ని మరొకటి ఆక్రమిస్తాయి . వైరుధ్యంలోని ఈ రెండు అంశాలలో ఏదో ఒకటి మాత్రమే ప్రధానాంశంగా ఉంటుంది. ఈ ప్రధానాంశాన్ని బట్టి ఆ వస్తువు లేదా క్రమం యొక్క లక్షణాలను నిర్ణయించాలి. పరిస్థితులు మారితే ఈ ప్రధానాంశంఅప్రధానాంశంగాను, ఆ అప్రధానాంశం ప్రధానాంశంగాను మారుతుంది. దీనికనుగుణంగానే ఆ వస్తువు లేదా యొక్క లక్షణం మారుతుంది. ప్రధానాంశము ఆ ప్రధానాంశంపై ఆధిక్యతను కలిగి ఉంటుంది. మనం ఎల్లప్పుడు వస్తువులను పరిశీలించేటప్పుడు తప్పక వైరుధ్యంలోని ప్రధానాంశాన్ని గుర్తించాలి. దీనిని తెలుసుకోలేకపోతే వైరుధ్యాన్ని సరిగ్గా పరిష్కరించలేము.

ఉదా : ఒక కమ్యూనిస్టును అంచనా వేసేటప్పుడు అతనిలో కమ్యూనిస్టు కాని లక్షణాలు, కమ్యూనిస్టు లక్షణాలు రెండూ వుంటాయి. రెండూ పరస్పరం ఘర్షణ పడుతూ వుంటాయి. రెండింటిలో కమ్యూనిస్టు లక్షణాలు ప్రధానాంశంగా ఉన్నప్పుడు కమ్యూనిస్టుగా ఉంటాడు కమ్యూనిస్టు కాని లక్షణాలు కూడా కొనసాగుతాయి. అయితే అప్రధానాంశంగా ఉంటుంది. ఈ రెండింటిని సరిగ్గా నిర్ధారించుకోకపోతే తీవ్రమైన పొరపాట్లకు గురవుతాము.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..