స్థానిక స్వపరిపాలన- పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiFdN3zLRFv0DYrc8R4cGej7qhfYGB3LJH3gioQ2ce47fCRcU3AO1RmxIgppERWgK3yjeIJLrvvtuSRlUoM6YCpHbzPAtVpsJLkA02paOcTWKrERYFzzev89WJF83-sdeQIndpKne9s8Ic/s1600/1631939278180098-0.png)
pc: Eenadu.net 19వ శతాబ్దాంతంలో చేయబడిన వివిధ చట్టాల ప్రకారం ఏర్పడిన గ్రామ పంచాయతీలకు మాత్రం వారి కార్యక్రమాలకు తగిన నిధులు అందేవి కాదు. గ్రామ పంచాయతీలు కేవలం కేంద్రంలోని వలస పాలకులు అధికార గణానికి గ్రామాల్లోని స్వార్థపర శక్తులుగా, భూస్వాములుకు మధ్య వారథిగా మాత్రమే వుపయోగపడేవి. అప్పుడే వునికిలోనికి వచ్చిన జాతీయోద్యమం 1909లో జరిగిన లాహోర్ కాంగ్రెసు జాతీయ మహాసభల్లో తీర్మానించినట్లుగా (మాలవీయ 1956) స్థానిక సంస్థలకు బలోపేతం చెయ్యడానికి ఉత్సాహం చూపింది. కాంగ్రెసు మహాసభ తగినన్ని ఆర్థిక వనరులతో ఎన్నికైన పంచాయతీలు కావాలని డిమాండ్ చెయ్యడమేగాక, స్థానిక స్వపరిపాలనా సంస్థల ఏర్పాటులో బ్రిటిష్ పాలకులు అనుసరిస్తున్న అలసత్వ ధోరణిని దుయ్యబట్టింది. వలస పాలనకు ముందున్న ప్రాచీన గ్రామీణ వ్యవస్థ వలస పాలకులచే కూలగొట్టబడినా, బలమైన జాతీయ భావాలకు పుగా నిలిచింది. గాంధీజీ గ్రామీణ స్వపరిపాలనే దేశానికి ఆదర్శమని బోధించడమేగాక. అసలు ఆయన ఉద్దేశంలో స్వరాజ్యమంటే గ్రామ స్వరాజ్యమే. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రవేశపెట్టబడిన మాంటేగు చెమ్స్ వర్డ్ సంస్కరణల తరువాత స్థానిక సంస్థల ఏర్పాటు పందుకని, భారతదేశంలోని వివ...