పోస్ట్‌లు

తెలుగు చోళులు: చారిత్రక పరిణామం

 తెలుగు నేల హిస్టరీలో, ముఖ్యంగా రాయలసీమ మరియు నెల్లూరు ప్రాంతాల సామాజిక, రాజకీయ పరిణామాలలో **తెలుగు చోళుల (చోడుల)** పాత్ర అత్యంత కీలకమైనది. ప్రాచీన చోళ చక్రవర్తి కరికాల చోళుని వారసులమని చెప్పుకున్న వీరు, క్రీ.శ. 6వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు వివిధ శాఖలుగా విడిపోయి పరిపాలన సాగించారు. వీరి పరిపాలనా కాలం తెలుగు భాషా వికాసానికి మరియు వాస్తుశిల్ప కళకు స్వర్ణయుగంగా నిలిచింది. ## **తెలుగు చోళులు: చారిత్రక పరిణామం - సమగ్ర వ్యాసం** ### **1. రేనాటి చోళులు: తెలుగు భాషా విప్లవకారులు** తెలుగు చోళ శాఖల్లో అన్నిటికంటే ప్రాచీనమైనది రేనాటి చోళ వంశం. వీరు ప్రస్తుత కడప జిల్లాలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం ప్రాంతాలను (రేనాడు - ఏడు వేల గ్రామాల ప్రాంతం) కేంద్రంగా చేసుకుని పాలించారు.  * **శాసన ఆధారాలు:** క్రీ.శ. 575 నాటి **ఎర్రగుడిపాడు శాసనం** వీరి చరిత్రలో మైలురాయి. ధనంజయుడు వేయించిన ఈ శాసనం, తెలుగులో లభించిన మొట్టమొదటి పూర్తిస్థాయి గద్య శాసనం. అంతకుముందు శాసనాలు సంస్కృతంలో ఉండగా, ప్రజల భాష అయిన తెలుగులో శాసనాలు వేయించిన ఘనత వీరికి దక్కుతుంది.  * **ప్రముఖ రాజులు:** నందివర్మ, సింహవ...

మేడే"

 "మేడే" ** అమరవీరుల వైభవోజ్వల సాహసగాథ __ విలియం అడెల్మన్ విషయసూచిక *ముందుమాట *ప్రవేశిక * హేమార్కెట్ పునర్దర్శనం *కాలక్రమణిక ***** *ముందుమాట __  ఎం.కె. పాంథే చరిత్రాత్మకమైన మేడేను కార్మికవర్గ సంఘీభావాన్ని తెలియచెప్పే అంతర్జాతీయ దినంగా యావత్ప్రపంచమూ జరుపుకుంటున్నది. అయితే, దీనిలోని విప్లవాంశను విస్మరించి కేవలం మొక్కుబడిగా జరుపుకునే ఒకానొక ధోరణి కార్మికవర్గ వుద్యమంలో తలెత్తుతున్నది. హేమార్కెట్ అమరవీరుల త్యాగాలను మాటల్లో కీర్తిస్తున్నప్పటికీ, పెట్టుబడిదారుల దాడులకు వ్యతిరేకంగా వర్గపోరాటాన్ని బలోపేతం చేసే నిర్మాణాత్మక చర్యలను చేపట్టక పోవటంవల్ల ఆచరణలో మేడే దినోత్సవాల వుద్దేశ్యమే వెనక్కు పోతున్నది. పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రపంచ కార్మికవర్గాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చింది మేడే అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. "ప్రపంచ కార్మికులారా ఐక్యంకండు" అన్న సమర నినాదాన్ని ఆచరణలో నిజం చేయటంలో అది మహత్తరమైన శక్తిని ప్రదర్శించింది. సకల దేశాలలోని కార్మికవర్గంపై నయా బానిసత్వాన్నీ రుద్దేటందుకై ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సాగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాన...

కాలం చెరిపేయలేని సంతకం – పారిస్ కమ్యూన్ పోరాటం

కాలం చెరిపేయలేని సంతకం – పారిస్ కమ్యూన్  పోరాటం మానవ చరిత్రలో కొన్ని సంఘటనలు కాలగర్భంలో కలిసిపోవు. అవి ఓడిపోవచ్చు, రక్తసిక్తంగా అణచివేయబడవచ్చు, కానీ వాటి స్ఫూర్తి యుగాలపాటు జీవిస్తుంది. అలాంటి చారిత్రక సంఘటనలలో ఒకటి 1871లో జరిగిన పారిస్ కమ్యూన్. ఇది కేవలం ఒక తిరుగుబాటు కాదు—ప్రపంచ శ్రామికవర్గం చరిత్రలో తొలిసారి స్వయంగా అధికారాన్ని స్వాధీనం చేసుకున్న విప్లవాత్మక ప్రయోగం. 1871 మార్చి 18న పారిస్ ప్రజలు ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు—“మన జీవితాలను మనమే పాలించాలి.” ఈ నిర్ణయం ద్వారా ఏర్పడిన పారిస్ కమ్యూన్ కేవలం 72 రోజులు మాత్రమే నిలిచినా, అది చరిత్రలో ఒక అరుణతారగా నిలిచింది. ఆ కొద్ది కాలంలోనే కార్మికులు, చేతివృత్తులవారు, చిన్న వ్యాపారులు, కళాకారులు, స్త్రీలు—అందరూ కలిసి ఒక కొత్త ప్రజా పాలనను నిర్మించారు. ఇది సంప్రదాయ పాలనలతో పూర్తిగా భిన్నమైనది. అధికారాన్ని ప్రజలే ఎంచుకున్నారు. అధికారుల జీతాలు సాధారణ కార్మికుల స్థాయిలోనే నిర్ణయించబడ్డాయి. ప్రజలకు ప్రతినిధులను ఎప్పుడైనా వెనక్కి పిలిచే హక్కు ఉంది. ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం. కేవలం 72 రోజుల్లో పారిస్ కమ్యూన్ అనేక విప్లవాత్మక ని...
“సమ్మె ఒక పోరాట పాఠశాల ప్రతి అణచివేత  ఉద్యమానికి ఒక ఆయుధం”         కార్మిక వర్గ చరిత్రను పరిశీలిస్తే ఒక గొప్ప సత్యం స్పష్టమవుతుంది—కార్మికుల విముక్తి కేవలం ఆర్థిక డిమాండ్ల ద్వారా సాధ్యం కాదు.  లెనిన్  చెప్పినట్టు, కార్మికులు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు; ఆ అణచివేతలో ప్రతి రూపాన్ని ఉద్యమానికి ఆయుధంగా మలచుకోవాలి. సమాజంలో రాజకీయ దోపిడీ ఒక వర్గానికే పరిమితం కాదు. అది పారిశ్రామిక జీవితం, పౌర జీవితం, వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవస్థ, మతం, విద్య—అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వ నిరంకుశత్వం, పోలీసు జులుం, అధికారుల అవినీతి, మతపరమైన వివక్ష—ఇవి అన్నీ ప్రజలలో అసంతృప్తిని పెంచుతాయి. ఈ అసంతృప్తిని ఉద్యమంగా మలచడం, దానిని ప్రజల ముందుకు తీసుకురావడం—ఇదే నిజమైన రాజకీయ చైతన్యం నిర్మాణం. సాధారణంగా ఆర్థిక పోరాటాలే ప్రజలను రాజకీయ పోరాటాల్లోకి తీసుకువస్తాయని భావిస్తారు. కానీ లెనిన్  అభిప్రాయంలో  ప్రజలు అనుభవించే ప్రతి నిరంకుశ చర్య—పోలీసుల దౌర్జన్యం, పన్నుల దోపిడీ, విద్యా-వైద్య హక్కుల నిరాకరణ—ఇవన్నీ రాజకీయ ఉద్యమాలకు బలమైన ప్ర...

కాలం చెరిపేయలేని సంతకం” – పారిస్ కమ్యూన్

“కాలం చెరిపేయలేని సంతకం” – పారిస్ కమ్యూన్ పరిచయం మానవ చరిత్రలో కొన్ని సంఘటనలు కాలంతో మాయమవ్వవు. అవి ఓటమి చెందవచ్చు, అణచివేయబడవచ్చు, కానీ వాటి స్ఫూర్తి చరిత్రలో చెరగని ముద్రలా నిలిచిపోతుంది. అటువంటి సంఘటనల్లో ఒకటి Paris Commune. 1871 మార్చ్ 18న పారిస్‌లో ప్రారంభమైన ఈ మహత్తర ప్రయోగం కేవలం 72 రోజులు మాత్రమే నిలిచింది. మే 28న అది రక్తపాతం మధ్య ముగిసింది. కానీ ఆ 72 రోజులు ప్రపంచ చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించాయి. అందుకే పారిస్ కమ్యూన్ ఒక సంఘటన కాదు—అది ఒక సంతకం. కాలం చెరిపేయలేని సంతకం. --- విప్లవానికి దారితీసిన పరిస్థితులు ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధం (1870–71) ఫ్రాన్స్‌ను రాజకీయంగా, ఆర్థికంగా కుదిపేసింది. పాలక వర్గం వైఫల్యం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఆకలి, నిరుద్యోగం, అవమానం—ఈ మూడూ కలిసి ఒక విప్లవానికి బీజం వేశాయి. పారిస్ ప్రజలు ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు: 👉 “మన జీవితాలను మనమే నియంత్రించాలి.” ఇది కేవలం తిరుగుబాటు కాదు—ఇది ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించాలనే సంకల్పం. --- ప్రపంచంలో తొలి కార్మిక వర్గ ప్రభుత్వం పారిస్ కమ్యూన్ ప్రత్యేకత ఏమిటంటే, అది అధికారాన్ని ఒక వర్గం నుంచి మరొక...

పారిస్ కమ్యూన్ కి నేటికి 155 ఏండ్లు*

*పారిస్ కమ్యూన్ కి నేటికి 155 ఏండ్లు*           *ఆ కమ్యూన్ ఒక ఎత్తయితే దాని పట్ల మార్క్స్, ఎంగెల్స్ ల వైఖరి మరో ఎత్తు*                             పారిస్ కమ్యూన్ 18-3-1871 తేదీన ఏర్పడింది. 28-5-1871 తేదీన రక్తసిక్త భౌతిక ఓటమితో ముగిసింది. భౌతికంగా 71 రోజులే మనుగడలో వుంది. కానీ రాజకీయంగా చరిత్రలో చిరకాలం వర్దిల్లుతుంది. భూమండలంలో తొలి సోషలిస్టు విప్లవం పారిస్ కమ్యూన్ ఏర్పడ్డాక 46 ఏండ్ల తర్వాత 1917 లో రష్యాలో జరిగింది. దానికి డ్రెస్ రిహార్సల్ వంటిదిగా 1905 నాటి ప్రధమ రష్యా విప్లవాన్ని లెనిన్ వర్ణించాడు. అది రష్యన్ విప్లవ కోణంలో సరైనది. కానీ ప్రపంచ విప్లవాల దృష్టికోణంలో పారిస్ కమ్యూన్ డ్రెస్ రిహర్సల్ వంటిదని చెప్పొచ్చు. అట్టి విశిష్ట ప్రాపంచిక రాజకీయ ప్రాధాన్యత గల పారిస్ కమ్యూన్ ఏర్పడి నేటికి 155 ఏండ్లు! ఆ సందర్బ ప్రతిస్పందన యిది.    పారిస్ కమ్యూన్ చరిత్ర గూర్చి గానీ, ఆ చరిత్రకు గల రాజకీయ విశిష్టత గూర్చి గానీ, సమకాలీన ప్రపంచంలో ఆ చరిత్ర సంస్మరణకు గల ప్రాధాన్యత లేదా ప్రాసంగికత...

పారిస్ కమ్యూన్

​ పారిస్ కమ్యూన్  ఇవాళ పారిస్ కమ్యూన్ స్థాపించిన రోజు. 155 సంవత్సరాలు. డెబ్బైరెండు రోజుల్లోనే అది ఓడిపోయినప్పటికీ, మానవజాతి చరిత్రలో అది ఒక అరుణతార.  పారిస్ కమ్యూన్ చరిత్ర మీద, జయాపజయాల మీద 2017లో నేను చేసిన సుదీర్ఘ ఉపన్యాసం రెండు భాగాలు ఐదు సంవత్సరాల కింద ఇక్కడ పోస్ట్ చేశానని ఫేస్ బుక్ గుర్తు చేయగా ఇప్పుడే ఇక్కడే మళ్లీ షేర్ చేశాను.  అదే సందర్భంలో పారిస్ కమ్యూన్ లో చిట్టచివరి కమ్యూనార్డులను నిలబెట్టి కాల్చిచంపిన గోడను చూసిన అనుభవంతో 2021 మే 21న రాసిన పోస్టును కూడా మరొకసారి మీతో పంచుకుంటున్నాను.   ** శ్రామికవర్గ తొలి అమరవీరుల స్మారక చిహ్నం - పారిస్ కమ్యూనార్డుల గోడ  ఇవాళ్టికి సరిగ్గా నూటయాబై సంవత్సరాల కింద నూట నలబై ఏడు మంది కమ్యూన్ పరిరక్షకులను ఒక గోడ ముందు నిలబెట్టి, కాల్చి చంపి, మృత దేహాలను గోడ పక్కన కందకం లోకి తోసేశారు.  అది 1871 మే 27. పారిస్ లోని పెర్ లాషాయిస్ ఖనన స్థలి.  అప్పటికి పది వారాలుగా సాగుతున్న పారిస్ కమ్యూన్ ను, తొట్టతొలి శ్రామిక వర్గ రాజ్యాధికారాన్ని కాపాడుకునే చిట్టచివరి ప్రయత్నంలో ఈ నూట నలబై ఏడు మంది వీరులు ఒరిగిపోయారు.  వ్యవస్థను...

ప్రపంచ ఆర్థిక సంక్షోభం

​ 🟥📰 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం సామ్రాజ్యవాద దోపిడీ – ధరల పెరుగుదల – శ్రమజీవులపై యుద్ధం ✍️ By UTF లక్ష్మి రాజా “పెట్టుబడిదారీ సంక్షోభం: లాభాల కోసం ప్రపంచాన్ని త్యాగం చేస్తున్న సామ్రాజ్యవాద శక్తులు” ప్రపంచం నేడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం సహజసిద్ధంగా వచ్చినది కాదు; ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అంతర్గత విరోధాల ఫలితం. మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారం, ప్రతి సంక్షోభం పెట్టుబడిదారీ వ్యవస్థలోని దోపిడీ, అసమానత, లాభదాహం యొక్క ప్రతిబింబం. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆకలి, పేదరికం – ఇవన్నీ ఒక్కో సంఘటనలు కావు; ఇవి ఒకే వ్యవస్థకు చెందిన లక్షణాలు. ఈ వ్యవస్థను అర్థం చేసుకోకుండా సమస్యలను పరిష్కరించడం అసాధ్యం. 🌍 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ: పెట్టుబడిదారీ స్వరూపం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి లక్ష్యం ప్రజల అవసరాలను తీర్చడం కాదు; లాభాలను పెంచడం. ఈ వ్యవస్థలో: ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతాయి కార్మికుల శ్రమను దోచుకుని అదనపు విలువ (Surplus Value) సృష్టిస్తారు మార్కెట్ నియంత్రణ ద్వారా ధరలను నియంత్రిస్తారు 🔍 మార్క్సిస్టు విశ్లేషణ కార్ల్ మార్క్స్ చెప్పినట...

మేడే - నిర్దిష్టమైన విప్లవ క ర్తవ్యాలు.

* మేడే - నిర్దిష్టమైన విప్లవ క ర్తవ్యాలు. మేడే అంటే కేవలం అంతర్జాతీయ సౌహార్ద్రతను జనరల్ గా ప్రకటన చేయమని అర్ధంకాదని గూడా లెనిన్ కార్మికులకు చెప్పారు. ఆయా దేశాలలో కార్మికులు ఎదుర్కొంటున్న నిర్దిష్టమైన విప్లవ కర్తవ్యాలకు అంకితం కావాలి. విప్లవకర ప్రాధాన్యతగల తక్షణ ఆర్థిక కోర్కెలను, అంతర్జాతీయ సౌహార్దత సోషలిజంపట్ల జనరల్ గా వాంఛను కలిపి ప్రకటించడం సరిపోదు. సోషలిజం లక్ష్యాన్ని చేరుకునేందుకు, కార్మికవర్గం తాను ఎదుర్కొంటున్న నిర్దిష్ట విప్లవ సమస్యలను పట్టించుకోవాలి. అందువల్ల మేడే సభలలో పెట్టుబడి దారీ విధానానికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో భాగంగా ఈ సమస్యలను లేవనెత్తడం అవసరం, ఇది 1902లో నార్తరన్ లీగ్ కు రాసిన తన లేఖలో లెనిన్ చెప్పింది. "మనదేశంలో మేడే ప్రదర్శనలు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, రాజకీయ స్వేచ్ఛకోనం జరిగే ప్రదర్శనగా గూడా తయారైందని గూడా చేర్చి వుండా ల్సింది. ఆ పవిత్ర దినం గురించిన అంతర్జాతీయ ప్రాధాన్యతను ఎత్తి చూపడంతో సరిపోదు, దానిని కీలకమైన జాతీయ రాజకీయ డిమాండ్లతో జత చేయాలి. (సంపూర్ణ రచనలు 6వ భాగం పేజీ 168. 1903లో రానున్న మేదే సందర్భంలో సహితం లెనిన్ అదే అంశాన్ని నొక్కి చెప్పారు. ...

కారల్‌ మార్క్స్

చిత్రం
మార్చి14కారల్‌ మార్క్స్‌ వర్థంతి ----------------------------  మానవ చరిత్ర మలుపుల గుట్టు విప్పిన మహోన్నతుడు’ కారల్‌ మార్క్స్‌ వర్థంతి మార్చి14 మానవ జాతి చరిత్ర అంతా అతీత శక్తుల, పుణ్యపురుషుల సృష్టింగా గోషిస్తుంటే మానవుడే చరిత్ర నిర్మత అన్న మహోన్నత వ్యక్తి కారల్‌ మార్క్స్‌ . ప్రకృతిలోని సకల జీవకోటికి భిన్నంగా మానవుడు పరికరాలు ఉత్పత్తి చేసి ప్రకృతిని తనకు బానిసగా చేసుకొని మానవ చరిత్రను తానే నిర్మించాడని మార్క్స్ ఉద్బోధించాడు .చారిత్రక భౌతిక వాదంతో గత చరిత్రనే కాదు భవిష్యత్ ఎలా నడుస్తుందో వివరించి చెప్పిన మహోన్నతుడు. అద్భుతమైన అధ్యయనంతో అనితర సాధ్యమైన కృషితో మానవజాతిని ప్రభావితం చేశాడు.    మరణించి 131 ఏళ్ళు లైనా ప్రపంచాని ప్రభావితం చేస్తూనే వున్నాడు. ఆయన చూపిన మార్గంలో కోటాను కోట్ల మంది పయనిస్తూనే వున్నారు.  మార్క్స్ జీవించి నాటిక ప్రపంచ పరిస్థితి  అప్పటికి వెనుకబడివున్న ఐరోపాఖండంలో ‘‘ఫూడలిజం’’కు వ్యతిరేకంగా సాగిన పోరాటాలు కొత్తసమాజ నిర్మాణానికి బాటలువేశాయి. ఈ పోరాటాలు14వ శతాబ్దం నుండి సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలే వేశాయి. 1455లో గూటెన్‌బర్గ్...

ఐక్యపోరాటాలు

*🚩ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో ఐక్యపోరాటాలకు పునరంకితమవుద్దాం!🚩*♦️♦️♦️♦️♦️ *భారతదేశంలో జాతీయోద్యమం, కార్మికోద్యమం పెనవేసుకొనే సాగాయి.ఏఐటియుసి ఏర్పడ్డ ప్రారంభ దినాల్లో జాతీయోద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులే ఆ తరువాత ఏఐటియుసికి నాయకత్వం వహించారు. బి.టి.రణదివే,పి.రామ్మూర్తి, డాంగే,ఘాటే వంటి ఎందరో కమ్యూనిస్టు నాయకులు కూడా కీలక పాత్ర పోషించారు. అందుకనే ఇటు జాతీయోద్యమంలోనూ,అటు కార్మికోద్యమంలోనూ మిలిటెంట్‌ పోరాటాల ఉధృతి సాగింది.* 1920 లో ఏర్పడ్డ                    ఏఐటియుసి కార్మిక సంస్థను భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి మూడునెలల ముందు ఏఐటియుసిలో చీలికలకు కాంగ్రెస్‌ పార్టీ పావులు కదిపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికి పాత్రధారి, సూత్రధారుడు.1947 జూన్‌లో  ఐ ఎన్ టి యు సి ఏర్పడింది. దీంతో ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చీలికలు ప్రారంభం అయ్యాయి. ఆ తరువాత 1948లో హిందూ మజ్దూర్‌ సభ ఏర్పడింది. 1948లో యుటియుసి, 1955లో భారతీయ మజ్దూర్‌ సంఘ్ (బిఎంఎస్‌),1958లో యుటియుసి లెనిన్‌ సారాని తదితర కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి.కాల క్రమేణా ఏఐటియుసి .పాలకవర్గ స్వ...